
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇంగ్లండ్ క్రికెట్ టోర్నీ 'ది హండ్రెడ్’ లీగ్‌లో ఆడనున్నాడు. ది హండ్రెడ్ 2025 సీజన్ కోసం వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీ స్మిత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మార్చి 12న జరగనున్న ది హండ్రెడ్ డ్రాఫ్ట్‌కు ముందుకు అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లను ఖారారు చేసే పనిలో పడ్డాయి. రూల్స్ ప్రకారం.. గత సీజన్‌లో తమతో ఉన్న 10 మంది సభ్యులను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవచ్చు.
ఈ లిస్ట్‌లో కచ్చితంగా ఒక ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ తప్పక ఉండాలి. అలాగే ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్లు ఉండవచ్చు. అదనంగా ఓ విదేశీ ఆటగాడిని డైరెక్ట్ సైనింగ్ చేసుకోవచ్చు. ఈ పద్దతిలోనే స్మిత్‌ను తమ జట్టులోకి వెల్ష్ పైర్ తీసుకుంది. ఈ విషయాన్ని వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. అదేవిధంగా వెల్ష్ ఫైర్‌తో ఒప్పందంపై స్మిత్ కూడా స్పందించాడు.
"వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీలో చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఏడాది వేసవి తర్వాత నేను ది హండ్రెడ్‌లో భాగం కానున్నాను. తొలిసారి ఈ టోర్నీలో ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఎటువంటి ఫార్మాట్‌లో ఆడడం మనకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది. వరల్డ్ క్లాస్ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడుతున్నారు.
మైక్ హస్సీతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాను. వెల్ష్ ఫైర్ కోసం 100 శాతం ఎఫక్ట్ పెట్టేందుకు ప్రయత్నిస్తాను" స్మిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా ఈ ఫ్రాంచైజీ హెడ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మైక్ హస్సీ వ్యవహరిస్తున్నాడు. ఈ వంద బంతుల టోర్నీ ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానుంది.
ది హండ్రెడ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు..!
కాగా ఈ 'ది హండ్రెడ్’ లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు సైతం భారీ మొత్తం ఇన్వెస్ట్ చేశాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్,సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాలు దాదాపు రూ.3,257 కోట్లను పెట్టుబడులుగా పెట్టాయి. ఢిల్లీ క్యాపిటల్స్ – సదరన్ బ్రేవ్, లక్నో సూపర్ జెయింట్స్ – మాంచెస్టర్ ఒరిజినల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ – నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్లలో వాటాలు కొనుగోలు చేశాయి.
చదవండి: 'ఇంత చెత్తగా ఆడుతారని ఊహించలేదు.. నన్ను క్షమించండి'
Comments
Please login to add a commentAdd a comment