ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో అదిరిపోయే టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. హారిజోన్ వర్క్ రూమ్ అని పిలిచే ఈ వర్చువల్ రియాలిటీ యాప్ ఎలా పనిచేస్తుందనే అంశంపై కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
భవిష్యత్ 'మెటావర్స్' : మార్క్ జుకర్‌బర్గ్
ఇటీవల ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ మాట్లాడుతూ.. తాము డెవలప్ చేస్తున్న హారిజోన్ వర్క్ రూమ్ యాప్ ఫ్యూచర్ 'మెటావర్స్' అని కామెంట్ చేశారు. మెటావర్స్ అంటే వర్చువల్ రియాలిటీ స్పేస్. ఇది కంప్యూటర్ జనరేటెడ్ ఎన్విరాన్ మెంట్‌ను క్రియేట్ చేస్తుంది. మీరు ఎక్కడో ఉన్నా ఒకే రూమ్‌లో ఎదురెదుగా ఉన్నారనే ఫీలింగ్‌ను కలిగిస్తుంది. ప్రస్తుతం ఫేస్‌బుక్ బిల్డ్ చేస్తున్న ఈ యాప్‌ను ఓకులస్ క్వెస్ట్ 2 హెడ్‌సెట్ (Oculus Quest 2 headset) వినియోగదారులు ఉచితంగా వినియోగించుకోవచ్చని ఫేస్‌బుక్ ప్రతినిధులు చెబుతున్నారు.
ఎంత మంది వినియోగించుకోవచ్చు
రాయిటర్స్ ప్రకారం..ఫేస్‌బుక్ సంస్థ ఇంటర్నల్‌గా జరిపే మీటింగ్‌లో ఈ హారిజన్ వర్క్ రూమ్‌ను వినియోగిస్తుంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ రియాలిటీ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ బోస్‌వర్త్ మాట్లాడుతూ..క్వెస్ట్ 2 హెడ్‌సెట్‌ల సాయంతో వర్చువల్ రియాలిటీలో జరిగే వీడియో కాన్ఫిరెన్స్‌లో 16 మంది నుంచి 50 మంది వరకు పాల్గొనవచ్చని తెలిపారు.
చదవండి : మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి..!
Comments
Please login to add a commentAdd a comment