Tristan Stubbs Smashed 4 Consecutive Sixes Against Tabraiz Shamsi In The Hundred - Sakshi
Sakshi News home page

Hundred Tourney: సిక్సర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించిన ప్రొటిస్‌ బ్యాటర్‌

Published Sun, Aug 14 2022 11:35 AM | Last Updated on Sun, Aug 14 2022 1:07 PM

Tristan Stubbs Smashes Tabraiz Shamsi 4-Straight Sixes Hundred Tourney - Sakshi

సౌతాఫ్రికా యువ ఆటగాడు ట్రిస్టన్‌ స్టబ్స్‌ హండ్రెడ్‌ టోర్నమెంట్‌లో భాగంగా ట్రెంట్‌ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులో ఉన్నది కాసేపే అయినా వరుస సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అతని ఇన్నింగ్స్‌ ధాటికి మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ భారీ స్కోరు సాధించింది. మాంచెస్టర్‌ ఇన్నింగ్స్‌లో 76 బంతుల వరకు ఒక్క సిక్సర్‌ కూడా రాలేదు. ఈ దశలో స్టబ్స్‌ తబ్రెయిజ్‌ షంసీ బౌలింగ్‌లో వరుసగా నాలుగు బంతులను సిక్సర్లు బాదాడు. అలా 10 బంతుల్లో 27 పరుగుల చేసి ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సాల్ట్‌ 46 బంతుల్లో 70 నాటౌట్‌, జాస్‌ బట్లర్‌ 41 పరుగులు రాణించగా.. చివర్లో స్టబ్స్‌ 10 బంతుల్లో 4 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ట్రెంట్‌ రాకెట్స్‌ 94 బంతుల్లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. డేవిడ్‌ మలాన్‌(44 బంతుల్లో 98 నాటౌట్‌, 3 ఫోర్లు, 9 సిక్సర్లు) దాటిగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా.. అలెక్స్‌ హేల్స్‌ 38, టామ్‌ కోహ్లెర్‌ 30 పరుగులు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement