టీ20 బ్లాస్ట్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్స్, బ్రదర్స్ సామ్ కర్రన్, సామ్ కర్రన్‌లు విధ్వంసం సృష్టించారు. ససెక్స్‌తో నిన్న (జూన్ 9) జరిగిన మ్యాచ్‌లో వీరు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత సామ్ (35 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖర్లో టామ్ (9 బంతుల్లో 29; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి అసలుసిసలు టీ20 మజాను ప్రేక్షకులకు అందించారు. వీరికి తోడు లారీ ఈవాన్స్ (51 బంతుల్లో 93; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో సర్రే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీ20 బ్లాస్ట్‌లో ఇది నాలుగో అత్యుత్తమ స్కోర్. ససెక్స్ బౌలర్లలో తైమాల్ మిల్స్, హెన్రీ క్రొకోంబ్ తలో 2 వికెట్లు, మెక్ ఆండ్రూ, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ససెక్స్.. సునీల్ నరైన్ (3/12), కెమరూన్ స్టీల్ (3/41), విల్ జాక్స్ (2/29), టామ్ లావెస్ (2/17) ధాటికి 14.5 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా సర్రే 124 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ క్లార్క్ (43) టాప్ స్కోరర్‌గా నిలువగా.. టామ్ అల్సోప్ (17), మైఖేల్ బుర్గెస్ (12), డానియల్ ఇబ్రహీం (17), హడ్సన్ ప్రెంటిస్ (11)లు రెండంకెల స్కోర్‌లు చేశారు.
A 🆕 entry on the highest Blast totals list 👀 @surreycricket with an astonishing display of hitting tonight!#Blast23 pic.twitter.com/xF1zYWKo5q
— Vitality Blast (@VitalityBlast) June 9, 2023
కాగా, ఐపీఎల్‌లో కోట్లు కుమ్మరించినా ఆడని సామ్ కర్రన్ స్వదేశంలో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో మాత్రం చెలరేగిపోతున్నాడు. కర్రన్ ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో మెరుపు వేగంతో పరుగుల సాధించడంతో (237, 13 సిక్సర్లు) పాటు వికెట్లు (7) కూడా తీస్తున్నాడు. కర్రన్ మెరుపు ఇన్నింగ్స్‌ల కారణంగా సర్రే పలు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
చదవండి: బజ్‌బాల్ లేదు తొక్కా లేదు.. మీ పప్పులు మా ముందు ఉడకవు.. ఇంగ్లండ్‌కు స్టీవ్ స్మిత్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment