లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై కేఎల్ రాహుల్ అభిమానులు మండిపడుతున్నారు. కెప్టెన్ పట్ల మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంతకు ముందు ఏ జట్టు ఓనర్ కూడా ఇలా ప్రవర్తించినట్లు చూడలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా లక్నో జట్టు బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడింది. టాస్ గెలిచిన లక్నో సారథి కేఎల్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, సొంత మైదానం ఉప్పల్‌లో ప్యాట్ కమిన్స్ బృందం సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది.
సన్‌రైజర్స్ బౌలర్లు, ఫీల్డర్ల అద్భుత ప్రదర్శన కారణంగా లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులకు పరిమితమైంది. కేఎల్ రాహుల్(29), కృనాల్ పాండ్యా(24) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 48*), ఆయుశ్ బదోని(30 బంతుల్లో 55*) అద్భుతంగా రాణించారు.
అయితే, లక్నో విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉఫ్‌మని ఊదేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 75), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89) పరుగుల వరద పారించి.. 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను గెలిపించారు. వీరిని కట్టడి చేసేందుకు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అమలు చేసిన వ్యూహాలలో ఒక్కటీ ఫలితాన్నివ్వలేదు.
ఈ నేపథ్యంలో ఘోర ఓటమి అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్‌తో వాదనకు దిగాడు. అందరూ చూస్తుండగానే సీరియస్‌గా రాహుల్‌కు క్లాస్ తీసుకున్నాడు.
కెప్టెన్ వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా.. ‘‘సాకులు చెప్పొద్దు.. నేను సహించను.. ఆ రెండు పాయింట్లు ఎంత ముఖ్యమో తెలుసు కదా’’ అన్నట్లుగా కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Mr Goenka is a pathetic owner.
I support KL Rahul 100%
Repost and show your support towards #KLRahul #SRHvLSG #PBKSvRCB #PBKSvsRCBpic.twitter.com/JUYv9AgVdd— Samira (@Logical_Girll) May 9, 2024
ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా ప్రవర్తనను రాహుల్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. కాగా ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో చిత్తుగా ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి ఆరో స్థానంలోనే నిలిచిపోయింది. మరోవైపు సన్‌రైజర్స్ మూడో స్థానానికి దూసుకువచ్చింది.
చదవండి: SRH: వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు.. అతడొక అద్భుతం.. నమ్మలేకపోతున్నా!
WHAT. A. CHASE 🧡
A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare!
Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024
Comments
Please login to add a commentAdd a comment