![WPl 2023: Sophia Dunkley Smashes Fastest WPL Fifty Off-18 Balls - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/8/sophia.jpg.webp?itok=Haazkg7m)
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా తొలి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదైంది. గుజరాత్ జెయింట్స్ బ్యాటర్.. ఇంగ్లండ్ ప్లేయర్ సోఫియా డంక్లీ 18 బంతుల్లోనే అర్థశతకం మార్క్‌ను అందుకుంది. బుధవారం ఆర్‌సీబీతో మ్యాచ్‌లో డంక్లీ ఈ ఫీట్ అందుకుంది. తద్వారా డబ్ల్యూపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా డంక్లీ రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా 28 బంతుల్లోనే 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో 65 పరుగులతో విధ్వంసం సృష్టించింది.
ముఖ్యంగా రేణుకా ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టిన డంక్లీ.. ప్రీతిబోస్ వేసిన ఐదో ఓవర్లో విశ్వరూపం చూపించింది. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు పిండుకొని అర్థసెంచరీ మార్క్‌ను అందుకుంది. ఇక మహిళల టి20 క్రికెట్‌లో అత్యంత వేగంగా ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్న నాలుగో క్రికెటర్‌గా నిలిచింది. ఇక సోఫియా డంక్లీ ఇంగ్లండ్ తరపున 44 టి20ల్లో 652 పరుగులు, 28 మ్యాచ్‌ల్లో 746 పరుగులు, మూడు టెస్టుల్లో 152 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment