ముంబై: ఏప్రిల్ 9నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు సమాయత్తమవుతున్నాయి. ఈసారి సీజన్‌లో ఆయా జట్లకు హోం అడ్వాంటేజ్ లేకపోవడంతో తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్ సీజన్ రన్నరఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్రాక్టీస్ కోసం ముంబైకు చేరింది.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్ కూడా టీమిండియాతో సిరీస్ ముగిసిన తర్వాత జట్టుతో కలిశాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైలోని తాజ్‌మహల్ ప్యాలెస్‌లో బస చేసింది. తాము ఉంటున్న హోటల్‌లో వైఫై సౌకర్యం అస్సలు బాలేదని నాకు సాయం చేయండి అంటూ బిల్లింగ్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న సీఎస్‌కేతో ఆడనుంది.
చదవండి: కోహ్లి లేకుండానే ఆర్‌సీబీ ప్రాక్టీస్
''హోటల్ రూంలో వైఫై సౌకర్యం అస్సలు బాలేదు.. ఇండియాలో వేగంగా ఉండే ఒక వైఫై డాంగిల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నా.. అందుకు మీరిచ్చే సూచనలు చాలా అవసరం.. సాయం చేయండి ప్లీజ్'' అంటూ కామెంట్ చేశాడు. బిల్లింగ్స్ అడిగిన దానిపై నెటిజన్లు స్పందించారు. ఇండియాలో ఉన్న వైఫై సౌకర్యం కల్పిస్తున్న కంపెనీలతో పాటు వాటి ధరలను బిల్లింగ్స్‌కు షేర్ చేశారు. వాటిలో జియో, ఎయిర్‌టెల్ అత్యధిక సార్లు రిపీట్ అయ్యాయి.
దీంతో జియో లేదా ఎయిర్‌టెల్‌లో ఏది బాగుంటుందని బిల్లింగ్స్ మరోసారి అడగ్గా ఎక్కువమంది జియోకు ఓటు వేశారు. ''దీంతో తాను జియో డాంగిల్‌ను కొంటున్నా.. నాకు స్పందించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా'' అంటూ తెలిపాడు. కాగా టీమిండియాతో జరిగిన సిరీస్‌లో బిల్లింగ్స్ కేవలం ఒక వన్డే మ్యాచ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు.
చదవండి:
IPL 2021: మరోసారి ఫేవరెట్‌గా సీఎస్‌కే
Hotel WiFi is non existent..... 🤣
— Sam Billings (@sambillings) March 30, 2021
Best WiFi dongle to buy and use in India please? pic.twitter.com/xWhfnUBpoM
Comments
Please login to add a commentAdd a comment