Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ ప్రయోగం వికటించింది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ కల్పించి పించ్ హిట్టర్‌గా మూడో స్థానంలో పంపితే అతను మాత్రం డకౌట్ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అయితే ఇక్కడ మోహిత్ క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. మిడాన్ నుంచి వెనక్కి పరిగెత్తిన మోహిత్ శరీరాన్ని విల్లులా ఒంపి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో శార్దూల్ కథ ముగిసింది. అంతకముందే మోహిత్ ఎడమచేతి వేలికి గాయమైంది. ఐస్ ప్యాక్ పెట్టుకొని ఫీల్డింగ్ చేశాడు. గాయాన్ని సైతం లెక్కచేయకుండా స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు.
శార్దూల్‌కు కలిసి రాని ప్రమోషన్
ఇక శార్దూల్ ఠాకూర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇచ్చిన ప్రతీసారి అతనికి కలిసిరాలేదని చెప్పొచ్చు. తన టి20 కెరీర్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ రావడం శార్దూల్‌కు ఇదే తొలిసారి. ఇంతకముందు 2021 ఐపీఎల్‌లో క్వాలిఫయర్‌లో భాగంగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఢిల్లీ తరపున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పుడు గోల్డెన్ డకౌట్ అయిన శార్దూల్ తాజాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో పించ్ హిట్టర్‌గా వచ్చి(మూడోస్థానంలో) డకౌట్‌గా వెనుదిరిగాడు.
Mohit Sharma you beauty 🔥🔥
— IndianPremierLeague (@IPL) April 29, 2023
A remarkable catch running backwards to dismiss Shardul Thakur 👏🏻👏🏻#TATAIPL | #KKRvGT pic.twitter.com/QOOS30qusH
Comments
Please login to add a commentAdd a comment