ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కర్రన్, టామ్ కర్రన్‌ల సోదరుడు బెన్ కర్రన్ జింబాబ్వే జాతయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జింబాబ్వే వన్డే జట్టులో బెన్ చోటు దక్కించుకున్నాడు. 28 ఏళ్ల బెన్ జింబాబ్వే మాజీ ఆటగాడు, ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ కెవిన్ కర్రన్ తనయుడు.
కెవిన్‌కు ముగ్గురు కుమారులు. వీరిలో సామ్, టామ్ కర్రన్‌లు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించగా.. తాజాగా బెన్ జింబాబ్వే జట్టులో చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వే దేశవాలీ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చడం ద్వారా బెన్ జాతీయ జట్టు నుంచి తొలిసారి పిలుపునందుకున్నాడు. బెన్ ఎడమ చేతి వాటం బ్యాటర్.
కాగా, స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే టీ20, వన్డే సిరీస్‌ల కోసం వేర్వేరు జింబాబ్వే జట్లను ఇవాళ (డిసెంబర్ 9) ప్రకటించారు. టీ20 జట్టుకు సికందర్ రజా, వన్డే జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
బెన్ కర్రన్ కేవలం వన్డే జట్టులో మాత్రమే చోటు దక్కించుకున్నాడు. బెన్‌తో పాటు న్యూమ్యాన్ న్యామ్హురి కూడా తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. న్యూమ్యాన్ వన్డేతో పాటు టీ20 జట్టుకు ఎంపికయ్యాడు.
ఆఫ్ఘనిస్తాన్ పర్యటన తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో మొదలవుతుంది. డిసెంబర్ 11, 13, 14 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ రెండు టెస్ట్ మ్యాచ్‌లు కూడా ఆడనుంది. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి.. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి మొదలవుతాయి. జింబాబ్వే టెస్ట్ జట్టును ప్రకటించాల్సి ఉంది.
టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, టకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా డి ముసెకివాని, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, న్యూమ్యాన్ న్యామ్హురి
వన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రన్, జాయ్‌లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, న్యూమ్యాన్ న్యామ్హురి, విక్టర్ న్యూయుచి, సికందర్ రజా, సీన్ విలియమ్స్
Comments
Please login to add a commentAdd a comment