టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీమిండియా తరపున టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు. కొంతకాలంగా టెస్టులకు మాత్రమే పరిమితమైన సిరాజ్.. ప్రస్తుతం టీమిండియా పరిమిత ఓవర్ల ఆటలో బిజీగా ఉండడం.. టి20 జట్టులో చోటు లేకపోవడంతో అతను కౌంటీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. కౌంటీల్లో వార్విక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరాజ్ సోమర్‌సెట్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
తొలిరోజు ఆటలో 19 ఓవర్లు వేసిన సిరాజ్ 54 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయితే పాకిస్తాన్ బ్యాటర్ ఇమాముల్ హక్‌ను సిరాజ్ ఔట్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్.. ఇమాముల్ హక్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. లెగ్ స్టంప్‌కు ఆవల ఊరిస్తూ వేసిన బంతిని ఇమాముల్ హక్ అంచనా వేయడంలో పొరబడ్డాడు. అంతే బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతి కీపర్ చేతిలో పడింది.
అంపైర్ సిగ్నల్ ఇవ్వకముందే సిరాజ్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోగా.. బ్యాటర్ మాత్రం క్రీజులోనే ఉన్నాడు. అయితే అంపైర్ కూడా ఓట్ సిగ్నల్ ఇవ్వడంతో చేసేదేం లేక ఇమాముల్ హక్ నిరాశగా పెవిలియన్ చేరాడు. కాగా పాక్ తరపున 16 టెస్టులు, 54 వన్డేలు, రెండు టి20లు ఆడిన ఇమాముల్ ఫామ్ కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు. ఇక సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి సోమర్‌సెట్ 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
చదవండి: Shane Warne: 'భౌతికంగా మాత్రమే దూరం'.. హ్యాపీ బర్త్‌డే
Comments
Please login to add a commentAdd a comment