క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. గ్లెన్ ఫిలిప్స్ 58 పరుగుల అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
బ్రూక్ భారీ శతకం
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ భారీ సెంచరీతో (171) కదం తొక్కాడు. ఓలీ పోప్ (77), బెన్ స్టోక్స్ (80) అర్ద శతకాలతో రాణించారు. బెన్ డకెట్ (46), గస్ అట్కిన్సన్ (48), బ్రైడన్ కార్స్ (33 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నాథన్ స్మిత్ మూడు, టిమ్ సౌథీ రెండు, విలియమ్ ఓరూర్కీ ఓ వికెట్ దక్కించుకున్నారు.
నిప్పులు చెరిగిన బ్రైడన్ కార్స్
తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్‌కు దెబ్బకొట్టిన బ్రైడన్ కార్స్ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్‌లో కార్స్ 6 వికెట్లు పడగొట్టాడు. కార్స్‌తో పాటు క్రిస్ వోక్స్ (3/59), అట్కిన్సన్ (1/57) కూడా చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 254 పరుగులకు చాపచుట్టేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ (61), డారిల్ మిచెల్ (84) అర్ద సెంచరీలతో రాణించారు.
ఆడుతూపాడుతూ విజయతీరాలకు..!
104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 12.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. అరంగేట్రం ఆటగాడు జాకబ్ బేతెల్ 37 బంతుల్లో 50 పరుగులు.. జో రూట్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. బెన్ డకెట్ 27, జాక్ క్రాలే ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు.
మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు తీసిన బ్రైడన్ కార్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment