హండ్రెడ్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఆటగాడు సామ్ కర్రన్ అద్భుత ఫామ్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో బ్యాట్‌తో, బంతితో చెలరేగిపోతున్న సామ్.. తాజాగా మరోసారి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్.. తొలుత బంతితో (20-7-28-2), ఆతర్వాత బ్యాట్‌తో (18 బంతుల్లో 35; 5 సిక్సర్లు) చెలరేగి తన జట్టును గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో సామ్ సోదరుడు టామ్ కూడా రాణించాడు. టామ్ నాలుగు వికెట్లు తీసి సథరన్ బ్రేవ్ పతనాన్ని శాశించాడు. సామ్, టామ్ బంతిలో సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రేవ్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ విన్స్ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, సిక్స్) ఒక్కడే రాణించాడు.
అలెక్స్ డేవిస్ (5), ఆండ్రీ ఫ్లెచర్ (1), లూస్ డి ప్లూయ్ (4), లారీ ఈవాన్స్ (4), కీరన్ పోలార్డ్ (18), జోఫ్రా ఆర్చర్ (10), అకీల్ హొసేన్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో సామ్, టామ్‌తో పాటు విల్ జాక్స్, ఆడమ్ జంపా తలో వికెట్ తీశారు.
119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్.. సామ్ కర్రన్, జోర్డన్ కాక్స్ (29 బంతుల్లో 46 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) రాణించడంతో 85 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్విన్సిబుల్స్ ఇన్నింగ్స్‌లో విల్ జాక్స్ 6, డేవిడ్ మలాన్ 14, సామ్ బిల్లింగ్స్ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బ్రేవ్ బౌలర్లలో క్రెయిగ్ ఓవర్టన్, టైమాల్ మిల్స్, క్రిస్ జోర్డన్, అకీల్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment