టామ్ కుర్రాన్
కోల్‌కతా: కుడి కాలు గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌కు దూరమైన కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ మిచెల్ స్టార్క్ స్థానంలో టామ్ కుర్రాన్ ఎంపిక ఖరారైంది. ఇంగ్లండ్‌కు చెందిన టామ్ కుర్రాన్‌ను స్టార్క్ స్థానంలో తీసుకోబోతున్నట్లు కేకేఆర్ యాజమాన్యం ప్రకటించింది.
2017 జూన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేసిన టామ్.. ఇప్పటివరకూ ఆరు టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్‌గా 50కిపైగా టీ 20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం టామ్‌ది. కౌంటీల్లో తన బౌలింగ్‌తో సత్తాచాటుకుని డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా గుర్తింపు సాధించాడు. మరొకవైపు ఇంగ్లండ్ బయట మరొక జట్టుకు ప్రాతినిథ్యం వహించడం కుర్రాన్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. ఎంతోమంది స్టార్ బౌలర్లను వెనక్కునెట్టి మొదటిసారి ఐపీఎల్‌లో చోటు దక్కించుకున్న 23 ఏళ్ల కుర్రాన్ ఎంతవరకూ సత్తాచాటతాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment