ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 ఎడిషన్ ప్రారంభానికి ముందు టు టైమ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు హార్డ్ హిట్టర్, వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ సామ్ బిల్లింగ్స్ (ఇంగ్లండ్).. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇవాళ (నవంబర్ 14) ప్రకటన చేశాడు. ఇంగ్లీష్ సమ్మర్‌లో (కెంట్) సుదీర్ఘ ఫార్మాట్‌పై ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిల్లింగ్స్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు.
Have taken the tough decision that I won’t be taking part in the next IPL @KKRiders
— Sam Billings (@sambillings) November 14, 2022
Looking to focus on longer format cricket at the start of the English summer with @kentcricket pic.twitter.com/7yeqcf9yi8
31 ఏళ్ల బిల్లింగ్స్‌ను 2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 2 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. గత సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన అతను.. 122.46 స్ట్రయిక్ రేట్‌తో 24.14 సగటున 169 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యుత్తమ స్కోర్ 36గా ఉంది.
ఇదిలా ఉంటే, సీజన్ 2023 ట్రేడింగ్‌లో భాగంగా కేకేఆర్ జట్టు.. రహ్మానుల్లా గుర్భాజ్ (ఆఫ్ఘనిస్తాన్), లోకీ ఫెర్గూసన్ (న్యూజిలాండ్)లను డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ నుంచి, అలాగే శార్దూల్ ఠాకూర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తెచ్చుకుంది. జట్టును వీడిన సామ్ బిల్లింగ్స్ స్థానాన్ని ఆఫ్ఘన్ వికెట్‌కీపర్ గుర్భాజ్ భర్తీ చేయనున్నాడు.
కాగా, కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితా పాటు వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ నవంబర్ 15ను డెడ్‌లైన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ముంబై, చెన్నై జట్లు మాత్రమే తమ రిలీజ్డ్, రీటెయిన్డ్ ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐకి సమర్పించినట్లు తెలుస్తోంది.
చదవండి: స్టార్ ఆల్‌రౌండర్‌ను వదులుకున్న ముంబై, జడేజాను అట్టిపెట్టుకున్న చెన్నై..!
Comments
Please login to add a commentAdd a comment