
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ పీటర్ చేజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 2014లో ఐర్లాండ్ తరపున పీటర్ చేజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ తరపున 43 మ్యాచ్‌లు మ్యాచ్‌లు ఆడిన చేజ్.. 63 వికెట్లు పడగొట్టాడు.
ఇక 2018లో భారత్‌తో జరగిన టీ20 మ్యాచ్‌లో తన కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 35 పరుగులు ఇచ్చి చేజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఈ సిరీస్‌లో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లిని రెండు సార్లు ఔట్ చేశాడు. కాగా ఈ ఏడాది జూన్ అఖరిలో భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
చదవండి: IND vs SA: 'క్యాచ్ వదిలితే.. అట్లుంటది మనతో మరి'