Amit Mishra: స్టన్నింగ్‌ క్యాచ్‌.. వయసుతో పనేంటి? | 40 Year Old Amit Mishra Took Brilliant Diving Catch Stunned Cricket Fans | Sakshi
Sakshi News home page

Amit Mishra: స్టన్నింగ్‌ క్యాచ్‌.. వయసుతో పనేంటి?

Published Fri, Apr 7 2023 9:20 PM | Last Updated on Fri, Apr 7 2023 9:20 PM

40 Year Old Amit Mishra Took Brilliant Diving Catch Stunned Cricket Fans - Sakshi

Photo: IPL Website

లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌ అమిత్‌ మిశ్రా 40 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్నాడు. ఒక క్రికెటర్‌కు 40 ఏళ్లు వచ్చాయంటే మాములుగా అయితే రిస్క్‌లు చేయడానికి ఇష్టపడడు. కానీ మిశ్రా అలా కాదు. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో అమిత్‌ మిశ్రా స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన యష్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో రాహుల్‌ త్రిపాఠి థర్డ్‌మన్‌ దిశగా ఆడాలనుకున్నాడు.

అయితే బంతి ఔట్‌సైడ్‌ అయి బ్యాట్‌ ఎడ్జ్‌ అయి గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న అమిత్‌ మిశ్రా ఎడమవైపుకు డైవ్‌ చేస్తూ అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు. మిశ్రా కళ్లు చెదిరే క్యాచ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ''స్టన్నింగ్‌ క్యాచ్‌.. వయసుతో పనేంటి అని మిశ్రా నిరూపించాడు''.. ''40 ఏళ్ల వయసులోనూ స్టన్నింగ్‌ క్యాచ్‌ తీసుకున్న మిశ్రాకు హ్యాట్సాఫ్‌'' అంటూ కామెంట్‌ చేశారు.

ఇక బౌలింగ్‌లోనూ అమిత్‌ మిశ్రా మెరిశాడు. తన ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసిన అమిత్‌ మిశ్రా ఐపీఎల్‌లో తన వికెట్ల సంఖ్యను 168కి పెంచుకున్నాడు. మార్క్‌వుడ్‌ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అమిత్‌ మిశ్రా తుది జట్టులోకి వచ్చాడు. ఓవరాల్‌గా అమిత్‌ మిశ్రా ఐపీఎల్‌లో 155 మ్యాచ్‌లాడి 168 వికెట్లు తీసుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement