వెటరన్ ఇంగ్లీష్ బ్యాటర్, సోమర్‌సెట్ లెజెండ్ జేమ్స్ హిల్‌డ్రెత్ అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022 కౌంటీ సీజన్‌తో తన కాంట్రాక్ట్ గడువు ముగియనుండడంతో హిల్‌డ్రెత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల హిల్‌డ్రెత్ 2003లో సోమర్‌సెట్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 16 ఏళ్ల వయస్సులోనే హిల్‌డ్రెత్ సోమర్‌సెట్ క్లబ్‌లో చేరాడు.
అతడు దాదాపు 20 ఏళ్ల పాటు సోమర్‌సెట్ క్రికెట్‌కు తన సేవలు అందించాడు. తన కెరీర్‌లో సోమర్‌సెట్ తరపున 713 మ్యాచ్‌లు ఆడిన హిల్‌డ్రెత్.. 27000 పైగా పరుగులు సాధించాడు. టీ20 బ్లాస్ట్-2005 టోర్నీను సోమర్‌సెట్ కైవసం చేసుకోవడంలో హిల్‌డ్రెత్ కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా 2019 రాయల్ లండన్ వన్డే ప్రపంచకప్‌ను కూడా సోమర్‌సెట్ సొంతం చేసుకోవడంలోనూ హిల్‌డ్రెత్ తన వంతు కృషి చేశాడు.
అయితే అతడు కెరీర్‌లో ఇప్పటి వరకు సోమర్‌సెట్ కౌంటీ ఛాంపియన్‌షిప్ టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. ఇక ఇప్పటి వరకు సోమర్‌సెట్ తరపున దేశీవాళీ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా హిల్‌డ్రెత్ నిలిచాడు.
చదవండి: ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
Comments
Please login to add a commentAdd a comment