ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ టోర్నమెంట్‌లో బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. 100 బంతుల్లో ముగిసే మ్యాచ్ కావడంతో అభిమానులు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాటర్లు కొట్టే సిక్సర్లు, బౌండరీలతో మైదానాలు చిన్నవిగా మారిపోయాయా. తాజాగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్.. ట్రెంట్ రాకెట్స్ బ్యాటర్ డేవిడ్ మలాన్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఆగిపోయినప్పటికి.. ఆఖరివరకు నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 44 బంతుల్లో 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన మలాన్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండడం విశేషం. మలాన్ దెబ్బకు 94 బంతుల్లోనే లక్ష్యం కరిగిపోయింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సాల్ట్ 46 బంతుల్లో 70 నాటౌట్, జాస్ బట్లర్ 41 పరుగులు రాణించగా.. చివర్లో స్టబ్స్ 10 బంతుల్లో 4 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. అనంతరం ట్రెంట్ రాకెట్స్ 94 బంతుల్లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
చదవండి: Hundred Tourney: సిక్సర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించిన ప్రొటిస్ బ్యాటర్
Comments
Please login to add a commentAdd a comment