విశాఖపట్నం: టైగర్ ట్రయంఫ్‌లో భాగంగా తమ విశాఖపట్నం పర్యటనను, భారత నౌకాదళంతో సంయుక్తంగా జరిపిన విన్యాసాల గొప్ప అనుభవాన్ని తాము ప్పటికీ గుర్తుంచుకుంటామని యూఎస్‌ఎస్ సోమర్‌సెట్ నౌక సిబ్బంది పేర్కొన్నారు. విశాఖపట్నం పోర్టులో శనివారం మీడియాతో మాట్లాడారు.
యూఎస్‌ఎస్ సోమర్‌సెట్ నౌక గురించి వివరించారు. డజన్ల కొద్దీ సైనిక వాహనాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ ఓడలో 1,000 మందికి పైగా నావికులు, మెరైన్‌లు ప్రయాణిస్తారని, పడవలను రిపేర్ చేసే వర్క్‌షాప్‌తో పాటు ఫ్లైట్ డెక్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు ల్యాండ్ అవుతాయని షిప్ పైలట్ ఆష్లే అంబుహెల్ తెలిపారు.
“విశాఖపట్నంలో భారత నౌకాదళ సిబ్బందితో గడపడం ఆనందంగా ఉంది. మేము వారి నుండి చాలా నేర్చుకున్నాం. మంచి జ్ఞాపకాలు పొందాం” అని సోమర్‌సెట్‌లోని సర్ఫేస్ వార్‌ఫేర్ ఆఫీసర్ బ్రన్జిక్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment