ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొనుగోలు చేసిన ఆటగాడిపై బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) నిర్వహకులు నిషేధం విధించారు. బీబీఎల్ 2023-24లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ పేసర్ టామ్ కర్రన్‌ను నాలుగు మ్యాచ్‌ల పాటు నిషేధించారు. బీబీఎల్‌లో భాగంగా డిసెంబర్ 11న హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ను బెదిరించినందుకు గాను టామ్ కర్రన్‌పై చర్యలకు తీసుకున్నట్లు బీబీఎల్ నిర్వహకులు వెల్లడించారు.
హోబర్ట్‌తో మ్యాచ్‌కు ముందు రిహార్సల్స్ సందర్భంగా కర్రన్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడని బీబీఎల్ నిర్వహకులు తెలిపారు. మ్యాచ్‌కు ముందు పిచ్‌పై బౌలింగ్ చేసేందుకు కర్రన్ ప్రయత్నించగా అంపైర్ వారించాడని, అయినా కర్రన్ లెక్క చేయకుండా అంపైర్ వైపు బౌలింగ్ చేయబోయాడని పేర్కొన్నారు. కర్రన్ చర్యను లెవెల్ 3 నేరం కింద పరిగణించి, అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.
Tom Curran has been banned for four BBL games after intimidating the umpire during pre-match practice.pic.twitter.com/OwvVYkb7kz
— CricTracker (@Cricketracker) December 21, 2023
కాగా, డిసెంబర్ 11న హోబర్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్రన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన కర్రన్ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ ఓ బౌండరీ బాది తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఇదిలా ఉంటే, దుబాయ్‌లోని కోకోకోలా ఎరీనా వేదికగా డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఆర్సీబీ జట్టు టామ్ కర్రన్‌ను 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. 28 ఏళ్ల టామ్ కర్రన్ ఐపీఎల్‌లో వివిధ జట్ల తరఫున 13 మ్యాచ్‌లు ఆడాడు. గత సీజన్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న సామ్ కర్రన్‌కు టామ్ అన్న అవుతాడు. టామ్ ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 2 టెస్ట్‌లు, 29 వన్డేలు, 30 టీ20 ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment