WiFi service
-
'వైఫై అస్సలు బాలేదు.. సాయం చేయండి'
ముంబై: ఏప్రిల్ 9నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు సమాయత్తమవుతున్నాయి. ఈసారి సీజన్లో ఆయా జట్లకు హోం అడ్వాంటేజ్ లేకపోవడంతో తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్ సీజన్ రన్నరఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్రాక్టీస్ కోసం ముంబైకు చేరింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్ కూడా టీమిండియాతో సిరీస్ ముగిసిన తర్వాత జట్టుతో కలిశాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైలోని తాజ్‌మహల్ ప్యాలెస్‌లో బస చేసింది. తాము ఉంటున్న హోటల్లో వైఫై సౌకర్యం అస్సలు బాలేదని నాకు సాయం చేయండి అంటూ బిల్లింగ్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న సీఎస్కేతో ఆడనుంది. చదవండి: కోహ్లి లేకుండానే ఆర్సీబీ ప్రాక్టీస్ ''హోటల్ రూంలో వైఫై సౌకర్యం అస్సలు బాలేదు.. ఇండియాలో వేగంగా ఉండే ఒక వైఫై డాంగిల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నా.. అందుకు మీరిచ్చే సూచనలు చాలా అవసరం.. సాయం చేయండి ప్లీజ్'' అంటూ కామెంట్ చేశాడు. బిల్లింగ్స్ అడిగిన దానిపై నెటిజన్లు స్పందించారు. ఇండియాలో ఉన్న వైఫై సౌకర్యం కల్పిస్తున్న కంపెనీలతో పాటు వాటి ధరలను బిల్లింగ్స్‌కు షేర్ చేశారు. వాటిలో జియో, ఎయిర్టెల్ అత్యధిక సార్లు రిపీట్ అయ్యాయి. దీంతో జియో లేదా ఎయిర్‌టెల్‌లో ఏది బాగుంటుందని బిల్లింగ్స్ మరోసారి అడగ్గా ఎక్కువమంది జియోకు ఓటు వేశారు. ''దీంతో తాను జియో డాంగిల్‌ను కొంటున్నా.. నాకు స్పందించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా'' అంటూ తెలిపాడు. కాగా టీమిండియాతో జరిగిన సిరీస్‌లో బిల్లింగ్స్ కేవలం ఒక వన్డే మ్యాచ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. చదవండి: IPL 2021: మరోసారి ఫేవరెట్‌గా సీఎస్కే Hotel WiFi is non existent..... 🤣 Best WiFi dongle to buy and use in India please? pic.twitter.com/xWhfnUBpoM — Sam Billings (@sambillings) March 30, 2021 -
రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫైకి ఇక గుడ్‌బై..!
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సర్వీసుపై గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో అందిసున్న ఉచిత వైఫైను గూగుల్ ఎత్తివేస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ విషయంపై గూగుల్ ఉపాధ్యక్షుడు సీజర్ గుప్తా స్పందిస్తూ.. ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ సేవలు చాలా చవకగా మారిపోయాయి. అందువల్లనే భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లోనూ ఉచిత వైఫై సేవలను ఎత్తివేయనున్నాం. ఐదేళ్ల క్రితం గూగుల్ స్టేషన్లు ప్రారంభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు డేటా వాడకం సులభతరంగా, చవకగా మారింది. మొబైల్ డేటా ప్లాన్లు చాలా తక్కువ రేట్లకు అందుబాటులోకి వచ్చాయి. 2015లో భారతీయ రైల్వే, రైల్ టెల్ భాగస్వామ్యంతో గూగుల్ వేగవంతమైన, ఉచిత పబ్లిక్ వైఫై సేవలను ఆరంభించింది. 2020 నాటికి 400కు పైగా రైల్వే స్టేషన్లలో అమర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా.. జూన్ 2018 నాటికే ఆ లక్ష్యాన్ని అధిగమించినట్టు సీజర్ చెప్పారు. మొబైల్ కనెక్టివిటీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు భారత్‌లో మొబైల్ డేటా లభ్యమవుతోంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మొబైల్ డేటా ధర 95 శాతం తగ్గింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశంలోని వినియోగదారులు నెలకు సగటున 10 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే గూగుల్ రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సర్వీసు ఎత్తివేత నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. -
జియో కస్టమర్లకు శుభవార్త
ముంబయి : రిలయన్స్ జియో కస్టమర్లకు మరో శుభవార్త. వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రిలయన్స్ జియో బుధవారం ప్రకటించింది. దీనికి అధనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. భారతదేశంలో ఉన్న ఏ వైఫై నెట్‌వర్క్‌లో అయినా ఈ సర్వీస్ పనిచేయనుంది. ప్రసుత్తం 150 రకాల స్మార్ట్ ఫోన్లలో వైఫై ద్వారా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. వైఫై కాలింగ్ సౌలభ్యం దేశ వ్యాప్తంగా జనవరి 7 నుంచి 16 మధ్యలో అందుబాటులోకి రానుంది. అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకునేందుకు jio.com వెబ్సైట్లో చూసుకోవచ్చు. జియో వైఫై కాలింగ్ ఉపయోగించాలంటే స్మార్ట్ఫోన్లలో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంతకు ముందు భారతీ ఎయిర్టెల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ' ఎయిర్టెల్ వైఫై కాలింగ్' పేరుతో సదుపాయాన్ని కల్పించింది. తాజాగా జియో మాత్రం ఉచిత వైఫై కాలింగ్ సదుపాయాన్ని పాన్ ఇండిలో కల్పించనుంది. -
గ్రామీణ రైల్వేస్టేషన్లలోనూ హైస్పీడ్ వైఫై
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గ్రామీణ రైల్వేస్టేషన్లలోనూ హైస్పీడ్ వైఫై వ్యవస్థ ఏర్పాటవుతోంది. ఏ1, ఏ, బీ తరహా పెద్ద రైల్వేస్టేషన్లలో ఇప్పటికే గూగుల్ సహాయంతో హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా రైల్వే అనుబంధ సంస్థ రైల్‌టెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే 45 గ్రామీణ స్టేషన్లలో హైస్పీడ్ వైఫై వ్యవస్థ ఏర్పాటు పూర్తయింది. సాధారణంగా ఇలాంటి వైఫైలను తొలి అరగంటో, గంటనో ఉచితంగా అందజేసి.. తర్వాత చార్జీ వసూలు చేసే పద్ధతి అమల్లో ఉంది. కానీ గ్రామీణ స్టేషన్లలో రైల్‌టెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వైఫైని మాత్రం పూర్తి ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రతి గంటకోసారి లాగిన్ అవుతూ వినియోగించుకోవచ్చని పేర్కొంటున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా.. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియాపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలను అందులో భాగస్వామ్యం చేసిన నేపథ్యంలో రైల్వే శాఖ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆ శాఖ మంత్రి పీయూష్‌గోయల్ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) పేరుతే ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారు. దాని కింద ఉచిత వైఫైని అందుబాటులోకి తేవాలని.. తొలుత ఏ1, ఏ, బీ కేటగిరీ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏ1 స్టేషన్లుగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, తిరుపతిలలో.. ఏ కేటగిరీలో 31 స్టేషన్లలో గూగుల్ సంస్థ సహాయంతో ఉచిత వైఫై ఏర్పాటు చేశారు. ఇక బీ కేటగిరీలో 38 స్టేషన్లు ఉండగా.. ప్రస్తుతానికి కామారెడ్డి, నిడదవోలు స్టేషన్లలో ఏర్పాటు చేశారు. ఏడాది చివరినాటికి మిగతా చోట్ల కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో గ్రామీణ స్టేషన్లపై దృష్టి సారించారు. రైల్‌టెల్ కార్పొరేషన్ ఇందుకు అవసరమైన సాంకేతికతను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. సాంకేతిక ఏర్పాట్లు పూర్తయిన కొద్దీ ఆయా స్టేషన్లలో ఉచిత వైఫై అందుబాటులోకి తెస్తున్నారు. ఇలా ఇప్పటివరకు ఏడు డీ కేటగిరీ స్టేషన్లు, 35 ఈ కేటగిరీ స్టేషన్లు, మూడు ఎఫ్ కేటగిరీ స్టేషన్లలో ఉచిత వైఫై అందుబాటులోకి వచ్చింది. ఇందులో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో 2, హైదరాబాద్ డివిజన్ పరిధిలో 19, విజయవాడ డివిజన్ పరిధిలో 20, గుంటూరు డివిజన్ పరిధిలో 4 స్టేషన్లు ఉన్నాయి. -
సొంతంగా 50 హాట్‌స్పాట్స్
రాజధానిలోఏర్పాటుకు బీఎస్ఎన్ఎల్ కసరత్తు పూర్తయిన టెండర్ల ప్రక్రియ... సాక్షి, హైదరాబాద్: రాజధానిలో ప్రయివేటు టెలికం సంస్థలకు దీటుగా వినియోగ దారులకు విస్తృత సేవలందించేందుకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నగరంలో సొంతంగా 50 వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తిచేసి ఎల్ఎండ్టీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. హాట్‌స్పాట్ కేంద్రాలకు అనుసంధానంగా మరో 300 పాయింట్లను ఏర్పాటు చేయనుంది. ఒక్కో పాయింట్ 70 మీటర్ల పరిధి వరకు కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించింది. వీటి ద్వారా వినియోగదారులు 2 నుంచి 10 ఎంబీపీఎస్ స్పీడుతో డేటా డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది. అయితే... ప్లాన్ చార్జీలు ఇంకా ఖరారు కాలేదు. మార్చిలో హాట్స్పాట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని బీఎస్ఎన్ఎల్ హైదరాబాద్ పీజీఎం రామచంద్ర తెలిపారు. ఇప్పటికే క్వాడ్జన్ సంస్థతో కలసి ఏర్పాటు చేసిన 45 హాట్‌స్పాట్స్‌తో ఉచిత వైఫై సేవలను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. వీటి ద్వారా రోజుకు 80 నుంచి 100 జీబీ డేటా వినియోగమవుతోంది. ఈ ఉచిత వైఫై సేవలను ప్రస్తుతం 15 నిమిషాలకే పరిమితం చేసింది. మూడు రకాలుగా... మహానగరంలో మూడు రకాలుగా హాట్స్పాట్లను ఏర్పాటు చేసేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రణాళిక రూపొందించింది. ఆయా ప్రాంతాల్లోని సౌలభ్యం మేరకు స్మాల్, మీడియం, లార్జ్ హాట్స్పాట్లు నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో హాట్‌స్పాట్‌కు ఐదు వైఫై టవర్లు... ఒక్కో టవర్ ఐదు నుంచి పది కిలోమీటర్ల పరిధి మేర సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వైఫై సేవల వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలతో బీఎస్ఎన్ఎల్ ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. సర్వీస్ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా ఆయా సంస్థల నుంచి వసూలు చేస్తోంది.