ధోని వల్లే అవకాశాలు
భారత జట్టులో చోటుపై పేసర్ మోహిత్
న్యూఢిల్లీ: రంజీల్లో అద్భుత ప్రదర్శన చేసి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చోటు దక్కించుకున్న పేసర్ మోహిత్ శర్మ అనతి కాలంలోనే జాతీయ జట్టులోనూ మెరిశాడు. ఆసీస్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఇషాంత్ శర్మ స్థానంలో బరిలోకి దిగిన ఈ ఫరీదాబాద్ కుర్రాడు అక్కడా ప్రతిభ చూపి 13 వికెట్లు తీయగలిగాడు. అయితే ఇదంతా కెప్టెన్ ధోని వల్లే జరిగిందని చెబుతున్నాడు.
దోని లేకుంటే భారత జట్టు తరఫున ఆడేవాడిని కాదేమో అని అన్నాడు. ‘ఇప్పటిదాకా నాకు లభించిన అవకాశాలన్నీ ధోని పుణ్యమే. అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్తగా అడుగుపెట్టిన ఆటగాడికెవరికైనా కెప్టెన్ మద్దతు అత్యంత అవసరం. అది లేకుంటే రాణించడం సులువు కాదు. ఐపీఎల్‌తో పాటు భారత జట్టులోనూ ధోని నాయకత్వంలోనే ఆడటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. మైదానం లోపలా.. బయటా అన్ని విషయాల్లోనూ తను సహాయంగా ఉంటాడు.
చెన్నై జట్టుతో చేరిన కొత్తలో ధోని నాతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఇలాంటి స్థితి ఉన్నప్పుడు మనం ఏదో తప్పు చేస్తున్నట్టుగా భావిస్తాం. అయితే తనతో ఒకసారి మాట్లాడేసరికి ఇదంతా భ్రమేనని అనిపించింది. ‘నేను నేరుగా వచ్చి నీతో మాట్లాడితే ఒత్తిడిగా భావించి సరిగా రాణించవు. నీవిప్పటికే రంజీల్లో అద్భుతంగా రాణించి ఇక్కడిదాకా వచ్చావు’ అని ధోని నాతో అన్నాడు. ఓ కొత్త ఆటగాడికి ఇలాంటి మాటలు ఎంతగానో బలాన్నిస్తాయి’ అని 26 ఏళ్ల మోహిత్ అన్నాడు. 2013లో అరంగేట్రం చేసిన తను ఇప్పటిదాకా 20 వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడ