Sam Billings
-
శివాలెత్తిన సామ్ బిల్లింగ్స్.. హండ్రెడ్ లీగ్ ఫైనల్లో ఓవల్ ఇన్విన్సిబుల్స్
హండ్రెడ్ లీగ్ 2023 ఎడిషన్ తుది అంకానికి చేరుకుంది. ఓ ఫైనల్ బెర్త్ ఖరారైంది. నిన్న (ఆగస్ట్ 21) జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ రాకెట్స్‌పై విజయం సాధించడంతో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తుది పోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. మరో 3 లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ పాయింట్ల ఆధారంగా (8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింటుల) ఇన్విన్సిబుల్స్ ఫైనల్స్‌కు చేరుకుంది. బర్మింగ్హమ్ ఫీనిక్స్, నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఇదివరకే లీగ్ నుంచి ఎలిమినేట్ కాగా, మరో ఫైనల్ బెర్త్ కోసం మాంచెస్టర్స్ ఒరిజినల్స్, ట్రెంట్ రాకెట్స్, సథరన్ బ్రేవ్ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్.. కొలిన్ మున్రో (25 బంతుల్లో 36; ఫోర్, 3 సిక్సర్లు), గ్రెగరీ (24 బంతుల్లో 35; 4 ఫోర్లు), డేనియల్ సామ్స్ (9 బంతుల్లో 19నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓవల్ బౌలర్లలో టామ్ కర్రన్, ఆడమ్ జంపా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. స్పెన్సర్ జాన్సన్, అట్కిన్సన్, నాథన్ సౌటర్ తలో వికెట్ దక్కించుకున్నారు. శివాలెత్తిన సామ్ బిల్లింగ్స్.. 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓవల్ టీమ్.. మరో 8 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓవల్ కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ (40 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి తన జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. అతనికి జేసన్ రాయ్ (19), విల్ జాక్స్ (31), టామ్ కర్రన్ (18 నాటౌట్) సహకరించారు. రాకెట్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్ 2, లూక్ వుడ్, సామ్ కుక్, మాథ్యూ కార్టర్ తలో వికెట్ పడగొట్టారు. -
నరైన్ ఆల్‌రౌండ్ షో.. మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన విండీస్ ప్లేయర్
మెన్స్ హండ్రెడ్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ బోణీ కొట్టింది. లండన్ స్పిరిట్‌తో నిన్న (ఆగస్ట్ 2) జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ షోతో (20-9-14-2 & 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 13 నాటౌట్) ఓవల్‌ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్.. నాథన్ సౌటర్ (3/34), సునీల్ నరైన్ (2/14), గస్ అట్కిన్సిన్ (1/22), టామ్ కర్రన్ (1/22), సామ్ కర్రన్ (1/31) ధాటికి నిర్ణీత 100 బంతుల్లో 131 పరుగులకు ఆలౌటైంది. రొస్సింగ్టన్ (21 బంతుల్లో 39, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మాథ్యూ వేడ్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు), కెప్టెన్ లారెన్స్ (17 బంతుల్లో 24; 4 ఫోర్లు, సిక్స్) రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం 132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్ మరో బంతి మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ జాక్స్ (6 బంతుల్లో 11; 2 ఫోర్లు), జోర్డన్ కాక్స్ (21 బంతుల్లో 22; 2 ఫోర్లు), సామ్ కర్రన్ (28 బంతుల్లో 34; 5 ఫోర్లు), సామ్ బిల్లింగ్స్ (15 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్) రాణించగా.. ఆఖర్లో సునీల్ నరైన్ (5 బంతుల్లో 13 నాటౌట్; ఫోర్, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో ఇన్విన్సిబుల్స్‌ను గెలిపించాడు. లండన్ బౌలర్లలో డేనియల్ వార్రాల్, జోర్డన్ థాంప్సన్, నాథన్ ఇల్లిస్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ క్రిట్చీల్లీ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన నరైన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
సామ్ బిల్లింగ్స్ మెరుపు అర్ధశతకం.. రషీద్ ఖాన్ మయాజాలం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్‌తో నిన్న (మార్చి 4) జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ సామ్ బిల్లింగ్స్ (35 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో చెలరేగగా.. షఫీక్ (35 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించాడు. ఫకర్ జమాన్ (0), తలాత్ (9), రషీద్ ఖాన్ (0), షాహీన్ అఫ్రిది (9), హరీస్ రౌఫ్ (0) విఫలం కాగా.. మీర్జా బేగ్ (17), సికందర్ రజా (14), డేవిడ్ వీస్ (15 నాటౌట్) రెండంకెల స్కోర్ చేశారు. సుల్తాన్స్ బౌలర్లలో అన్వర్ అలీ, ఇహసానుల్లా, అబ్బాస్ అఫ్రిది, పోలార్డ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సమీన్ గుల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సుల్తాన్స్ బౌలర్లు 14 ఎక్స్ట్రా పరుగులు ఇచ్చారు. ఇందులో 11 వైడ్ బాల్స్ ఉండటం విశేషం. అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సుల్తాన్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తియ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఖలందర్స్ బౌలర్ రషీద్ ఖాన్ (4-0-15-3) తన స్పిన్ మాయాజాలంతో సుల్తాన్స్‌ను భారీ దెబ్బకొట్టగా.. జమాన్ ఖాన్ (1/23), హరీస్ రౌఫ్ (1/30), సికందర్ రజా (1/10), హుసేన్ తలాత్ (1/22) తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో కీరన్ పోలార్డ్ (28 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించినా ప్రయోజనం లేకుండా పోయింది. మహ్మద్ రిజ్వాన్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో సీజన్ ఆరంభంలో వరుసగా విజయాలు సాధించిన సుల్తాన్స్.. రిజ్వాన్ ఒక్కసారిగా లయ తప్పడంతో పరాజయాల బాటపట్టింది. లీగ్‌లో ఇవాళ (మార్చి 5) ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. -
IPL 2023: కేకేఆర్‌కు షాకిచ్చిన హార్డ్ హిట్టర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 ఎడిషన్ ప్రారంభానికి ముందు టు టైమ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు హార్డ్ హిట్టర్, వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ సామ్ బిల్లింగ్స్ (ఇంగ్లండ్).. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇవాళ (నవంబర్ 14) ప్రకటన చేశాడు. ఇంగ్లీష్ సమ్మర్లో (కెంట్) సుదీర్ఘ ఫార్మాట్‌పై ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిల్లింగ్స్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. Have taken the tough decision that I won’t be taking part in the next IPL @KKRiders Looking to focus on longer format cricket at the start of the English summer with @kentcricket pic.twitter.com/7yeqcf9yi8 — Sam Billings (@sambillings) November 14, 2022 31 ఏళ్ల బిల్లింగ్స్‌ను 2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 2 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. గత సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన అతను.. 122.46 స్ట్రయిక్ రేట్‌తో 24.14 సగటున 169 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యుత్తమ స్కోర్ 36గా ఉంది. ఇదిలా ఉంటే, సీజన్ 2023 ట్రేడింగ్‌లో భాగంగా కేకేఆర్ జట్టు.. రహ్మానుల్లా గుర్భాజ్ (ఆఫ్ఘనిస్తాన్), లోకీ ఫెర్గూసన్ (న్యూజిలాండ్)లను డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ నుంచి, అలాగే శార్దూల్ ఠాకూర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తెచ్చుకుంది. జట్టును వీడిన సామ్ బిల్లింగ్స్ స్థానాన్ని ఆఫ్ఘన్ వికెట్‌కీపర్ గుర్భాజ్ భర్తీ చేయనున్నాడు. కాగా, కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితా పాటు వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ నవంబర్ 15ను డెడ్‌లైన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ముంబై, చెన్నై జట్లు మాత్రమే తమ రిలీజ్డ్, రీటెయిన్డ్ ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐకి సమర్పించినట్లు తెలుస్తోంది. చదవండి: స్టార్ ఆల్‌రౌండర్‌ను వదులుకున్న ముంబై, జడేజాను అట్టిపెట్టుకున్న చెన్నై..! -
కళ్లు చెదిరే క్యాచ్! 40 ఏళ్ల అంకుల్ చేతిలో అవుటయ్యావు.. ఎందుకిలా?
India VS England 5th Test- Shreyas Iyer: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నిరాశ పరిచాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 11 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 15 పరుగులు చేసి ఫామ్‌లో ఉన్నట్లు కనిపించాడు. అయితే, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్ ఆండర్సన్ వేసిన షార్ట్ బాల్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్‌కు దొరికిపోయాడు. అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ను కళ్లు చెదిరే రీతిలో ఒంటి చేత్తో ఒడిసిపట్టాడు బిల్లింగ్స్. దీంతో శ్రేయస్ అయ్యర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. మరోవైపు.. అయ్యర్‌ను అవుట్ చేసేందుకు షార్ట్ బాల్‌తో తాము పన్నిన పథకం సఫలం కావడంతో ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ముఖంపై చిరునవ్వు విసిరింది. కాగా ఐపీఎల్-2022లో అయ్యర్ సారథిగా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెకల్లమ్ కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక సామ్ బిల్లింగ్స్ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది.ఈ క్రమంలో అయ్యర్ అవుటైన తీరుపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో చాలా సార్లు షార్ట్ బాల్‌కు వికెట్ పారేసుకున్న అతడు మళ్లీ అదే తప్పు పునరావృతం చేయడంపై మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. ‘‘40 ఏళ్ల అంకుల్(ఆండర్సన్‌ను ఉద్దేశించి) బౌలింగ్‌లో.. మరీ ఇలా అవుటయ్యావు.. ఏంటిది అయ్యర్? నువ్వు చాలా బాగా ఆడతావు. కానీ షార్ట్ బాల్ మాత్రం నీ బలహీనత అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటావు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆటలో ఇవన్నీ సహజమని, అయితే అయ్యర్ అవుట్ కాగానే మెకల్లమ్ సంబరపడిపోయిన తీరు శ్రేయస్ విలువేంటో చాటుతోందని అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు. చదవండి: IND vs ENG Test Day 1: పంత్ పరాక్రమం.. మెరుగైన స్థితిలో టీమిండియా Ind Vs Eng: అసలు అంచనాలే లేవు... అయినా కూడా నువ్వు మరోసారి! ఎన్నాళ్లో ఇలా? Ooooooh what a catch @sambillings!! 🤲 Scorecard & Videos: https://t.co/jKoipFn3e9 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/BOLkN8d7TR — England Cricket (@englandcricket) July 1, 2022 1467703 Shreyas Iyer whenever he sees a ball bounce even a little bit: pic.twitter.com/Gr2wJE6UsJ — Mohit Kumar (@iamsportsgeek) July 1, 2022 Everyone is gone. So do you overthink. Iyer will come good on these situations more often thn not. But just like any other player..need to work on his weakness. At least on leaving that short ball. — Kaushik (@CricKaushik_) July 1, 2022 Iyer rattled by 40 years old uncle and we have booked him for T20 World Cup in Australia. 🤣😭😭#INDvsENG — mahi (@TheJinxyyyy) July 1, 2022 -
అనుభవలేమి 'జూనియర్ ఏబీ' కొంపముంచింది
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసిన డెవాల్డ్ బ్రెవిస్ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అండర్-19 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా తరపున టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన బ్రెవిస్‌ను జూనియర్ ఏబీగా అభివర్ణిస్తున్నారు.కేకేఆర్‌తో మ్యాచ్‌లో బ్రెవిస్ చేసింది 29 పరుగులే అయినప్పటికి అతని ఇన్నింగ్స్‌లో చూడచక్కని రెండు బౌండరీలు.. రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే అనుభవంలేమి జూనియర్ ఏబీ కొంపముంచింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో తొలి బంతికే డీప్ మిడ్‌వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. ఆ తర్వాతి మూడు బంతులు పరుగులు రాలేదు. ఓవర్ ఐదో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చేశాడు. ఇది గమనించిన సామ్ బిల్లింగ్స్ వేగంగా వికెట్లను గిరాటేశాడు. అయితే రిప్లేలో బ్రెవిస్ కనీసం క్రీజులోకి వచ్చే ప్రయత్నం చేయలేదు. Courtesy: IPL Twitter తొలి మ్యాచ్ ఆడుతున్నానన్న టెన్షన్ అతనిలో స్పష్టంగా కనిపించింది. తాను క్రీజులోనే ఉన్నానని భ్రమించినట్టున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో బ్రెవిస్ చేసేదేం లేక నిరాశగా పెవిలియన్‌వైపు నడిచాడు. ఉన్నది కాసేపే అయినా మంచి ఇన్నింగ్స్ ఆడిన బ్రెవిస్‌ను పాట్ కమిన్స్ సహా ఇతర ఆటగాళ్లు అభినందించడం విశేషం. డెవాల్డ్ బ్రెవిస్ ఔట్ కోసం క్లిక్ చేయండి -
'రసెల్‌తో బ్యాటింగ్ అంటే నాకు ప్రాణ సంకటం'
కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తన విశ్వరూపం చూపెట్టాడు. కష్టాల్లో పడిన జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. 31 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 70 పరుగులతో సునామీ ఇన్నింగ్స్‌ను తలపించాడు. అతని దాటికి కేకేఆర్ 138 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే చేధించింది. ఓడియన్ స్మిత్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో రసెల్ విశ్వరూపాన్నే చూపించాడు. మూడు సిక్సర్లు, ఒక ఫోర్, నోబాల్ సహా మొత్తం 24 పరుగులు పిండుకోగా.. అదే ఓవర్ ఆఖరి బంతిని సామ్ బిల్లింగ్స్ సిక్సర్ సంధించడంతో మొత్తం 30 పరుగులు వచ్చాయి. కాగా మ్యాచ్‌లో రసెల్ విధ్వంసాన్ని కళ్లారా ఆస్వాధించిన సామ్ బిల్లింగ్స్ 24 పరుగులు నాటౌట్‌గా నిలిచి అతనికి సహకరించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సామ్ బిల్లింగ్స్ రసెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''రసెల్ విధ్వంసాన్ని దగ్గరుండి చేశాను. ఒక విధ్వంసకర ఆటగాడు ఫామ్‌లో ఉంటే మనం సపోర్ట్ చేయడం తప్ప ఇంకేం చేయలేము. పవర్ హిట్టింగ్‌లో అతన్ని మించినవారు లేరని మరోసారి నిరూపించాడు. కొన్నిసార్లు రసెల్ విధ్వంసం చూసి.. అతనితో కలిసి ఆడాలంటే నాకు ప్రాణ సంకటంగా అనిపించేది. కానీ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో నుంచి రసెల్ ఇన్నింగ్స్‌ను ఆస్వాధించాను. వాస్తవానికి 51 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు.. రసెల్ ఒక మాట చెప్పాడు. వికెట్లు పోయాయని కంగారుపడొద్దు.. పోరాడుదాం.. ఫలితం మనకు అనుకూలంగా వస్తుంది. మా హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ కూడా రసెల్‌కు ఇదే విషయాన్ని చెప్పి పంపాడు.'' అంటూ తెలిపాడు. చదవండి: IPL 2022: పంజాబ్ బౌలర్‌కు చుక్కలు చూపించిన రసెల్ IPL 2022: పగ తీర్చుకున్న కేకేఆర్ బౌలర్.. వీడియో వైరల్ -
చిన్ననాటి స్నేహితురాలితో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్
Sam Billings Engaged With Long Term Girl Friend.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ తన చిన్ననాటి స్నేహితురాలితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. టెన్నిస్ ప్లేయర్ అయిన సారా కాంట్లేతో లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న సామ్ బిల్లింగ్స్ శనివారం ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా బిల్లింగ్స్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఈరోజు ప్రపంచంలో లక్కీ పర్సన్ నేనే.. మిస్టర్ బి టూ అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా టెన్నిస్ ప్లేయర్‌గా ఎన్నో ట్రోఫీలు గెలుచుకున్న కాంట్లే సైకాలజీలో మేజర్ డిగ్రీని పూర్తి చేసింది. ఇక 2015లో ఇంగ్లండ్ క్రికెట్లో అరంగేట్రం చేసిన సామ్ బిల్లింగ్స్ 25 వన్డేల్లో 607 పరుగులు.. 33 టి20ల్లో 417 పరుగులు చేశాడు. ఈ ఆరేళ్లలో రొటేషన్ పద్దతిలో ఇన్ అవుట్‌గా ఉన్నప్పటికి ఏనాడు జాతీయ జట్టుకు దూరమైన దాఖలాలు కనిపించలేదు. ఇటీవలే టి20 ప్రపంచకప్ 2021లోనూ సామ్ బిల్లింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఇక టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ సూపర్ 12లో మంచి విజయాలు సాధించినప్పటికి.. సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. చదవండి: Mitchell McClenaghan: 72 గంటలు కాలేదు.. భారత్- న్యూజిలాండ్ సిరీస్ 'మీనింగ్లెస్' View this post on Instagram A post shared by Sam Billings (@sambillings) -
సామ్ బిల్లింగ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్; థ్రిల్లింగ్ మ్యాచ్‌లో సూపర్ విక్టరీ
లండన్: హండ్రెడ్ బాల్ మెన్స్ కాంపిటీషన్లో భాగంగా ఓవల్ ఇన్విసిబుల్ కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తన మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఇన్విసిబుల్ జట్టు టాప్ 3లో నిలిచింది. వెల్ష్ ఫైర్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కెప్టెన్ డకెట్ 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డుప్లోయ్ 17, కాబ్ 12 పరుగులు చేశారు. ఇన్విసిబుల్స్ బౌలింగ్‌లో టామ్ కరన్ 3 వికెట్లతో సత్తా చటగా.. టోప్లే, మహమూద్, షంసీలు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇన్విసిబుల్స్ 93 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు జాసన్ రాయ్ 8, విల్ జాక్స్ 20 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను గెలిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక చివర్లో లారీ ఈవన్స్ 28 పరుగులు నాటౌట్‌తో బిల్లింగ్స్‌కు సహకరించాడు. తాజా విజయంతో ఓవల్ ఇన్విసిబుల్స్ మూడో స్థానంలో ఉండగా.. వెల్ష్ ఫైర్ నాలుగో స్థానంలో ఉంది. -
బంతిని అందుకునే తాపత్రయం.. బొక్కబోర్లా పడ్డాడు
లండన్: జెంటిల్మన్ గేమ్‌గా పిలుచుకునే క్రికెట్లో ఫన్నీ మూమెంట్స్ జరగడం సహజమే. ఒక్కోసారి ఎవరు ఊహించిన విధంగా జరిగితే నవ్వులు పూయడం ఖాయం. తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్ క్రికెట్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శుక్రవారం కెంట్, గ్లామోర్గాన్ మధ్య మ్యాచ్ జరిగింది. కెంట్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 28వ ఓవర్‌ను ఆస్ట్రేలియన్ బౌలర్ మైకెల్ నెసెర్ వేశాడు. నెసెర్ వేసిన బంతిని ఇంగ్లండ్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్ ఫైన్‌లెగ్ దిశగా ఆడాడు. బ్యాట్స్‌మెన్ ఇద్దరు కూల్‌గా సింగిల్ కంప్లీట్ చేశారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ చోటుచేసుకుంది. డీప్‌లో ఉన్న ఫీల్డర్ కీపర్ కమ్ కెప్టెన్ క్రిస్ కూక్‌కు త్రో విసిరాడు. అయితే అతను బంతిని రాంగ్ సైడ్‌లో వేయగా... దానిని అందుకునే ప్రయత్నంలో క్రూక్ వికెట్ స్టంపింగ్స్‌ను పట్టించుకోలేదు. ఇంకేముంది.. బంతిని అందుకున్నాడు గానీ అప్పటికే వికెట్ల పై నుంచి దాటుతూ బొక్కబోర్లా పడ్డాడు. కూక్ ప్యాంట్‌కు చిక్కుకొని రెండు వికెట్లు మొత్తం బయటికి వచ్చాయి. కెప్టెన్ చేసిన పనికి అతని సహచర ఆటగాళ్లు నవ్వాపుకోలేకపోయారు. ఈ వీడియోనూ గ్లామోర్గాన్స్ తన ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఫన్నీ చర్యతో తన సహచరులకు నవ్వు తెప్పించిన కూక్ కెప్టెన్‌గా.. బ్యాట్స్‌మన్‌గా మాత్రం అదరగొట్టాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో గ్లామోర్గాన్స్ తరపున 365 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక కెంట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కూక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 45 ఓవర్ల ఆట ముగిసేసరికి కెంట్ 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. గ్లామోర్గాన్స్ బౌలర్ మైకెల్ నెసెర్(15-10-15-4) అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. చదవండి: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. సింపుల్‌గా కొట్టేశాడు 'పో.. వెళ్లి బౌలింగ్ చేయ్ బ్రో' 😂😂😂 @Cooky_24! His teammates enjoyed this one from the skipper!#GoGlam pic.twitter.com/fRGg7si1md — Glamorgan Cricket 🏏 (@GlamCricket) May 21, 2021 -
'వైఫై అస్సలు బాలేదు.. సాయం చేయండి'
ముంబై: ఏప్రిల్ 9నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు సమాయత్తమవుతున్నాయి. ఈసారి సీజన్లో ఆయా జట్లకు హోం అడ్వాంటేజ్ లేకపోవడంతో తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్ సీజన్ రన్నరఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్రాక్టీస్ కోసం ముంబైకు చేరింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్ కూడా టీమిండియాతో సిరీస్ ముగిసిన తర్వాత జట్టుతో కలిశాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైలోని తాజ్‌మహల్ ప్యాలెస్‌లో బస చేసింది. తాము ఉంటున్న హోటల్లో వైఫై సౌకర్యం అస్సలు బాలేదని నాకు సాయం చేయండి అంటూ బిల్లింగ్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న సీఎస్కేతో ఆడనుంది. చదవండి: కోహ్లి లేకుండానే ఆర్సీబీ ప్రాక్టీస్ ''హోటల్ రూంలో వైఫై సౌకర్యం అస్సలు బాలేదు.. ఇండియాలో వేగంగా ఉండే ఒక వైఫై డాంగిల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నా.. అందుకు మీరిచ్చే సూచనలు చాలా అవసరం.. సాయం చేయండి ప్లీజ్'' అంటూ కామెంట్ చేశాడు. బిల్లింగ్స్ అడిగిన దానిపై నెటిజన్లు స్పందించారు. ఇండియాలో ఉన్న వైఫై సౌకర్యం కల్పిస్తున్న కంపెనీలతో పాటు వాటి ధరలను బిల్లింగ్స్‌కు షేర్ చేశారు. వాటిలో జియో, ఎయిర్టెల్ అత్యధిక సార్లు రిపీట్ అయ్యాయి. దీంతో జియో లేదా ఎయిర్‌టెల్‌లో ఏది బాగుంటుందని బిల్లింగ్స్ మరోసారి అడగ్గా ఎక్కువమంది జియోకు ఓటు వేశారు. ''దీంతో తాను జియో డాంగిల్‌ను కొంటున్నా.. నాకు స్పందించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా'' అంటూ తెలిపాడు. కాగా టీమిండియాతో జరిగిన సిరీస్‌లో బిల్లింగ్స్ కేవలం ఒక వన్డే మ్యాచ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. చదవండి: IPL 2021: మరోసారి ఫేవరెట్‌గా సీఎస్కే Hotel WiFi is non existent..... 🤣 Best WiFi dongle to buy and use in India please? pic.twitter.com/xWhfnUBpoM — Sam Billings (@sambillings) March 30, 2021 -
ఇంగ్లండ్‌కు షాక్.. రెండో వన్డేకు ఇద్దరు ఆటగాళ్లు దూరం..!
పూణే: తొలి వన్డేలో టీమిండియా చేతిలో 66 పరుగుల తేడాతో ఘోరపరాభవాన్ని ఎదుర్కొన్న ఇంగ్లీష్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండో వన్డేకు ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, స్టార్ బ్యాట్స్‌మెన్ సామ్ బిల్లింగ్స్ దూరంకానున్నారని తెలుస్తోంది. పూణే వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు గాయపడ్డారు. మోర్గాన్‌కు కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు మధ్య గాయం కావడంతో నాలుగు కుట్లు కూడా వేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. మరోవైపు బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో బిల్లింగ్స్ భుజం పైభాగం(కాలర్‌బోన్)కు గాయమైంది. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించాలని ఇంగ్లండ్ జట్టు మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఇదే జరిగితే రెండో వన్డేలో ఇంగ్లండ్ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆ జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. అసలే నిలకడలేమితో సతమతమవుతున్న ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలినట్లైంది. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఇదే వేదికగా శుక్రవారం(మార్చి 26) రెండో వన్డే జరుగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: టీమిండియాకు షాక్.. కీలక ఆటగాడు దూరం! -
'ద్రవిడ్ భయ్యా.. ఎవరీ కుర్రాడు కుమ్మేస్తున్నాడు'
అహ్మదాబాద్: టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం ట్రెండింగ్ లిస్టులో ఉన్నాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్ నుంచి భీకరఫామ్‌లో ఉన్న పంత్ ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ముఖ్యంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టెస్టులో తీవ్ర ఒత్తిడిలో అద్భుత సెంచరీతో( 101 పరుగులు) మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా ఇంగ్లండ్‌తో 5 టీ20ల సిరీస్‌కు సిద్ధమవుతున్న పంత్ మరో నెలరోజుల వ్యవధిలో ఐపీఎల్ 14వ సీజన్లో ఆడనున్నాడు. ఆరంభం నుంచి ఢిల్లీ డేర్‌డెవిల్స్( ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)కు ప్రాతినిధ్యం వహిస్తున్న రిషబ్ పంత్ 68 మ్యాచ్‌ల్లో 2వేల పరుగులు సాధించాడు. తాజాగా ఇంగ్లండ్ టీ20 స్టార్ సామ్ బిల్లింగ్స్ పంత్‌తో తనకు జరిగిన మొదటి పరిచయాన్ని ఈఎస్పీఎన్ ఇంటర్య్వూలో మరోసారి గుర్తుచేసుకున్నాడు.''నేను పంత్‌ను మొదటిసారి చూసింది 2016 ఐపీఎల్లో అనుకుంటా. ఇద్దరం కలిసి రెండేళ్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాము. అండర్ 19 ప్రపంచకప్‌లో రన్నరఫ్‌గా నిలిచిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న పంత్ అదే దూకుడుతో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఎంపికయ్యాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో మా బౌలర్లు నాథర్ కౌల్టర్‌నీల్, క్రిస్ మోరిస్, కగిసో రబడ ఇలా ఎవరు బౌలింగ్ వేసినా కుమ్మేస్తున్నాడు. దీంతో అప్పటి మెంటార్ రాహుల్ ద్రవిడ్‌వైపు తిరిగి.. ఎవరీ కుర్రాడు.. కుమ్మేస్తున్నాడు'' అని అడిగాను. అయితే ఇదే బిల్లింగ్స్ 2017లో ధోని స్థానాన్ని ఆక్రమించే అర్హత పంత్‌కు మాత్రమే ఉందని చెప్పడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. కాగా 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సామ్ బిల్లింగ్స్ ఇంగ్లండ్ తరపున 21 వన్డేల్లో 586 పరుగులు, 30 టీ20ల్లో 391 పరుగులు చేశాడు. టీ20 స్టార్‌గా మారిన బిల్లింగ్స్ కెరీర్లో 2020 సంవత్సరం చెప్పుకోదగ్గది. కరోనాతో మ్యాచ్‌లు జరగకపోయినా.. ఇటు ఇంగ్లండ్ తరపున.. ఆ తర్వాత బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ తరపున మెరుపులు మెరిపించాడు. తాజాగా ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రూ.2 కోట్లకు తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. కాగా ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరగనుంది. చదవండి: యువీని ఉతికారేసిన కెవిన్ పీటర్సన్.. పాంటింగ్ ట్వీట్‌కు పంత్ అదిరిపోయే రిప్లై -
టీ20 చరిత్రలో ఇంత ఘోర ఓటమా!
సెయింట్ లూసియా : దనాదన్ క్రికెట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌పై ఘోర ఓటమి చవిచూసింది. అసలు ఆడింది డిఫెండింగ్ చాంపియన్ విండీస్ జట్టేనా అని అనుమానం కలిగించేలా ఇంగ్లండ్‌పై అతి చెత్తగా ఆడారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో కరీబియన్ జట్టు 45 పరుగులకే కుప్పకూలింది. దీంతో 137 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసి ఇంగ్లండ్‌కు టీ20 సిరీస్‌ను అప్పగించింది. టీ20 చరిత్రలోనే ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. గతంలో పసికూన నెదర్లాండ్‌ను శ్రీలంక 39 పరుగులకే ఆలౌట్ చేసింది. అయితే టెస్టు జట్టు హోదాలేని నెదర్లాండ్ చేసిన చెత్త ప్రదర్శన కన్నా టీ20 డిఫెండింగ్ చాంపియన్ విండీస్ తాజా ప్రదర్శనే అతి ఘోరమైనదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు శుభారంభం అందలేదు. అయితే జోయ్ రూట్(55) బాధ్యాతయుతంగా ఆడాడు. చివర్లో బిల్లింగ్స్ (87; 47 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్కర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు ఘోరంగా తడబడింది. క్రిస్ జోర్డాన్(4/6), విల్లే(2/18), రషీద్(2/12), ప్లంకెట్(2/8)లు కరేబియన్ పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి హెట్మేర్(10), బ్రాత్‌వైట్(10)లు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. దీంతో 11.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటై విండీస్ ఘోర ఓటమి చవిచూసింది. ఫలితంగా ఇంగ్లండ్ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య జరిగిన తొటి టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
ఐపీఎల్: ఎంతటి లక్ష్యమైనా మా ముందు దిగదుడుపే!
చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్ తో (కేకేఆర్) జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సామ్ బిల్లింగ్స్ మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 23 బంతులలో 56 పరుగులు చేసిన అతను సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌కు అపూర్వ విజయం అందించాడు. దీంతో చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 200 పరుగులకుపైగా లక్ష్యాన్ని ఛేదించి.. కోల్‌కతాపై ఐదు వికెట్లతో తేడాతో చెన్నై గెలుపొందింది. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నైలో ఆడుతున్న తొలి మ్యాచ్ కావడం.. ఈ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించడం సీఎస్కే జట్టులో కొత్త ఉత్సాహం నింపింది. చెన్నైలోని లెజెండ్ ఆటగాళ్లతో ఆడటం ఎంతో సంతోషంగా ఉందని మ్యాచ్ అనంతరం సామ్ బిల్లింగ్స్ చెప్పాడు. తమ జట్టు మిడిలార్డర్లో ధోనీ, రైనా, జడ్డేజా వంటి బిగ్ హిట్లర్లు ఉన్నారని, ఎంతటి లక్ష్యమైనా తమ జట్టు ఛేదించగలదనే విషయం తమకు తెలుసునని ధీమా వ్యక్తం చేశాడు. ‘రైనా, ధోనీ, హర్భజన్ వంటి లెజెండ్స్‌తో ఆడటంతో ఎంతో సంతోషంగా ఉంది. కోచ్‌గా మైక్ హస్సీ కూడా ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారు. వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కొన్ని ఆప్షన్స్‌తో మేం మైదానంలోకి దిగాం. మూడు భిన్నమైన ప్రణాళికలు వేశాం. మొదట వచ్చిన బ్రేవో అందులో భాగంగానే ఆడాడు. రైనా, ధోనీ, జడ్డేజా వంటి బిగ్ హిట్టర్లు మిడిల్ ఆర్డర్లో ఉన్నారు. ఈ బ్యాటింగ్ టీమ్‌కు ఎంతటి లక్ష్యమైనా ఛేదించడం కష్టం కాదు’ అని బిల్లింగ్స్ చెప్పాడు. రెండేళ్ల తర్వాత చెప్పాక్‌లో విజయంతో పునరాగమనం చేయడం సంతోషంగా ఉందని ధోనీ హర్షం వ్యక్తం చేశాడు. ‘రెండేళ్ల తర్వాత విజయం పునరాగమనం చేయడం ఆనందంగా ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లోనూ, రెండో ఇన్సింగ్స్‌లో ప్రేక్షకులు మ్యాచ్‌ను ఆస్వాదించారు. ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలు ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకోవాలని ప్రతి ఒక్కరినీ మేం కోరుతున్నాం’ అని ధోనీ అన్నారు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసుకున్న వ్యక్తిగా నిలిచిన షేన్ వాట్సన్ మాట్లాడుతూ.. తమకు అండగా నిలిచిన చెన్నై ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పాడు. -
ఈ క్రెడిట్ అంతా ద్రావిడ్కే దక్కాలి!
ముంబై: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా-ఏపై ఇంగ్లండ్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బ్యాటింగ్ చేసిన స్యామ్ బిల్లింగ్స్ (85 బంతుల్లో 93; 8 ఫోర్లు) సెంచరీ చేజార్చుకున్నప్పటికీ కీలక ఇన్నింగ్స్ తో ఇంగ్లండ్ కు విజయాన్ని అందించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం బిల్లింగ్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. తన ఆటతీరుకు తమ మెంటర్ రాహుల్ ద్రవిడ్ కారణమని చెప్పాడు. గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ మెంటర్ గా ఉన్న ద్రవిడ్ తన బ్యాటింగ్ టెక్నిక్స్ ను మెరుగు పరిచారని తెలిపాడు. 'బ్యాటింగ్ లో ముఖ్యంగా ఫుట్ వర్క్ సమస్యను అధిగమించాను. గతంలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సమస్యలుండేవి. అయితే ద్రావిడ్ కోచింగ్ తో ఈ సమస్యలను అధిగమించాను. అశ్విన్, జడేజాలు ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లు' అని బిల్లింగ్స్ కితాబిచ్చాడు. మొత్తానికి ఈ క్రెడిట్ అంతా ద్రావిడ్ దేనని చెప్పిన ఇంగ్లండ్ ప్లేయర్.. ధోనీకి ఇండియాలోనే కాదు ప్రపంచమంతటా అభిమానులు ఉన్నారని వివరించాడు. -
తొలి టి20లో ఇంగ్లండ్ గెలుపు
దుబాయ్: పాకిస్తాన్‌తో జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ 14 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. బిల్లింగ్స్ (25 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మోర్గాన్ (45 నాటౌట్), విన్సీ (41) రాణించారు. పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటయింది. తన్వీర్ (25) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో టోప్లీ, ప్లంకెట్ మూడేసి వికెట్లు తీశారు.