Playoff
-
SRH: సన్‌రైజర్స్ గుండెల్లో గుబులు.. మ్యాచ్ గనుక రద్దైతే!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే పదకొండేసి మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్(నెట్ రన్‌రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్ రాయల్స్(నెట్ రన్‌రేటు 0.476) ఎనిమిది గెలిచి టాప్-2లో తిష్ట వేశాయి.చెరో పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం మూడో స్థానం కోసం 12 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (-0.065)మధ్య జరుగుతున్న పోటీలో ఇప్పటి వరకు రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న సీఎస్కే(0.700)నే పైచేయి సాధించింది.ప్లే ఆఫ్స్ పోటీలో కీలక మ్యాచ్దీంతో రైజర్స్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్ రాయల్స్‌పై మంగళవారం నాటి విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ సైతం ముందుకు దూసుకువచ్చింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ సైతం 12 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతూ టాప్-4పై కన్నేసింది.ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం నాటి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువెళ్తుంది. అదే సమయంలో ఓడిన జట్టు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.పొంచి ఉన్న వాన గండంఅయితే, సొంతగడ్డపై మ్యాచ్ జరుగనుండటం సన్‌రైజర్స్‌కు సానుకూల అంశమే అయినా.. వర్షం రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు 56 మ్యాచ్‌లు జరిగాయి.కానీ ఒక్క మ్యాచ్ కూడా వరణుడి కారణంగా రద్దు కాలేదు. అయితే, ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన సన్‌రైజర్స్- లక్నో మ్యాచ్‌కు మాత్రం వాన గండం పొంచి ఉంది. హైదరాబాద్‌లో మంగళవారం కుండపోతగా వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో స్టేడియం సిబ్బంది మైదానంలోని మధ్య భాగాన్ని కవర్లతో కప్పి ఉంచారు. అయితే, వాతావరణ శాఖ రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హెచ్చరించడం ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో గుబులు రేపుతోంది.మ్యాచ్ గనుక రద్దు అయితేకాగా తాజా సీజన్లో ఆరంభ మ్యాచ్‌లో తడబడ్డా ప్యాట్ కమిన్స్ బృందం తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. 266.. 277.. 287 స్కోర్లు నమోదు చేసి పరుగుల విధ్వంసానికి మారుపేరుగా నిలిచింది.అయితే, గత కొన్ని మ్యాచ్‌ల నుంచి సన్‌రైజర్స్ పేలవ బ్యాటింగ్‌తో తేలిపోతోంది. ఆఖరిగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక బుధవారం నాటి మ్యాచ్ గనుక రద్దైతే సన్‌రైజర్స్, లక్నోల ఖాతాలో చెరో పాయింట్ చేరుతుంది. అలా కాక మ్యాచ్ సాఫీగా సాగితే గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు వస్తాయి.వాతావరణ శాఖ హెచ్చరికనగరంలో వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.చదవండి: సంజూ శాంసన్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ 𝙇𝙤𝙘𝙠𝙚𝙙 𝙖𝙣𝙙 𝙡𝙤𝙖𝙙𝙚𝙙 👊🔥#PlayWithFire #SRHvLSG pic.twitter.com/En1XXReksW— SunRisers Hyderabad (@SunRisers) May 8, 2024 -
#MohitSharma: ఐదు వికెట్లు.. ఫ్లేఆఫ్స్ చరిత్రలో రెండో బౌలర్‌గా
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులో మోహిత్ శర్మ ఐదు వికెట్లతో చెలరేగాడు. మోహిత్ శర్మ బౌలింగ్ దెబ్బకు ముంబై ఇండియన్స్ 171 పరుగులకు ఆలౌటై 62 పరుగులతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిది. ఇక 2.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన మోహిత్ శర్మ 10 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా మోహిత్ శర్మ నిలిచాడు. ఇంతకముందు ఆకాశ్ మధ్వాల్(ముంబై ఇండియన్స్).. లక్నోతో మ్యాచ్‌లో ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇక ఈ సీజన్లో డెత్ ఓవర్లలో(16-20 ఓవర్లు) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు ఈ సీజన్లో మోహిత్ శర్మ 14 వికెట్లు తీయగా.. తొలి స్థానంలో సీఎస్కేకు మతీశా పతిరానా(16 వికెట్లు) ఉండగా.. వీరిద్దరి తర్వాత హర్షల్‌పటేల్(ఆర్షీబీ) 11 వికెట్లతో ఉన్నాడు. చదవండి: #SaiSudharsan: రిటైర్డ్ ఔట్.. ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడిగా -
అనుభవం ముందు పనికిరాలేదు.. తెలివైన బంతితో బోల్తా
ఐపీఎల్ 16వ సీజన్లో క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. కాగా గుజరాత్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను పియూష్ చావ్లాను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. వేసింది వైడ్ బాల్ అయినప్పటికి సాహా ప్రంట్ఫుట్ వచ్చేలా ఊరించే బంతి వేయడం ఫలితాన్ని ఇచ్చింది. సాహా మిస్ చేయడంతో బంతిని అందుకున్న ఇషాన్ కిషన్ రెప్పపాటులో వికెట్లను గిరాటేయగా సాహా స్టంప్ఔట్ గా వెనుదిరిగాడు. దీంతో అనుభవం ముందు సాహా బ్యాటింగ్ పనికిరానట్లయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Mumbai was desperate for a wicket, and Piyush Chawla delivered in his very first over. What an underrated performer for Mumbai this season. Just incredible. #GTvsMI #IPL2023 pic.twitter.com/3ldhhAlZyz — Ridhima Pathak (@PathakRidhima) May 26, 2023 చదవండి: 'ఈసారి కప్ మనదే'.. రోహిత్ శర్మ సిగ్నల్! -
హైదరాబాద్ కు ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
-
Womens Premier League 2023:ప్లేఆఫ్‌కు యూపీ వారియర్స్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో చివరిదైన మూడో ప్లేఆఫ్ బెర్త్ కూడా ఖరారైంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ దశకు అర్హత పొందగా... ఈ రెండు జట్ల సరసన యూపీ వారియర్స్ చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. యూపీ గెలుపుతో గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు సాధించింది. హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), యాష్లే గార్డ్నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పార్శవి చోప్రా రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించి విజయం సాధించింది. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన యూపీ వారియర్స్‌ను తాలియా (38 బంతుల్లో 57; 11 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (41 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. తాలియా అవుటయ్యాక గ్రేస్ హారిస్ యూపీని విజయం దిశగా నడిపించింది. ఏడు బంతులు మిగిలి ఉండగా హారిస్ పెవిలియన్ చేరగా... సోఫీ ఎకిల్‌స్టోన్ (13 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) యూపీ విజయాన్ని ఖాయం చేసింది. ముంబై ఇండియన్స్‌కు ఢిల్లీ షాక్ సోమవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి అందరికంటే ముందుగా ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న ముంబై ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గమనార్హం. ముందుగా ముంబై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది. పూజ వస్త్రకర్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్‌ప్రీత్ కౌర్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు), ఇసీ వాంగ్ (24 బంతుల్లో 23; 1 సిక్స్), అమన్‌జ్యోత్ కౌర్ (16 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కప్ (2/13), శిఖా పాండే (2/21), జెస్ జొనాసెన్ (2/25) ముంబైని కట్టడి చేశారు. అనంతరం ఢిల్లీ దూకుడుగా ఆడి 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 110 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (15 బంతుల్లో 33; 6 ఫోర్లు, 1 సిక్స్) అవుటవ్వగా.. మెగ్ లానింగ్ (22 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), అలైస్ క్యాప్సీ (17 బంతుల్లో 38 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్‌లు) ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు. ‘ఫైనల్ బెర్త్’ రేసులో ముంబై, ఢిల్లీ ప్రస్తుతం ఢిల్లీ, ముంబై 10 పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ టాప్ ర్యాంక్‌లో, ముంబై రెండో ర్యాంక్‌లో నిలిచాయి. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో బెంగళూరుతో ముంబై (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)... యూపీతో ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి) ఆడతాయి. ముంబై, ఢిల్లీ జట్లలో భారీ తేడాతో నెగ్గిన జట్టు ‘టాప్’ ర్యాంక్‌తో నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మూడో స్థానంలో నిలిచిన యూపీ వారియర్స్‌తో రెండో స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. -
సన్‌రైజర్స్ చేతిలో కోల్‘కథ’
షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ లీగ్ దశ మ్యాచ్‌లకు నేటితో తెర పడనుంది. కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్నట్టే ఈసారీ ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందే చివరి జట్టేదో లీగ్ ఆఖరి మ్యాచ్‌తోనే తేలనుండటం విశేషం. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోవడంతోపాటు పాయింట్ల పట్టికలో ‘టాప్’ పొజిషన్‌నూ ఖాయం చేసుకుంది. ► సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గడంతో 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. 14 పాయింట్లతో బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ (–0.172) కారణంగా నైట్‌రైడర్స్ (–0.214)ను వెనక్కి నెట్టిన బెంగళూరు మూడో జట్టుగా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంది. ► నాలుగో బెర్త్ రేసులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచాయి. 12 పాయింట్లతో ఉన్న హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందాలంటే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. కోల్‌కతాకంటే మెరుగైన రన్‌రేట్ ఉండటంతో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోని హైదరాబాద్ జట్టు గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ► ఒకవేళ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఒక్కటే మార్గం ఉంది. ముంబై చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోవాలి. లేదంటే మ్యాచ్ అయినా రద్దు కావాలి. మ్యాచ్ రద్దయిన పక్షంలో హైదరాబాద్‌కు ఒక్క పాయింట్ వస్తుంది. ఆ జట్టు 13 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమవుతుంది. 14 పాయింట్లతో కోల్‌కతా ముందంజ వేస్తుంది. అయితే యూఏఈలో మ్యాచ్ రద్దయ్యే వాతావరణ పరిస్థితులు ఏమాత్రం లేవు కాబట్టి కోల్‌కతా జట్టు హైదరాబాద్ ఓడిపోవాలని కోరుకోవాలి. -
ఫ్లేఆఫ్ రేసులోకి రోహిత్ సేన!
-
గెలిస్తే ఫేఆఫ్..ఓడితే ఇంటికే!
-
ఫేఆఫ్కు చేరుకునే నాలుగు జట్లేవి..?
-
ఐపీఎల్-10లో సీన్ రివర్స్
హైదరాబాద్: ఐపీఎల్-10లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ విఫలమయ్యాయి. ఈ రెండు జట్లకు ‘ప్లే–ఆఫ్’ కు దారులు మూసుకుపోయాయి. గత సీజన్లో లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఈ రెండు టీమ్‌లు ఈ ఎడిషన్‌లో చతికిలపడ్డాయి. విరాట్ కోహ్లి నేతృత్వంలోని ఆర్సీబీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 5 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 10 ఆడిన కోహ్లి సేన కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. 8 మ్యాచుల్లో ఓడింది. వర్షం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది. 6 పాయింట్లతో గుజరాత్ లయన్స్ చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన రైనా టీమ్ కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. 8 మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఈ రెండు జట్లు మరో మూడేసి లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సివుంది. మిగతా మ్యాచుల్లో గెలిచినా ప్లే–ఆఫ్ కు అవకాశం లేదు. ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్ డెవిల్స్ కూడా అవకాశాలున్నాయి. టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ దాదాపుగా ప్లే–ఆఫ్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. బెంగళూరు, గుజరాత్ మినహా అన్ని జట్లకు ప్లే–ఆఫ్ లో నిలవడంతో మిగతా మ్యాచ్‌లు రసవత్తరంగా సాగనున్నాయి.