Tom Curran
-
జింబాబ్వే జట్టులో చోటు దక్కించుకున్న ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ సోదరుడు
ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కర్రన్, టామ్ కర్రన్ల సోదరుడు బెన్ కర్రన్ జింబాబ్వే జాతయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జింబాబ్వే వన్డే జట్టులో బెన్ చోటు దక్కించుకున్నాడు. 28 ఏళ్ల బెన్ జింబాబ్వే మాజీ ఆటగాడు, ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ కెవిన్ కర్రన్ తనయుడు. కెవిన్‌కు ముగ్గురు కుమారులు. వీరిలో సామ్, టామ్ కర్రన్లు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించగా.. తాజాగా బెన్ జింబాబ్వే జట్టులో చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వే దేశవాలీ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చడం ద్వారా బెన్ జాతీయ జట్టు నుంచి తొలిసారి పిలుపునందుకున్నాడు. బెన్ ఎడమ చేతి వాటం బ్యాటర్.కాగా, స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే టీ20, వన్డే సిరీస్‌ల కోసం వేర్వేరు జింబాబ్వే జట్లను ఇవాళ (డిసెంబర్ 9) ప్రకటించారు. టీ20 జట్టుకు సికందర్ రజా, వన్డే జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. బెన్ కర్రన్ కేవలం వన్డే జట్టులో మాత్రమే చోటు దక్కించుకున్నాడు. బెన్‌తో పాటు న్యూమ్యాన్ న్యామ్హురి కూడా తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. న్యూమ్యాన్ వన్డేతో పాటు టీ20 జట్టుకు ఎంపికయ్యాడు.ఆఫ్ఘనిస్తాన్ పర్యటన తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో మొదలవుతుంది. డిసెంబర్ 11, 13, 14 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ రెండు టెస్ట్ మ్యాచ్‌లు కూడా ఆడనుంది. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి.. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి మొదలవుతాయి. జింబాబ్వే టెస్ట్ జట్టును ప్రకటించాల్సి ఉంది.టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, టకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా డి ముసెకివాని, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, న్యూమ్యాన్ న్యామ్హురివన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రన్, జాయ్‌లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, న్యూమ్యాన్ న్యామ్హురి, విక్టర్ న్యూయుచి, సికందర్ రజా, సీన్ విలియమ్స్ -
IPL 2024: ఆర్సీబీ ఆటగాడికిపై నిషేధం
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొనుగోలు చేసిన ఆటగాడిపై బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) నిర్వహకులు నిషేధం విధించారు. బీబీఎల్ 2023-24లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ పేసర్ టామ్ కర్రన్‌ను నాలుగు మ్యాచ్‌ల పాటు నిషేధించారు. బీబీఎల్‌లో భాగంగా డిసెంబర్ 11న హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ను బెదిరించినందుకు గాను టామ్ కర్రన్‌పై చర్యలకు తీసుకున్నట్లు బీబీఎల్ నిర్వహకులు వెల్లడించారు. హోబర్ట్తో మ్యాచ్‌కు ముందు రిహార్సల్స్ సందర్భంగా కర్రన్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడని బీబీఎల్ నిర్వహకులు తెలిపారు. మ్యాచ్‌కు ముందు పిచ్‌పై బౌలింగ్ చేసేందుకు కర్రన్ ప్రయత్నించగా అంపైర్ వారించాడని, అయినా కర్రన్ లెక్క చేయకుండా అంపైర్ వైపు బౌలింగ్ చేయబోయాడని పేర్కొన్నారు. కర్రన్ చర్యను లెవెల్ 3 నేరం కింద పరిగణించి, అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. Tom Curran has been banned for four BBL games after intimidating the umpire during pre-match practice.pic.twitter.com/OwvVYkb7kz — CricTracker (@Cricketracker) December 21, 2023 కాగా, డిసెంబర్ 11న హోబర్ట్తో జరిగిన మ్యాచ్‌లో కర్రన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన కర్రన్ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ ఓ బౌండరీ బాది తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే, దుబాయ్‌లోని కోకోకోలా ఎరీనా వేదికగా డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఆర్సీబీ జట్టు టామ్ కర్రన్‌ను 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. 28 ఏళ్ల టామ్ కర్రన్ ఐపీఎల్లో వివిధ జట్ల తరఫున 13 మ్యాచ్‌లు ఆడాడు. గత సీజన్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న సామ్ కర్రన్‌కు టామ్ అన్న అవుతాడు. టామ్ ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 2 టెస్ట్‌లు, 29 వన్డేలు, 30 టీ20 ఆడాడు. -
చితక్కొట్టిన కర్రన్.. హండ్రెడ్ లీగ్ 2023 విజేతగా ఓవల్ ఇన్విన్సిబుల్స్
హండ్రెడ్ లీగ్ 2023 ఎడిషన్ విజయవంతంగా పూర్తయ్యింది. పురుషుల విభాగంలో ఓవల్ ఇన్విన్సిబుల్స్, మహిళల విభాగంలో సథరన్ బ్రేవ్ ఛాంపియన్స్‌గా అవతరించాయి. నిన్న (ఆగస్ట్ 27) జరిగిన పురుషుల ఫైనల్స్‌లో ఇన్విన్సిబుల్స్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌ను, మహిళల ఫైనల్స్‌లో సథరన్ బ్రేవ్.. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌ను ఓడించి, టైటిల్స్ చేజిక్కించుకున్నాయి. హండ్రెడ్ లీగ్‌లో ఇరు జట్లకు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. Your 2023 champions! 👏 ✨ Oval Invincibles and Southern Brave! ✨#TheHundred pic.twitter.com/O2OPFMrJTi — The Hundred (@thehundred) August 27, 2023 Unbreakable. 🔒#TheHundred pic.twitter.com/DntFw2MthW — The Hundred (@thehundred) August 27, 2023 ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన టామ్ కర్రన్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన ఫైనల్స్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ 14 పరుగుల తేడాతో గెలుపొంది, హండ్రెడ్ లీగ్ పురుషుల విభాగపు విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఓవల్.. జిమ్మీ నీషమ్ (33 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్), టామ్ కర్రన్ (34 బంతుల్లో 67 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 161 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాంచెస్టర్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ 2, జాషువ లిటిల్, పాల్ వాల్టర్, టామ్ హార్ట్లీ తలో వికెట్ పడగొట్టారు. What a special night! @TC59 🔥 pic.twitter.com/r0QU8HMsKO — Sam Curran (@CurranSM) August 28, 2023 బంతిలోనూ రాణించిన కర్రన్.. చేతులెత్తేసిన మాంచెస్టర్ 162 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మాంచెస్టర్ ఆటగాళ్లు ఆది నుంచే తడబడుతూ వచ్చి ఓటమిని కొనితెచ్చుకున్నారు. ఓవల్ బౌలర్లు విల్ జాక్స్ (2/11), టామ్ కర్రన్ (1/25), డానీ బ్రిగ్స్ (1/2), నాథన్ సౌటర్ (1/24), సామ్ కర్రన్ (1/31) మాంచెస్టర్ ఆటగాళ్లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఫలితంగా మాంచెస్టర్ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. మాంచెస్టర్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ మాడ్సన్ (37), జేమీ ఓవర్టన్ (28 నాటౌట్), ఫిలిప్ సాల్ట్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. A fairytale finish ✨#TheHundred pic.twitter.com/1XhfiWsevw — The Hundred (@thehundred) August 27, 2023 ఛాంపియన్‌గా సథరన్ బ్రేవ్.. హండ్రెడ్ లీగ్ మహిళల విభాగపు ఛాంపియన్‌గా సథరన్ బ్రేవ్ అవతరించింది. ఫైనల్లో బ్రేవ్.. నార్త్ర్న్ సూపర్ ఛార్జర్స్‌ను 34 పరుగుల తేడాతో చిత్తు చేసి, రెండు ప్రయత్నాల తర్వాత తొలి హండ్రెడ్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్.. డేనియల్ వ్యాట్ (59), ఫ్రేయా కెంప్ (31), ఆడమ్స్ (27) రాణించడంతో నిర్ణీత బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. సూపర్ ఛార్జర్స్ బౌలర్లలో కేట్ క్రాస్ 3 వికెట్లు పడగొట్టగా.. గ్రేస్ బల్లింజర్, లూసీ హిగమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. The moment Southern Brave women won #TheHundred! 🏆 pic.twitter.com/Nzn3madPTY — The Hundred (@thehundred) August 27, 2023 చెలరేగిన లారెన్ బెల్, మూర్.. 140 పరుగుల టార్గెట్‌ను డిఫెండ్ చేసుకునే క్రమంలో బ్రేవ్ బౌలర్లు చెలరేగిపోయారు. లారెన్ బెల్ (3/21), కేలియా మూర్ (3/15), ట్రయాన్ (2/28), అన్య ష్రబ్సోల్ (1/18) అద్భుతంగా బౌలింగ్ చేసి, సూపర్ ఛార్జర్స్‌ను 105 పరుగులకు కుప్పకూల్చారు. బ్రేవ్ బౌలర్లు విజృంభించడంతో సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్ మరో 6 బంతులు మిగిలుండగానే ముగిసింది. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో జెమీమా రోడ్రిగెస్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచింది. -
విధ్వంసం సృష్టించిన కర్రన్ బ్రదర్స్.. సిక్సర్ల సునామీ
టీ20 బ్లాస్ట్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్స్, బ్రదర్స్ సామ్ కర్రన్, సామ్ కర్రన్లు విధ్వంసం సృష్టించారు. ససెక్స్‌తో నిన్న (జూన్ 9) జరిగిన మ్యాచ్‌లో వీరు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత సామ్ (35 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖర్లో టామ్ (9 బంతుల్లో 29; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి అసలుసిసలు టీ20 మజాను ప్రేక్షకులకు అందించారు. వీరికి తోడు లారీ ఈవాన్స్ (51 బంతుల్లో 93; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో సర్రే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీ20 బ్లాస్ట్‌లో ఇది నాలుగో అత్యుత్తమ స్కోర్. ససెక్స్ బౌలర్లలో తైమాల్ మిల్స్, హెన్రీ క్రొకోంబ్ తలో 2 వికెట్లు, మెక్ ఆండ్రూ, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ససెక్స్.. సునీల్ నరైన్ (3/12), కెమరూన్ స్టీల్ (3/41), విల్ జాక్స్ (2/29), టామ్ లావెస్ (2/17) ధాటికి 14.5 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా సర్రే 124 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ క్లార్క్ (43) టాప్ స్కోరర్‌గా నిలువగా.. టామ్ అల్సోప్ (17), మైఖేల్ బుర్గెస్ (12), డానియల్ ఇబ్రహీం (17), హడ్సన్ ప్రెంటిస్ (11)లు రెండంకెల స్కోర్లు చేశారు. A 🆕 entry on the highest Blast totals list 👀 @surreycricket with an astonishing display of hitting tonight!#Blast23 pic.twitter.com/xF1zYWKo5q — Vitality Blast (@VitalityBlast) June 9, 2023 కాగా, ఐపీఎల్లో కోట్లు కుమ్మరించినా ఆడని సామ్ కర్రన్ స్వదేశంలో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో మాత్రం చెలరేగిపోతున్నాడు. కర్రన్ ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో మెరుపు వేగంతో పరుగుల సాధించడంతో (237, 13 సిక్సర్లు) పాటు వికెట్లు (7) కూడా తీస్తున్నాడు. కర్రన్ మెరుపు ఇన్నింగ్స్‌ల కారణంగా సర్రే పలు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. చదవండి: బజ్‌బాల్ లేదు తొక్కా లేదు.. మీ పప్పులు మా ముందు ఉడకవు.. ఇంగ్లండ్‌కు స్టీవ్ స్మిత్ వార్నింగ్ -
దుమ్మురేపుతున్న సామ్ కర్రన్.. ఓరేంజ్ లోే తిడుతున్న ఫ్యాన్స్
-
సామ్ బిల్లింగ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్; థ్రిల్లింగ్ మ్యాచ్‌లో సూపర్ విక్టరీ
లండన్: హండ్రెడ్ బాల్ మెన్స్ కాంపిటీషన్లో భాగంగా ఓవల్ ఇన్విసిబుల్ కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తన మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఇన్విసిబుల్ జట్టు టాప్ 3లో నిలిచింది. వెల్ష్ ఫైర్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కెప్టెన్ డకెట్ 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డుప్లోయ్ 17, కాబ్ 12 పరుగులు చేశారు. ఇన్విసిబుల్స్ బౌలింగ్‌లో టామ్ కరన్ 3 వికెట్లతో సత్తా చటగా.. టోప్లే, మహమూద్, షంసీలు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇన్విసిబుల్స్ 93 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు జాసన్ రాయ్ 8, విల్ జాక్స్ 20 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను గెలిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక చివర్లో లారీ ఈవన్స్ 28 పరుగులు నాటౌట్‌తో బిల్లింగ్స్‌కు సహకరించాడు. తాజా విజయంతో ఓవల్ ఇన్విసిబుల్స్ మూడో స్థానంలో ఉండగా.. వెల్ష్ ఫైర్ నాలుగో స్థానంలో ఉంది. -
సిరీస్ కైవసం: ‘వరల్డ్ కప్‌నకు ముందే ఆ లోపాలు సవరించుకోవాలి’
బ్రిస్టల్/ఇంగ్లండ్: శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో వన్డే వర్షంతో రద్దయింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 2–0తోనే సిరీస్‌ను సరిపెట్టుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 41.1 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. షనక (48 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్ టామ్ కరన్ (4/35) రాణించాడు. ఇన్నింగ్స్ విరామంలో మొదలైన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ... ‘‘ఈరోజు కూడా మేమే పైచేయి సాధించాం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఉండే మజాను ఆస్వాదించాం. మా ఆటగాళ్లంతా ఎంతో పట్టుదలగా నిలబడ్డారు. సమిష్టి కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది. విల్లీ అద్భుతంగా రాణించాడు. వరల్డ్ కప్-2019లో అతడు భాగస్వామ్యం కాలేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఇక టామ్ కరన్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్‌లో తను విఫలమైనా.. నేడు 4 వికెట్లతో సత్తా చాటాడు. అయితే, మేం డెత్ ఓవర్ల బౌలింగ్‌పై మరింత దృష్టి సారించాల్సి ఉంది. మిడిల్ ఓవర్స్‌లో కూడా నిలకడగా ఆడాల్సి ఉంది. ప్రపంచకప్‌నకు ముందే ఈ లోపాలన్నీ సరిదిద్దుకోవాలి. పాకిస్తాన్‌తో ప్రారంభం కాబోయే సిరీస్ కోసం సన్నద్ధమవుతాం’’ అని చెప్పుకొచ్చాడు. Oh @jbairstow21! 😱 Scorecard/clips: https://t.co/litP0weU1U 🏴 #ENGvSL 🇱🇰 pic.twitter.com/AS1y93rmpM — England Cricket (@englandcricket) July 4, 2021 We need 167 to win 🏏 Scorecard/clips: https://t.co/litP0vXjam 🏴 #ENGvSL 🇱🇰 pic.twitter.com/QGFTHIJHTa — England Cricket (@englandcricket) July 4, 2021 -
వైరల్: హార్దిక్, సామ్ కరన్‌ల గొడవ
పుణే: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సిరీస్ ఆసక్తికరంగా సాగుతున్న వేళ ఆటగాళ్ల మధ్య గొడవలతో మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. మొదటి వన్డేలో కృనాల్ పాండ్యా- టామ్ కరన్, కోహ్లి-బట్లర్‌ల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ మధ్య రెండో వన్డేలో మాటల యుద్ధం చోటుచేసుకుంది. టీమిండియా ఇన్నింగ్స్ 46వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సామ్ కరన్ వేసిన యార్కర్‌ను పాండ్యా ఆడడంలో విఫలమయ్యాడు. దీంతో సామ్ కరన్ పాండ్యాను ఉద్దేశించి 'నా యార్కర్‌ను నువ్వు ఆడలేవు' అంటూనే మరిన్ని కఠిన వ్యాఖ్యలు చేశాడు. అసలే కోపానికి మారుపేరుగా ఉండే హార్దిక్.. సామ్ కరన్ వైపు వేగంగా పరిగెత్తుకొచ్చి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. దీంతో సామ్ కరన్ మరోసారి వెనక్కి తిరిగి ఏదో అనబోగా పాండ్యా మరోసారి బ్యాట్ చూపిస్తూ సమాధానమిచ్చాడు.ఇంతలో అంపైర్ జోక్యంతో ఇద్దరి మధ్య వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనపై నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో ట్రోల్ చేశారు. మొదటి వన్డేలో కృనాల్.. టామ్ కరన్.. ఇప్పుడు హార్దిక్.. సామ్ కరన్‌ల మధ్య గొడవ.. ఇరు జట్ల సోదరుల వైరం.. భలే గమ్మత్తుగా ఉంది'' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (114 బంతుల్లో 108; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా... రిషభ్ పంత్ (40 బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), కోహ్లి (79 బంతుల్లో 66; 3 ఫోర్లు, 1 సిక్స్) సహకరించారు. అనంతరం ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 4 వికెట్లకు 337 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెయిర్‌స్టో (112 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకం సాధించగా... స్టోక్స్ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు), జేసన్ రాయ్ (52 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. చదవండి: రనౌట్ వివాదం.. స్టోక్స్ అవుటా.. కాదా? వైరల్: సహనం కోల్పోయిన కృనాల్.. అంపైర్ జోక్యంతో! pic.twitter.com/kTWDSIc9y2 — tony (@tony49901400) March 26, 2021 -
కృనాల్- టామ్ కరన్ గొడవ; కోహ్లి రియాక్షన్ చూశారా?!
పుణె: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో భారత ఆటగాళ్లు పలు రికార్డులు నమోదు చేశారు. వన్డేల్లో అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా... కెరీర్ తొలి ఇన్నింగ్స్‌లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ (26 బంతుల్లో) చేసిన టీమిండియా బ్యాట్స్‌మన్‌గా నిలవగా, అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4/54) నమోదు చేసిన భారత బౌలర్‌గా ప్రసిధ్ కృష్ణ రికార్డు సాధించాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశంలో 10 వేల పరుగులు చేసిన రెండో టీమిండియా ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇక ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ల జాబితాలో ఓపెనర్ శిఖర్ ధావన్(98) ఐదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో తొలి వన్డేలో 66 పరుగులతో పర్యాటక జట్టును మట్టికరిపించిన భారత్ గెలుపుతో సిరీస్‌ను ఆరంభించింది. అయితే, మొదటి వన్డేలో పలు చిరస్మరణీయ రికార్డులతో పాటు, కృనాల్ పాండ్యా- టామ్ కరన్ మధ్య జరిగిన వాగ్వాదం కూడా క్రీడా ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. కాగా, 49వ ఓవర్లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ టామ్ కరన్ బౌలింగ్‌ల్ సింగిల్ తీసే క్రమంలో ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. అంపైర్ నితిన్ మీనన్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ, కృనాల్ దూకుడుగా వ్యవహరిస్తూ టామ్పైకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో జోస్ బట్లర్ వచ్చి, టామ్‌తో కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత ఎవరిస్థానాల్లోకి వారు వెళ్లారు. ఈ క్రమంలో కృనాల్‌ను తన స్థానానికి వెళ్లాల్సిందిగా అంపైర్ మరోసారి సూచించడంతో వివాదం సద్దుమణిగింది. ఇక డగౌట్లో కూర్చుని, ఇదంతా చూస్తున్న కెప్టెన్ కోహ్లి కాసేపు కన్ఫ్యూజన్కు లోనయ్యాడు. ఏం జరుగుతుందో అర్థంకాక అలాగే తీక్షణంగా చూస్తుండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. pic.twitter.com/3Xn1UWQVdF — tony (@tony49901400) March 23, 2021 -
వైరల్: కృనాల్ పాండ్యా- టామ్ కరన్ వాగ్వాదం!
పుణె: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డే ద్వారా అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా, మొదటి మ్యాచ్‌లోనే పలు రికార్డులు సొంతం చేసుకుని సత్తాచాటాడు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కృనాల్, అరంగేట్రంలో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేగాక, తొలి వన్డేలోనే అర్ధ శతకం సాధించిన 15వ టీమిండియా ఆటగాడిగా, అదే విధంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, ఫిఫ్టీ సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు, సోదరుడు హార్దిక్ పాండ్యా చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్న కృనాల్ తండ్రిని తలచుకుని భావోద్వేగానికి లోనైన క్షణాలు అతడి అభిమానుల మనసును మెలిపెడుతున్నాయి. ఇలా మంగళవారం మ్యాచ్ ఆరంభమైన సమయం నుంచి అతడు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అయితే, అంతా బాగానే ఉన్నా, 49వ ఓవర్లో కృనాల్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ టామ్ కరన్ బౌలింగ్‌ల్ సింగిల్ తీసే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వీరి మాటల యుద్ధం శ్రుతిమించడంతో అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, కృనాల్ వెనక్కి తగ్గలేదు. ‘అసలేంటి నీ సమస్య’ అన్నట్లుగా టామ్ కరన్ వైపు దూసుకురాబోయాడు. ఇంతలో జోస్ బట్లర్ సైతం టామ్‌కు జతకలిశాడు. అయితే, వెంటనే టామ్ తన స్థానంలోకి వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కాగా కృనాల్- టామ్ కరన్ గొడవకు గల స్పష్టమైన కారణం తెలియాల్సి ఉంది. చదవండి: కృనాల్ ఖాతాలో పలు రికార్డులు Krunal pandya debut includes a 50 Plus Verbal battle with Tom Curran #ENGvIND #IndiavsEngland pic.twitter.com/EX3qAQE8KQ — theshivamkapoor (@sherlony3000) March 23, 2021 -
రషీద్ హ్యాట్రిక్.. కానీ బర్త్‌డే బాయ్‌దే గెలుపు
అడిలైడ్: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో బుధవారం రెండు వినూత్న ఘటనలు జరిగాయి. అడిలైడ్ స్ట్రైకర్ స్పిన్నర్ రషీద్ ఖాన్, సిడ్నీ సిక్సర్స్ బౌలర్, బర్త్‌డే బాయ్ జోష్ హేజిల్వుడ్ల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. అయితే ఈ పోరులో బర్త్‌డే బాయ్ హేజిల్ వుడ్ విజయం సాధించాడు. కాగా సిడ్నీ ఆల్‌రౌండర్ టామ్ కరన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బీబీఎల్‌లో భాగంగా బుధవారం అడిలైడ్, సిడ్నీ జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అడిలైడ్‌కు టామ్ కరన్(4/22) చుక్కలు చూపించాడు. కరన్‌కు తోడు మిగతా సిడ్నీ బౌలర్లు సహకారం అందించడంతో అడిలైడ్ జట్టు 19.4 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీకి కూడా ఆశించిన ఆరంభం లభించలేదు. అడిలైడ్ బౌలర్ నెసెర్ ఆరంభంలోనే సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్ల వికెట్లు పడగొట్టాడు. అయితే ఎట్టాగెట్టానో గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్న సిడ్నీ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పనిపట్టాడు రషీద్ ఖాన్. వరుసగా జేమ్స్ విన్సే(27), జోర్డాన్ సిల్క్(16), జాక్ ఎడ్వర్డ్స్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. కాగా, బీబీఎల్‌లో రషీద్‌కు ఇది మూడోది కాగా, అడిలైడ్ స్ట్రైకర్ జట్టుకు మొదటిది. రషీద్ దెబ్బకు 97 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి సిడ్నీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో టామ్ కరన్ ఈ సారి బ్యాట్‌తో జట్టును ఆదుకున్నాడు. అయితే అతడు కూడా 18 ఓవర్ చివరి బంతికి ఔటవ్వడంతో సిడ్నీ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. అంతేకాకుండా చివరి రెండో ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ జట్టుకు 12 పరుగులు అవసరం కాగా క్రీజులో టెయిలెండర్లు మాత్రమే ఉన్నారు. అయితే సిడిల్ వేసిన 19 ఓవర్లో హేజిల్ వుడ్ అనూహ్యంగా హ్యాట్రిక్ ఫోర్ కొట్టి సిడ్నీ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో రషీద్, హేజిల్ వుడ్ పోరులో(హ్యాట్రిక్) బర్త్‌డే బాయే గెలిచాడాని కామెంటేటర్లు సరదాగా కామెంట్ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న టామ్ కరన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
రషీద్ హ్యాట్రిక్ సాధించినప్పటికీ..!
-
స్టార్క్ స్థానంలో టామ్ కుర్రాన్
కోల్‌కతా: కుడి కాలు గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌కు దూరమైన కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ మిచెల్ స్టార్క్ స్థానంలో టామ్ కుర్రాన్ ఎంపిక ఖరారైంది. ఇంగ్లండ్‌కు చెందిన టామ్ కుర్రాన్‌ను స్టార్క్ స్థానంలో తీసుకోబోతున్నట్లు కేకేఆర్ యాజమాన్యం ప్రకటించింది. 2017 జూన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేసిన టామ్.. ఇప్పటివరకూ ఆరు టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్‌గా 50కిపైగా టీ 20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం టామ్ది. కౌంటీల్లో తన బౌలింగ్‌తో సత్తాచాటుకుని డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా గుర్తింపు సాధించాడు. మరొకవైపు ఇంగ్లండ్ బయట మరొక జట్టుకు ప్రాతినిథ్యం వహించడం కుర్రాన్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. ఎంతోమంది స్టార్ బౌలర్లను వెనక్కునెట్టి మొదటిసారి ఐపీఎల్లో చోటు దక్కించుకున్న 23 ఏళ్ల కుర్రాన్ ఎంతవరకూ సత్తాచాటతాడో చూడాలి.