
IPL 2023 GT Vs SRH- Mohammed Shami: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీ. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. రైజర్స్ ఓపెనర్ అన్మోల్‌ప్రీత్ సింగ్(5), కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్(10), రాహుల్ త్రిపాఠి (1), హెన్రిచ్ క్లాసెన్ (64) రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
పర్పుల్ క్యాప్ అందుకున్న షమీ
టాపార్డర్‌ను కకావికలం చేసిన షమీ.. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి మొత్తంగా 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. తద్వారా గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ప్లే ఆఫ్స్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శనతో అదరగొట్టిన షమీ.. పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.
ఐపీఎల్-2023 సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో 23 వికెట్లు తీసిన ఈ టీమిండియా పేసర్.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంతరం షమీ.. కామెంటేటర్ రవిశాస్త్రితో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
నువ్వేం తింటావు? గుజరాత్‌లో ఉన్నాను కదా!
నువ్వేమి తింటావు? షమీ అంటూ రవిశాస్త్రి షమీని అడుగగా.. ‘‘గుజరాత్‌లో ఉన్నాను కదా! నాకు ఏది ఇష్టమో అది తినలేకపోతున్నా!’’ అని సరదాగా బదులిచ్చాడు. దీంతో ఇద్దరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుకున్నారు. కాగా షమీకి బిర్యానీ అంటే ఇష్టం అన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో తన ఫేవరెట్ బిర్యానీని మిస్ అవుతున్నానంటూ షమీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఇక తన బౌలింగ్ గురించి చెబుతూ.. ‘‘సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌల్ చేయడానికి ప్రయత్నిస్తాను. నా బలం అదే! కొత్త బంతిని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకుంటా.
వాళ్లు సైతం
నేటి మ్యాచ్‌లో మిడిల్ ఓవర్లలో మోహిత్ శర్మ అద్భుతం చేశాడు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ కూడా తమ వంతు పాత్ర పోషించారు’’ అని మహ్మద్ షమీ చెప్పుకొచ్చాడు. కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ సెంచరీ సాధించడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్‌కు గుజరాత్ బౌలర్లు చుక్కలు చూపించారు. షమీ, మోహిత్ శర్మ నాలుగేసి వికెట్లతో చెలరేగగా.. యశ్ దయాల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. టైటాన్స్ బౌలర్ల విజృంభణతో 154 పరుగులకే పరిమితమైన సన్‌రైజర్స్ ఓటమిపాలై ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న గుజరాత్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!
ఆరోజు నైట్ పార్టీకెళ్లా.. ఔటయ్యా..! అప్పటి నుంచి: విరాట్ కోహ్లి
.@MdShami11 with the new ball is a MOOD 🔥🔥 #TATAIPL | #GTvSRH | @gujarat_titans
— IndianPremierLeague (@IPL) May 15, 2023
Relive his lethal start with the ball here 🎥🔽 pic.twitter.com/2Na7SBcDu8