సాయి సుద‌ర్శ‌న్ సంచ‌ల‌నం.. సిక్స్‌తో సెంచ‌రీ! వీడియో | Sai Sudharshan Gets to His Maiden County Championship Hundred with a Cracking Six | Sakshi
Sakshi News home page

సాయి సుద‌ర్శ‌న్ సంచ‌ల‌నం.. సిక్స్‌తో సెంచ‌రీ! వీడియో

Published Sat, Aug 31 2024 3:45 PM | Last Updated on Sat, Aug 31 2024 5:14 PM

Sai Sudharshan Gets to His Maiden County Championship Hundred with a Cracking Six

టీమిండియా యువ సంచ‌ల‌నం సాయిసుద‌ర్శ‌న్ ఇంగ్లండ్ కౌంటీల్లో తొలి సెంచ‌రీని న‌మోదు చేశాడు. కౌంటీ ఛాంపియ‌న్ షిప్-2024లో స‌ర్రే క్రికెట్ క్ల‌బ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ట్రెంట్‌బ్రిడ్జ్ వేదిక‌గా నాటింగ్‌హామ్‌షైర్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సాయిసుద‌ర్శ‌న్ అద్బుతమైన‌ సెంచ‌రీతో చెల‌రేగాడు.

సిక్స్‌తో త‌న తొలి కౌంటీ సెంచ‌రీ మార్క్‌ను ఈ త‌మిళ‌నాడు బ్యాట‌ర్ అందుకున్నాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన సుద‌ర్శ‌న్‌.. తొలి ఇన్నింగ్స్‌లో స‌ర్రే 525 ప‌రుగుల భారీ స్కోర్ చేయ‌డంలో కీలక పాత్ర పోషించాడు. ఓవ‌రాల్‌గా 178 బంతులు ఎదుర్కొన్న సుద‌ర్శ‌న్‌.. 10 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 105 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. 

అత‌డితో పాటు కెప్టెన్ రోరీ బ‌ర్న్స్‌(161) కూడా సెంచ‌రీతో రాణించాడు. కాగా కౌంటీల్లో సుద‌ర్శ‌న్ ఆడ‌టం ఇదే రెండో సారి. గ‌తేడాది కౌంటీ ఛాంపియ‌న్ షిప్‌లో ఆఖ‌రి మూడు మ్యాచ్‌ల్లో స‌ర్రే త‌ర‌పున ఆడాడు.

అయితే ఈ ఏడాది సీజన్ మొత్తానికి అత‌డు అందుబాటులో ఉండ‌డం లేదు. సెప్టెంబ‌ర్ 5న ప్రారంభం కానున్న‌ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు అత‌డు తిరిగి స్వ‌దేశానికి రానున్నాడు.భార‌త యువ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించే సి టీమ్‌లో సాయికి చోటు దక్కింది. అయితే ఇప్పటికే వన్డేల్లో అరంగేట్రం చేసిన సుదర్శన్‌.. దులీప్‌ ట్రోఫీలో రాణిస్తే టెస్టుల్లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.
చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన స‌ఫారీ క్రికెట‌ర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement