
లండన్: హండ్రెడ్ బాల్ మెన్స్ కాంపిటీషన్‌లో భాగంగా ఓవల్ ఇన్‌విసిబుల్ కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తన మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఇన్‌విసిబుల్ జట్టు టాప్ 3లో నిలిచింది. వెల్ష్ ఫైర్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కెప్టెన్ డకెట్ 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డుప్లోయ్ 17, కాబ్ 12 పరుగులు చేశారు. ఇన్‌విసిబుల్స్ బౌలింగ్‌లో టామ్ కరన్ 3 వికెట్లతో సత్తా చటగా.. టోప్లే, మహమూద్, షంసీలు తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇన్‌విసిబుల్స్ 93 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు జాసన్ రాయ్ 8, విల్ జాక్స్ 20 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను గెలిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక చివర్లో లారీ ఈవన్స్ 28 పరుగులు నాటౌట్‌తో బిల్లింగ్స్‌కు సహకరించాడు. తాజా విజయంతో ఓవల్ ఇన్‌విసిబుల్స్ మూడో స్థానంలో ఉండగా.. వెల్ష్ ఫైర్ నాలుగో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment