retirement from international cricket
-
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సోమర్సెట్ లెజెండ్!
వెటరన్ ఇంగ్లీష్ బ్యాటర్, సోమర్సెట్ లెజెండ్ జేమ్స్ హిల్డ్రెత్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022 కౌంటీ సీజన్‌తో తన కాంట్రాక్ట్ గడువు ముగియనుండడంతో హిల్డ్రెత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల హిల్డ్రెత్ 2003లో సోమర్సెట్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 16 ఏళ్ల వయస్సులోనే హిల్డ్రెత్ సోమర్సెట్ క్లబ్లో చేరాడు. అతడు దాదాపు 20 ఏళ్ల పాటు సోమర్సెట్ క్రికెట్‌కు తన సేవలు అందించాడు. తన కెరీర్లో సోమర్సెట్ తరపున 713 మ్యాచ్‌లు ఆడిన హిల్డ్రెత్.. 27000 పైగా పరుగులు సాధించాడు. టీ20 బ్లాస్ట్-2005 టోర్నీను సోమర్సెట్ కైవసం చేసుకోవడంలో హిల్డ్రెత్ కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా 2019 రాయల్ లండన్ వన్డే ప్రపంచకప్‌ను కూడా సోమర్సెట్ సొంతం చేసుకోవడంలోనూ హిల్డ్రెత్ తన వంతు కృషి చేశాడు. అయితే అతడు కెరీర్లో ఇప్పటి వరకు సోమర్సెట్ కౌంటీ ఛాంపియన్షిప్ టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. ఇక ఇప్పటి వరకు సోమర్సెట్ తరపున దేశీవాళీ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా హిల్డ్రెత్ నిలిచాడు. చదవండి: ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్! -
టీ20లకు గుడ్‌బై చెప్పిన బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్..
బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. శనివారం (జూలై 16) వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డే అనంతరం తమీమ్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కాగా తమీమ్ సారథ్యంలో విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో విభేదాలు తలేత్తడంతో ఈ ఏడాది ఆరంభం నుంచి టీ20లకు తమీమ్ దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే టీ20లకు తమీమ్ గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. ఇక 2007లో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన తమీమ్ 78 మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 78 మ్యాచ్‌ల్లో తమీమ్ 24.08 సగటుతో 1758 పరుగులు సాధించాడు. అతడి టీ20 కెరీర్లో 7 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉంది. చదవండి: SL VS PAK 1st Test Day 1: చెలరేగిన షాహిన్ అఫ్రిది.. కుప్పకూలిన శ్రీలంక -
టీమిండియాతో టీ20 సిరీస్.. ఐర్లాండ్‌కు భారీ షాక్..!
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ పీటర్ చేజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 2014లో ఐర్లాండ్ తరపున పీటర్ చేజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ తరపున 43 మ్యాచ్‌లు మ్యాచ్‌లు ఆడిన చేజ్.. 63 వికెట్లు పడగొట్టాడు. ఇక 2018లో భారత్‌తో జరగిన టీ20 మ్యాచ్‌లో తన కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 35 పరుగులు ఇచ్చి చేజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఈ సిరీస్‌లో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లిని రెండు సార్లు ఔట్ చేశాడు. కాగా ఈ ఏడాది జూన్ అఖరిలో భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: IND vs SA: 'క్యాచ్ వదిలితే.. అట్లుంటది మనతో మరి' -
కెప్టెన్సీని వీడనని.. రిటైరయ్యాడు
లాహోర్: పాకిస్థాన్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. వెస్టిండీస్‌తో జరిగే సిరీసే తనకు చివరిదని చెప్పాడు. గురువారం లాహోర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హక్ ఈ విషయాన్ని ప్రకటించాడు. కాగా దేశవాళీ క్రికెట్లో కొనసాగనున్నట్టు స్పష్టం చేశాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, క్రికెట్‌తో తన అనుబంధాన్నికొనసాగిస్తానని చెప్పాడు. 42 ఏళ్ల హక్ పాక్ తరపున 72 టెస్టులు, 162 వన్డేలు, 39 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవల పాక్ టెస్టు కెప్టెన్సీ నుంచి మిస్బాను తప్పుకోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరగా, దానికి ఈ వెటరన్ క్రికెటర్ ఒప్పుకోలేదు. తాను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకోవాలంటూ పీసీబీని ప్రశ్నించాడు. పాక్ తరఫున మరికొన్ని రోజులు ఆడాల్సిందిగా తన భార్య, పిల్లలు కోరుకుంటున్నట్టు చెప్పాడు. కాగా పాక్ ఇటీవల టెస్టు ఫార్మాట్లో ఓటమి చవిచూడటంతో ఒత్తిడికి గురయ్యాడు. బుధవారం పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ హక్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని చెప్పాడు. రిటైర్మెంట్ గురించి హక్‌తో చర్చించలేదని తెలిపాడు. ఇంతలోనే అతను రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.