
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసిన డెవాల్డ్ బ్రెవిస్ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అండర్-19 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా తరపున టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన బ్రెవిస్‌ను జూనియర్ ఏబీగా అభివర్ణిస్తున్నారు.కేకేఆర్‌తో మ్యాచ్‌లో బ్రెవిస్ చేసింది 29 పరుగులే అయినప్పటికి అతని ఇన్నింగ్స్‌లో చూడచక్కని రెండు బౌండరీలు.. రెండు సిక్సర్లు ఉన్నాయి.
అయితే అనుభవంలేమి జూనియర్ ఏబీ కొంపముంచింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో తొలి బంతికే డీప్ మిడ్‌వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. ఆ తర్వాతి మూడు బంతులు పరుగులు రాలేదు. ఓవర్ ఐదో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చేశాడు. ఇది గమనించిన సామ్ బిల్లింగ్స్ వేగంగా వికెట్లను గిరాటేశాడు. అయితే రిప్లేలో బ్రెవిస్ కనీసం క్రీజులోకి వచ్చే ప్రయత్నం చేయలేదు.
Courtesy: IPL Twitter
తొలి మ్యాచ్ ఆడుతున్నానన్న టెన్షన్ అతనిలో స్పష్టంగా కనిపించింది. తాను క్రీజులోనే ఉన్నానని భ్రమించినట్టున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో బ్రెవిస్ చేసేదేం లేక నిరాశగా పెవిలియన్‌వైపు నడిచాడు. ఉన్నది కాసేపే అయినా మంచి ఇన్నింగ్స్ ఆడిన బ్రెవిస్‌ను పాట్ కమిన్స్ సహా ఇతర ఆటగాళ్లు అభినందించడం విశేషం.