IPL 2023: Aiden Markram Stunning Catch-Nitish Rana 42 Runs Out Vs SRH Match - Sakshi
Sakshi News home page

#AidenMarkram: సంచలన క్యాచ్‌తో మెరిసిన ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌

Published Thu, May 4 2023 9:15 PM | Last Updated on Thu, May 4 2023 9:22 PM

Aiden Markram Stunning Catch-Nitish Rana 42 Runs Out Vs SRH Match - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో మార్క్రమ్‌ ఈ ఫీట్ సాధించాడు. విషయంలోకి వెళితే.. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కెప్టెన్‌ నితీశ్‌ రానా, రింకూ సింగ్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు దాదాపు 60 పరుగులు జోడించారు.

ఈ జోడి బలపడుతున్న సమయంలో ఇక లాభం లేదని మార్క్రమ్‌ తానే బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతికి రింకూ సింగ్‌ సింగిల్‌ తీయగా.. రెండో బంతిని నితీశ్‌ రానా లాంగాన్‌ దిశగా గాల్లోకి లేపాడు. అయితే మార్క్రమ్‌ లాంగాన్‌ దిశగా దాదాపు 30 గజాల దూరం పరిగెత్తి డైవ్‌ చేస్తూ అద్బుతంగా క్యాచ్‌ తీసుకోవడంతో కేకేఆర్‌ కెప్టెన్‌ 42 పరుగుల ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ సీజన్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ క్యాచెస్‌ జాబితాలో చోటు సంపాదించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: తీవ్ర గాయం.. ప్రమాదంలో పాక్‌ క్రికెటర్‌ భవితవ్యం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement