Photo: IPL Twitter
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. మార్క్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ ఐదో బంతిని జితేశ్‌శర్మ మిడాఫ్ దిశగా ఆడాడు. బంతి కచ్చితంగా బౌండరీ వెళుతుందన్న దశలో కేఎల్ రాహుల్ తన ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శించాడు.
బంతి అతనికి చాలా దూరంలో ఉన్నప్పటికి సూపర్ టైమ్‌లైన్‌తో స్పందించిన రాహుల్ అమాంతం ఒకవైపుగా డైవ్‌చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. లక్నో కెప్టెన్ దెబ్బకు జితేశ్ శర్మ నోట మాట రాక బిత్తరపోయాడు. రాహుల్ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక కేఎల్ రాహుల్ ఇవాళ్టి మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ రాణించాడు. 56 బంతుల్లో 74 పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌కు ఈ సీజన్‌లో ఇదే తొలి అర్థసెంచరీ కావడం విశేషం. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
उड़ता राहुल #KLRahul #LSGvPBKS @LucknowIPL #IPL23 pic.twitter.com/koq3dTTj4R
— KUNAL KOUSHAL (@KUNALKOUSHAL65) April 15, 2023
WHAT A CATCH BY KL RAHUL. pic.twitter.com/cFzyRdQbQ0
— Johns. (@CricCrazyJohns) April 15, 2023
An absolute blinder from KL Rahul to dismiss Jitesh Sharma🔥
— SBM Cricket (@Sbettingmarkets) April 15, 2023
📸: JioCinema#KLRahul #JiteshSharma #LSGvPBKS #LSGvsPBKS #PBKSvLSG #PBKSvsLSG #TATAIPL #TATAIPL2023 #IPL #IPL2023 #IndianPremierLeague #Cricket #SBM pic.twitter.com/VttOONPJrC
చదవండి: 'ఆ నవ్వుకే పడిపోయాడనుకుంటా..'
Comments
Please login to add a commentAdd a comment