
Sam Billings Engaged With Long Term Girl Friend.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ తన చిన్ననాటి స్నేహితురాలితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. టెన్నిస్ ప్లేయర్ అయిన సారా కాంట్లేతో లాంగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న సామ్ బిల్లింగ్స్ శనివారం ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా బిల్లింగ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఈరోజు ప్రపంచంలో లక్కీ పర్సన్ నేనే.. మిస్టర్ బి టూ అంటూ క్యాప్షన్ జత చేశాడు.
కాగా టెన్నిస్ ప్లేయర్‌గా ఎన్నో ట్రోఫీలు గెలుచుకున్న కాంట్లే సైకాలజీలో మేజర్ డిగ్రీని పూర్తి చేసింది. ఇక 2015లో ఇంగ్లండ్ క్రికెట్లో అరంగేట్రం చేసిన సామ్ బిల్లింగ్స్ 25 వన్డేల్లో 607 పరుగులు.. 33 టి20ల్లో 417 పరుగులు చేశాడు. ఈ ఆరేళ్లలో రొటేషన్ పద్దతిలో ఇన్ అవుట్‌గా ఉన్నప్పటికి ఏనాడు జాతీయ జట్టుకు దూరమైన దాఖలాలు కనిపించలేదు. ఇటీవలే టి20 ప్రపంచకప్ 2021లోనూ సామ్ బిల్లింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఇక టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ సూపర్ 12లో మంచి విజయాలు సాధించినప్పటికి.. సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.
చదవండి: Mitchell McClenaghan: 72 గంటలు కాలేదు.. భారత్- న్యూజిలాండ్ సిరీస్ 'మీనింగ్‌లెస్'