
PC: IPL Twitter
ఐపీఎల్ 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఇచ్చిన క్యాచ్‌ను వెనక్కి పరిగెడుతూ అద్బుతంగా బ్యాలెన్స్ చేసుకొని క్యాచ్ తీసుకున్నాడు. చమీర వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. అప్పటికే మయాంక్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 25 పరుగులతో జోరు కనబరుస్తున్నాడు. తన చిరకాల మిత్రుడిని ఔట్ చేయడానికి రాహుల్ బంతిని చమీర చేతిలో పెట్టాడు.
ఆ ఓవర్ తొలి బంతిని సూపర్ సిక్స్ కొట్టాడు. అయితే నాలుగో బంతిని షాట్ ఆడే క్రమంలో మిడాఫ్ దిశగా గాల్లోకి ఆడాడు. అయితే కేఎల్ రాహుల్ వెనక్కి పరిగెట్టి తన తలపై నుంచి పడిన బంతిని ఏ మాత్రం మిస్టేక్ చేయకుండా ఒడిసి పట్టుకున్నాడు. దీంతో మయాంక్ కథ ముగిసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ మంచి మిత్రులున్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఈ ఇద్దరు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కలలు గన్నారు. తమ కలను నెరవేర్చుకున్నారు.
చదవండి: IPL 2022: డికాక్ నిజాయితీని మెచ్చుకొని తీరాల్సిందే!
#LSGvsPBKS pic.twitter.com/t4MB77FyjN
— Vaishnavi Sawant (@VaishnaviS45) April 29, 2022