
బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. శనివారం (జూలై 16) వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డే అనంతరం తమీమ్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కాగా తమీమ్ సారథ్యంలో విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో విభేదాలు తలేత్తడంతో ఈ ఏడాది ఆరంభం నుంచి టీ20లకు తమీమ్ దూరంగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలోనే టీ20లకు తమీమ్ గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. ఇక 2007లో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన తమీమ్ 78 మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 78 మ్యాచ్‌ల్లో తమీమ్ 24.08 సగటుతో 1758 పరుగులు సాధించాడు. అతడి టీ20 కెరీర్‌లో 7 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉంది.
చదవండి: SL VS PAK 1st Test Day 1: చెలరేగిన షాహిన్ అఫ్రిది.. కుప్పకూలిన శ్రీలంక
Comments
Please login to add a commentAdd a comment