
భారత్‌లో ఫేస్‌బుక్ వినియోగదారులు@12.5 కోట్లు
న్యూఢిల్లీ: భారత్‌లో ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య 12.5 కోట్లకు చేరింది. దీంతో ఫేస్‌బుక్ వినియోగదారులు అధికంగా ఉన్న రెండో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. గత ఆరు నెలల్లో ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య 1.3 కోట్లు పెరిగింది. ఈ పెరుగుదలకు ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉన్న 2జీ వంటి వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘ఫేస్‌బుక్ లైట్’ ఒక కారణం.
గతేడాది డిసెంబర్ నెలలో ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య 11.2 కోట్లుగా ఉంది. అంతర్జాతీయంగా ప్రతినెల ఫేస్‌బుక్‌ను చురుకుగా వినియోగించే వారు 144 కోట్ల మంది ఉన్నారు. భారత్‌లో ప్రతిరోజు ఫేస్‌బుక్‌ను ఉపయోగించేవారు 5.9 కోట్ల మంది ఉన్నారు. మొబైల్ ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య 5.3 కోట్లుగా ఉంది.