mohammed abbas
-
ఇజ్రాయెల్–పాలస్తీనా శాంతికి కృషి
బెత్లెహం: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో శుక్రవారం పర్యటించారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలస్తీనాతో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నామని, తగిన ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య శాంతి యత్నాలకు ఇంకా కార్యక్షేత్రం సిద్ధం కాలేదని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య దశాబ్దం క్రితమే సంబంధాలు తెగిపోయాయి. ఇజ్రాయెల్‌లో రాజకీయ అస్థిరత, పాలస్తీనాలో బలహీన నాయకత్వం వల్ల శాంతి చర్చల ప్రక్రియ సాగడం లేదు. లక్షలాది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ పాలన కింద మగ్గిపోతున్నారు. సొంత సార్వభౌమత్వ, స్వతంత్ర దేశాన్ని పొందే అర్హత రెండు దేశాల ప్రజలకు ఉందని బైడెన్ ఉద్ఘాటించారు. రెండు వర్గాల ప్రజలకు రెండు దేశాలని వ్యాఖ్యానించారు. ఇరు వర్గాల మూలాలు ఇక్కడి ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచే ఉన్నాయని, పక్కపక్కనే శాంతియుతంగా, భద్రతతో కలిసిమెలిసి జీవించారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి మళ్లీ రావాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్–పాలస్తీనా నడుమ శాంతి ప్రక్రియ ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు బైడెన్ చెప్పారు. శాంతి ప్రయత్నాలకు కార్యక్షేత్రం ఇంకా సిద్ధం కానప్పటికీ రెండు దేశాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తామన్నారు. పాలస్తీనాకు 300 మిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాయాన్ని బైడెన్ ప్రకటించారు. వెస్ట్‌బ్యాంక్, గాజాలో ఇజ్రాయెల్ కాలనీల విస్తరణపై స్పందించలేదు. -
చేదు అనుభవం.. తన గోతిని తానే తవ్వుకున్నాడు
''తన గోతిని తానే తవ్వుకున్నాడు'' అనే సామెత చాలాసార్లే వినుంటారు. తాజాగా ఈ సామెత మనం చెప్పుకోబోయే బ్యాటర్‌కు సరిగ్గా వర్తిస్తుంది. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమర్సెట్, హాంప్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. హాంప్‌షైర్ బౌలర్ మమ్మద్ అబ్బాస్ సోమర్సెట్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో ఒక బంతిని అబ్బాస్ గుడ్ లెంగ్త్‌తో ఆఫ్‌స్టంప్ ఔట్‌సైడ్ దిశగా వేశాడు. క్రీజులో ఉన్న బ్యాటర్ టామ్ ఎబెల్ బంతిని డిఫెన్స్ చేద్దామనే ప్రయత్నం చేశాడు. అయితే బంతి రోల్ అయి వికెట్ల వైపు వెళ్లడం చూసి దానిని అడ్డుకునే ప్రయత్నంలో తన కాలితో బంతిని తన్నడం.. అది వికెట్లను గిరాటేయడం జరిగిపోయాయి. ఇంకేముంది ఒక రకంగా తనకు తానుగా ఔట్ అయిన టామ్ ఎబెల్.. అనవసరంగా బౌలర్‌కు వికెట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సోమర్సెట్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. తొలిరోజే 211 పరుగులకే ఆలౌట్ అయిన సోమర్సెట్ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ ఓవర్టన్(44) టాప్ స్కోరర్. హాంప్‌షైర్ బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ అబ్బాస్, హాలండ్, జేమ్స్ పుల్లర్ తలా రెండు వికెట్లు తీశారు. చదవండి: Ravichandran Ashwin: 'రాసిపెట్టుకోండి.. రాజస్తాన్ కప్ కొట్టబోతుంది..' This sport is crap pic.twitter.com/kgqrKwm134 — Alasdair 🇳🇦 (@kohli_fraud) May 19, 2022 -
తల్లి శవం భుజంపై.. జవానుకు ఎంత కష్టం?
కశ్మీర్: ఈ మధ్య చనిపోయిన తమ ఆత్మబంధువులను భుజాలపైన వేసుకొని వెళ్లిన సంఘటనలు ఎక్కువగా మనం ఒడిశా రాష్ట్రంలో చూశాం. ఇలా అనకూడని విషయమే అయినా వారంతా కూడా ఎవరి కళ్లకు సరిగా కనిపించని వాళ్లు.. అంటే బలహీనులు.. వర్గ పరంగా.. ఆర్థికపరంగా.. సామాజికపరంగా ప్రభుత్వాలు దయచూపనంతకాలం ఇంకొన్ని తరాల వరకు వారి బతుకులకు అలాంటి తిప్పలు తప్పవు. కానీ, అలాంటి పరిస్థితి ఒక జవానుకు వస్తే.. తల్లిని మోసుకొని విరిగిపడిన మంచుకొండలను దాటుకుంటూ వెళ్లాల్సి వస్తే.. అది కచ్చితంగా వార్తల్లో నిలుస్తుంది.. వేరే వాళ్లు చూస్తే అది దేశానికి అవమానం. కానీ, అలాంటి సంఘటనే జరిగింది. మహ్మద్ అబ్బాస్ అనే వ్యక్తి పఠాన్ కోట్లో జవానుగా పనిచేస్తున్నాడు. అతడితోపాటు తన తల్లి కూడా జీవిస్తోంది. ఆమె గత ఐదు రోజుల కిందట ప్రాణాలు కోల్పోయింది. దీంతో నియంత్రణ రేఖ వద్ద ఉన్న కర్ణా అనే గ్రామంలోకి తీసుకెళ్లి ఖననం చేయాలని అనుకున్నాడు. కశ్మీర్‌కు తన తల్లి మృతదేహంతో చేరుకున్నాడు. అయితే, 50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉండగా దారి మధ్యలో ఓ భారీ మంచుకొండచరియ విరిగి పడింది. దీంతో ఆ జవానుకు హెలికాప్టర్ సహాయం చేస్తామని పై అధికారులు చెప్పారు. వారి మాట విని తల్లి శవాన్ని అక్కడే ఉంచి హెలికాప్టర్ కోసం ఎదురుచూశాడు. కానీ, హెలికాప్టర్ రాలేదు. దీంతో ఆమె మృతదేహాన్ని తన భుజాన వేసుకొని దాదాపు ఆరు మీటర్ల మేర పేరుకుపోయిన మంచులో నుంచి పది గంటలపాటు మరికొంతమంది సహాయకులతో దాటి ఖననం చేసేందుకు తీసుకెళ్లాడు. దీనిపై అతడు వివరణ ఇస్తూ ‘ఇది చాలా పెద్ద అవమానం. నా తల్లికి గౌరవ ప్రదంగా అంత్యక్రియలు చేయలేకపోయాను. హెలికాప్టర్ పంపిస్తామని చెప్పి పంపించలేదు. పేరుకుపోయిన మంచుముక్కలపై ప్రమాద కర స్థితిలో నడుచుకుంటూ నా తల్లి మృతదేహాన్ని భుజాన వేసుకొని తీసుకెళ్లాను. నాలుగు రోజులు శవంతో ఎదురుచూసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ రోజు నా ఫోన్ కూడా కట్ చేశారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది’ అని చెప్పాడు. అయితే, తాము ఈ రోజే హెలికాప్టర్ సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. వారే హెలికాప్టర్ దిగే చోటులేదని వద్దన్నారని వివరించారు. -
శాంతియుత పరిష్కారం కావాలి
ఇజ్రాయెల్ - పాలస్తీనా విభేదాలపై ప్రణబ్, అబ్బాస్ పిలుపు రమల్లా: ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య విభేదాలను అంతర్జాతీయంగా అంగీకరించిన సూత్రాల ప్రాతిపదికగా చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనాలని భారత్, పాలస్తీనాలు పిలుపునిచ్చాయి. విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం పాలస్తీనా చేరుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమావేశమై చర్చించారు. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కొనసాగుతున్న హింసపై మాట్లాడారు. తూర్పు జెరూసలేం రాజధానిగా సార్వభౌమ, స్వతంత్ర పాలస్తీనాకు భారత్ పూర్తి మద్దతు ఇస్తోందని తెలియజేశారు. ఇజ్రాయెల్ సరసన పాలస్తీనా శాంతియుతంగా మనుగడ సాగించాలని భారత్ కోరుకుంటున్నట్లు చెప్పారు. ఉగ్రవాదం.. ప్రత్యేకించి ఐఎస్ఐఎస్, అల్‌ఖైదాల అంశమూ ఈ అగ్రనేతల మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా పాలస్తీనా అథారిటీకి భారత్ రూ. 32.3 కోట్ల చెక్కును బడ్జెటరీ మద్దతుగా అందించింది. అలాగే.. పాలస్తీనా భూభాగంలో రమల్లాలో టెక్నాలజీ పార్కు సహా ఐదు ప్రాజెక్టుల కోసం రూ. 115 కోట్లు అందిస్తామని హామీ ఇచ్చింది. అంతకుముందు జోర్డాన్ పర్యటన ముగించుకుని రమల్లా చేరుకున్న ప్రణబ్.. పాలస్తీనా నేత అరాఫత్ సమాధి వద్ద నివాళులర్పించారు.