Sam Curran Ruled Out T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021 ఆరంభానికి ముందు ఇంగ్లండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. వెన్నునొప్పి కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ ఇంగ్లండ్ టి20 ప్రపంచకప్ జట్టు నుంచి వైదొలిగాడు. సామ్ కరన్ స్థానంలో అతని సోదరుడు టామ్ కరన్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది. కాగా రీస్ టోప్లేను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికచేసినట్లు తెలిపింది. ఇప్పటికే బెన్ స్టోక్స్ రూపంలో సేవలు కోల్పోయిన ఇంగ్లండ్ తాజాగా సామ్ కరన్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్‌ను కోల్పోవడం పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇక సామ్ కరన్ ఇంగ్లండ్ తరపున 24 టెస్టుల్లో 815 పరుగులు.. 47 వికెట్లు, 11 వన్డేల్లో 141 పరుగులు.. 12 వికెట్లు, 16 టి20ల్లో 91 పరుగులు.. 16 వికెట్లు తీశాడు.
చదవండి: T20 World Cup: కోహ్లి సేనకు అంత సీన్ లేదు.. మాకు అసలు పోటీనే కాదు
ప్రస్తుతం ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున ఆడుతున్న సామ్ కరన్ శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెన్నునొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ అనంతరం సామ్ కరన్‌ను పరీక్షల కోసం స్కానింగ్‌కు పంపించారు. తాజాగా వెల్లడించిన రిపోర్ట్స్‌లో సామ్‌కు గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఈసీబీ తెలిపింది. ఈ మేరకు మరో రెండురోజుల్లో యూకేకు చేరుకోనున్న సామ్ కరన్‌ను తదుపరి మెడికల్ పరీక్షలకు పంపనున్నట్లు వెల్లడించింది.
ఇంగ్లండ్ టి20 ప్రపంచకప్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్,టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్
రిజర్వ్ ఆటగాళ్లు: లియామ్ డాసన్, రీస్ టోప్లే, జేమ్స్ విన్స్
Comments
Please login to add a commentAdd a comment