Facebook CEO Mark Zuckerberg
-
జుకర్‌బర్గ్ చేతికి అరుదైన వాచ్! రేటు తెలిస్తే..
బిలియనీర్లు, వ్యాపార ప్రముఖుల బిజినెస్ విషయాలే కాదు.. వారు ఏం ధరిస్తున్నారు.. లైఫ్ స్టైల్‌కు సంబంధించిన విశేషాలూ వార్తల్లోకి వస్తుంటాయి. మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల చేతికి అరుదైన వాచ్‌తో కనిపించారు. మరి ఔత్సాహికులు ఊరికే ఉంటారా ఆ వాచీ ఏ కంపెనీ, ధర ఎంత తదితర విషయాలు ఆరా తీసి కనిపెట్టేశారు.జుకర్‌బర్గ్ ధరించిన గడియారం డి బెతునే కంపెనీకి చెందిన డీబీ 25 స్టార్రి వేరియస్ వాచ్. ధర 90,000 నుంచి 95,700 డాలర్లు (రూ. 75 లక్షల నుండి రూ.80 లక్షలు) మధ్య ఉంటుందని బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. అంటే దాదాపుగా భవిష్యత్ టెస్లా సైబర్‌ట్రక్ ధరంత. దీని రేటు 99,990 డాలర్లు. ఇది అరుదైన వాచ్. ఇలాంటివి సంవత్సరానికి కేవలం 20 వాచీలను మాత్రమే తయారు చేస్తారు.డీబీ 25 స్టార్రి వేరియస్ వాచ్‌కి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. స్విస్ వాచ్‌మేకర్ వెబ్సైట్ ప్రకారం.. తెలుపు, గాఢ నీలం రంగుల్లో ప్రకాశవంతమైన డయల్, 24-క్యారెట్ బంగారంతో పాలపుంతలో నక్షత్రాల్లాగా అంకెలను సూచించే చుక్కలు, వాటిని తాకుతూ ముళ్లు, చుట్టూ మెరిసిపోతున్న రోజ్ గోల్డ్ ఫ్రేమ్ చూస్తేనే కళ్లు చెదిరేలా చేస్తున్నాయి.జుకర్‌బర్గ్ ప్రీమియం వాచ్ ధరించడం ఇదే మొదటిసారి కాదు. మొన్నామధ్య తన భార్య భుజాలపై చేయి వేసుకుని తీసుకున్న సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో ఆయన చేతికి ఖరీదైన వాచ్ ధరించారు. అది 1,41,400 డాలర్ల విలువైన పటెక్ ఫిలిప్ వాచ్ అని వెంటనే పట్టేశారు ఔత్సాహికులు.Mark Zuckerberg spotted yesterday during the @AcquiredFM live wearing a DB25 Starry Varius in rose gold from De Bethune. 👀 pic.twitter.com/raZRTyzmAz— ZwapX (@zwapxofficial) September 11, 2024 -
ప్రపంచ టెక్ సంస్థలకు సీఈవోలు.. ఈ ‘గే’లు..
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ ఆలివర్ మల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. ఈమేరకు వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే చాలామంది ఆ ఫొటోలను ఏఐ రూపొందించిందా అని అభిప్రాయపడ్డారు. డీప్‌ఫేక్ అందుబాటులోకి రావడంతో ఇలాంటి అనుమానాలు రావడం సహజం. దాంతో ఆల్ట్‌మన్ తన పెళ్లిపై స్పందిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. హైస్కూల్లో చదువుతున్న సమయంలోనే తాను ‘గే’నని ఆల్ట్‌మన్ ప్రకటించారు. తొమ్మిదేళ్ల పాటు లూప్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్ సివోతో డేటింగ్ చేసి 2012లో శామ్ విడిపోయారు. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న సీఈఓలు తమ వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలను కొందరు వ్యతిరేకిస్తారు, మరికొందరు ఆహ్వానిస్తారు. ఏదిఏమైనా వారు తమ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవడానికైనా పూర్తి హక్కు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీల సీఈవోలు తమనుతాము ‘గే’గా ప్రకటించుకుని వారి జీవితాల్లో సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో కొందరి వివరాలు కొంద తెలుపబడ్డాయి. శామ్ ఆల్ట్‌మన్, ఓపెన్ ఏఐ సీఈవో హైస్కూల్లో 17 సంవత్సరాల వయసులో తాను ఒక గే అని ప్రకటించుకున్నారు. ఆ సమయంలో తోటి విద్యార్థుల నుంచి చాలా అభ్యంతరాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాజాగా మల్హెరిన్‌తో పెళ్లికి ముందు లూప్ట్ సంస్థలో తన సహ వ్యవస్థాపకుడు నిక్ శివోతో సహజీవనం చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సంయుక్తంగా అమెరికన్ జియోలొకేషన్ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించిన వీరిద్దరూ తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్నారు. 2012లో కంపెనీని విక్రయించిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆల్ట్మాన్ అనేక సందర్భాల్లో మల్హెరిన్‌తో డేటింగ్ గురించి పబ్లిక్‌గా మాట్లాడారు. సెప్టెంబరు 2023లో న్యూయార్క్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ ఆల్ట్మాన్ త్వరలో మల్హెరిన్‌తో పిల్లలను కనాలని ఆశపడుతున్నట్లు వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్‌లో ఇచ్చిన విందులోనూ ఇద్దరు చాలా సన్నిహితంగా కనిపించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. టిమ్ కుక్, యాపిల్ సీఈవో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2014లో స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నారు. ఆ సంవత్సరం జూన్‌లో ‘శాన్ ఫ్రాన్సిస్కో గే ప్రైడ్ పరేడ్’లో యాపిల్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అక్టోబరు 30, 2014న కుక్ బహిరంగంగా ‘నేను స్వలింగ సంపర్కుడిగా గర్వపడుతున్నాను. స్వలింగ సంపర్కం దేవుడు నాకిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తున్నాను’ అని చెప్పారు. పీటర్ థీల్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు 2016లో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పీటర్ థీల్ తాను స్వలింగ సంపర్కుడిగా గర్విస్తున్నట్లు చెప్పారు. 2002లో, ‘ఈబే’ పేపాల్‌ను 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్ థీల్ను బిలియనీర్‌గా మార్చింది. క్రిస్ హ్యూస్, ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు ఫేస్బుక్ నలుగురు సహ వ్యవస్థాపకులలో క్రిస్ హ్యూస్ ఒకరు. అతడు బహిరంగంగా ‘గే’ ప్రకటించుకున్నారు. హ్యూస్ 2012లో సీన్ ఎల్డ్రిడ్జ్ను వివాహం చేసుకున్నారు. 2019లో హ్యూస్ ఫేస్బుక్, మార్క్ జుకర్‌బర్గ్‌పై విమర్శలు గుప్పించి వార్తల్లోకెక్కారు. క్లాడియా బ్రిండ్, మేనేజింగ్ డైరెక్టర్, ఐబీఎం క్లాడియా బ్రిండ్ ఐబీఎంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 1990లో ఆ సంస్థలో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె తాను ఒక లెస్బియన్‌గా ప్రకటించుకున్నారు. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. కీలక సమాచారాన్ని వెల్లడించిన మంత్రి ఆన్ మే చాంగ్, కాండిడ్, సీఈవో యాపిల్, గూగుల్, ఇన్టుఇట్ కంపెనీల్లో కీలక స్థానాల్లో పని చేసిన ఆమె ప్రస్తుతం సామాజిక రంగానికి సంబంధించిన డేటాను అందించే ఒక నాన్‌ప్రాఫిట్ సంస్థ కాండిడ్‌లో పని చేస్తున్నారు. లెస్బియన్ల హక్కుల కోసం వివిధ వేదికలపై ఆమె మాట్లాడారు. -
Layoffs: మెటాలో మళ్లీ లేఆఫ్స్! నిజమేనా?
సోషల్ మీడియా టెక్ దిగ్గజం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా మళ్లీ లేఆఫ్ అమలు చేయనుందని వార్త ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇదే కంపెనీ గత నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా 11వేల మందిని తొలగించింది. ఇది ఆ సంస్థ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 13 శాతం. ఎక్కువ మందిని నియమించుకోవడం, ఆర్థిక మందగమనాన్ని అందుకు కారణంగా అప్పట్లో యాజమాన్యం పేర్కొంది. తాజాగా అవే కారణాలను చూపుతూ మరో విడత లేఆఫ్స్ అమలు చేయనుందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం వెలువరించింది. పలు విభాగాల్లో ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని పేర్కొంది. అయితే ఇవి ఒకే సారి కాకుండా దశలవారీగా ఉండొచ్చని అభిప్రాయపడింది. కంపెనీ రెవెన్యూ నాలుగో త్రైమాసికంలో తగ్గిపోవడం, ఉద్యోగుల పనితీరు సమీక్ష సందర్భంగా వేలాది మందికి అధమ రేటింగ్ ఇచ్చిన నేపథ్యంలో లేఆఫ్స్ ఉండొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అంతే కాకుండా కంపెనీలో ఉన్నత ఉద్యోగులను కొంతమందిని కింది స్థాయి ఉద్యోగాలకు పరిమితం చేయనున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ వివరించింది. (ఇదీ చదవండి: US Visa: మరింత తొందరగా అమెరికన్ వీసా.. భారతీయులకు అధిక ప్రాధాన్యత!) అయితే ఈ కథనాన్ని మెటా కంపెనీ ఖండించింది. కంపెనీ కమ్యూనికేషన్స్ హెడ్ యాండీ స్టోన్ వాషింగ్టన్ పోస్ట్ కథనంపై ట్విటర్ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. వైరుధ్య కథనాలను పదేపదే ఎలా ప్రచురిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
లేఆఫ్‌ల ట్రెండ్.. మెటా అనూహ్య నిర్ణయం.. జుకర్‌బర్గ్‌కు ఏకంగా..!
ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్న వేళ ఫేస్బుక్ యాజమాన్య సంస్థ మెటా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీ అలవెన్స్‌ను పెంచింది. జుకర్‌బర్గ్‌కు, ఆయన కుటుంబానికి ఇస్తున్న సెక్యూరిటీ అలవెన్సును ఏకంగా 4 మిలియన్ డాలర్లు పెంచి 14 మిలియన్ డాలర్లు (సుమారు రూ.115 కోట్లు) చేసింది. ప్రస్తుతం పెంచిన సెక్యూరిటీ అలవెన్సుతోపాటు జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీ ప్రోగ్రామ్ కింద చెల్లిస్తున్న ఖర్చులన్నీ సముచితం, అవసరమైనవేనని మెటా ఒక ప్రకటనలో తెలిపింది. ఓ వైపు ‘ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ’ అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వేలాది ఉద్యోగాలకు కోత పెడుతూ మరోవైపు జుకర్‌బర్గ్‌కు ఇంత భారీగా సెక్యూరిటీ అలవెన్స్‌ను పెంచడం చర్చనీయాంశమైంది. ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో అత్యంత సంపన్న వ్యక్తిగా 16వ ర్యాంక్‌లో ఉన్న జకర్బర్గ్ 2021లో సుమారు 27 మిలియన్ల డాలర్ల జీతభత్యాలను అందుకున్నాడు. అయితే గత సంవత్సరానికి సంబంధించి అతని పే ప్యాకేజీని మెటా ఇంకా వెల్లడించలేదు. మెటా మరిన్ని ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నందునే ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బడ్జెట్లను ఖరారు చేయడంలో ఆలస్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. (ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్ ఫైలింగ్..) -
మార్క్ జుకర్‌బర్గ్ 'కక్కుర్తి' పని, వందల కోట్లకు ఇల్లు అమ్మకం!
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌పై మరోసారి ఆరోపణలు వెల్లువెత్తాయి. తన ఇంటి కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టారని గతంలో స్థానికులు పలు మార్లు ఫిర్యాదు చేశారు. దీంతో చేసేది లేక శానిఫ్రాన్సిస్కోలో ఉన్న తన ఇంటిని మెటా సీఈవో 31 మిలియన్ డాలర్లకు అమ్మినట్లు తెలుస్తోంది. 2012లో కొన్ని ఆ ఇల్లును అమ్మగా ఇప్పుడు అదనంగా 3 రెట్ల లాభం వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మార్క్ జుకర్‌బర్గ్‌కు శాన్ ఫ్రాన్సిస్కోలో అత్యంత ఖరీదైన నివాసం ఉంది. 1928లో 7వేల స్కైర్ ఫీట్లో ఆ ఇంటిని నిర్మిచగా..2012 నవంబర్‌లో సోషల్ మీడియా దిగ్గజం దానిని 10మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. భార్యకు ప్రేమతో మే 18, 2012లో ఫేస్బుక్ ఐపీవోకి వెళ్లింది. కొన్ని నెలల తర్వాత జుకర్ బర్గ్ తన భార్య ప్రిసిల్లా చాన్‌పై ప్రేమతో అతిపురాతనమైన ఆ ఇంటిని కొనుగోలు చేశారు. లాండ్రీ రూం, వైన్ రూం,వెట్ బార్, గ్రీన్‌తో ఆ ఇంటిని పునరుద్ధరించేందుకు మల్టీ మిలియన్డాలర్లు ఖర్చు చేశారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ 10మిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఆ ఇంటిని కొనుగోలు చేసిన మార్క్ జుకర్‌బర్గ్‌పై స్థానికులు పలు మార్లు ఫిర్యాదు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసిన సమయంలో ఉన్న విస్తీర్ణం కంటే అదనంగా మరికొంత స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 7,400 స్కైర్ ఫీట్లో ఇంటిని మోడిఫికేషన్ చేసిన జుకర్ బర్గ్..కార్ పార్కింగ్‌ను అక్రమంగా నిర్మించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో జుకర్ బర్గ్ ఆ ఇంటిని అమ్మడం ఆసక్తికరంగా మారింది. -
హే..! జుకరూ..నువ్వు మారవా?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్ బర్గ్ తీరుపై టెక్ జెయింట్ యాపిల్ సంస్థ సీఈఓ టీమ్ కుక్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల 'మెటా' డిజిటల్ ప్రొడక్టులు అమ్మే డెవలపర్ల నుంచి 50శాతం ఫీజు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అధిక ఫీజులు వసూలు చేస్తూ మెటా వంచనకు పాల్పడుతుందంటూ యాపిల్ సంస్థ ప్రముఖ బిజినెస్ మీడియా సంస్థ మార్కెట్ వాచ్‌కు తెలిపింది ఎన్ఫ్టీ వర్చువల్ క్లాతింగ్, సిగ్నేజ్, ఆర్ట్ వర్క్ వంటి డిజిటల్ ప్రొడక్ట్‌లను తయారు చేసే వాళ్లను డెవలపర్లని అంటారు. ఆ డెవలపర్లు ఆ డిజిటల్ ప్రొడక్ట్‌లను తయారు చేసి మెటావర్స్కు చెందిన హారిజోన్ ఫ్లాట్‌ఫామ్‌లో అమ్మకానికి పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. హారిజోన్ ఫ్లాట్ ఫామ్ వేదికగా డిజిటల్ ప్రొడక్ట్‌లను అమ్మే డెవలపర్ల నుంచి 50శాతం కమీషన్ వసూలు చేస్తుంది. ఇప్పుడు ఇదే అంశంపై యాపిల్ సంస్థ జుకర్ బర్గ్‌పై మండిపడుతోంది.మెటా నిర్ణయం వల్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా జరిగే బిజినెస్‌తో యాపిల్‌కు వచ్చే ఆదాయం దాదాపూ 30శాతం పడిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే పలు మార్లు యాపిల్..మెటా నిర్ణయాన్ని తప్పుబడుతూ వస్తోంది. ఎందుకంటే 'యాప్ స్టోర్‌లో పెయిడ్ యాప్స్, ఇన్ యాప్ పర్చేజస్ నుంచి యాపిల్ యాప్ స్టోర్ 30 శాతం స్టాండర్డ్ కమిషన్‌ను తీసుకుంటోంది. అంత తక్కువ శాతం కమిషన్ తీసుకోవడం వల్లే మెటాకు వచ్చే ఆదాయం పడిపోతుందని, ఇదే అంశంలో మెటా ఆపిల్‌ను పదే పదే టార్గెట్ చేస్తుందని యాపిల్ ప్రతినిధి ఫ్రెడ్ సైంజ్ మార్కెట్ వాచ్‌తో అన్నారు. పేరు మార్చినా ఆయన తీరు మార్చలేదు! పేరు మార్చినా మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ తన తీరు మార్చుకోవడం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో యూజర్లు భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు పరమావధిగా మారిందంటూ ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ విజిల్ బ్లోవర్‌గా మారిపోయి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జుకర్ బెర్గ్ డెవలపర్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఫ్రానెన్స్ హౌగెన్ చేసిన ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయనే అంటున్నారు. చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం -
మీ బట్టలు మీరే ఉతుక్కోండి,ఎవరూ ఉతకరు..ఉద్యోగులకు జుకర్ బెర్గ్ నోటీసులు!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్(మెటా) పరిస్థితి మేడిపండను తలపిస్తుంది. పైకి అంతా బాగున్నట్లే ఉన్నా కరోనా కారణంగా ఆర్ధిక చిత్రం దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థలోని ఉద్యోగులకు అందించే ప్రోత్సహకాల్ని నిలిపివేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేకంగా కథనాన్ని ప్రచురించింది. సిలికాన్ వ్యాలీ. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ గూగుల్, యాపిల్, ఫేస్బుక్ తో పాటు ఇతర దిగ్గజ టెక్ కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న టెక్ కంపెనీలన్నీ ఉద్యోగుల నుంచి ఫలితాల్ని రాబట్టేందుకు, ఎక్కువ పనిగంటలు పనిచేయించుకునేందుకు భారీ ఎత్తున ప్రోత్సహకాల్ని అందిస్తుంటాయి. అయితే కరోనా, వరుస వివాదాల కారణంగా భవిష్యత్‌లో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఉద్యోగుల ధరించే దుస్తువుల్ని ఉతకడం, ఐరన్ చేయడంలాంటి సౌకర్యాల్ని ఫేస్బుక్ తొలగించింది. ఉద్యోగులకు సాయంత్రం 6.00గంటలకు డిన్నర్ టైమ్‌కు ఉచితంగా భోజనాన్ని అందిస్తుంది. ఆ సమయాన్ని సాయంత్రం 6.30కి పెంచడం, వ్యాలెట్ సేవల్ని సైతం కట్ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో హైలెట్ చేసింది. ఉద్యోగులకు తొలగించిన ప్రోత్సహకాలు కంపెనీకి తగ్గుతున్న ఆదాయానికి ముడిపడి ఉంది. భవిష్యత్ లక్ష్యాలను ప్రతిభింభించేలా ఫేస్బుక్ పేరును మెటా మార్చింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వ్యాల్యూ 515డాలర్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో జుకర్ బెర్గ్ తీసుకున్న కీలక నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉద్యోగులకు కంపెనీ అందించే ప్రోత్సహాకాలకు, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వ్యాల్యూ పడిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని ఫేస్బుక్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగులకు అందించే సదుపాయాల విషయంలో ఫేస్బుక్ ఇలా ఉందని, కానీ వారి ఆరోగ్యంతో పాటు ఇతర సెక్యూరిటీల విషయంలో అందించే ఫండ్ ను 300 డాలర్ల నుంచి 3వేల డాలర్లకు పెంచిందని సూచిస్తున్నారు. చదవండి: రూ.22వేల కోట్ల ఫైన్ ! జుకర్ బర్గ్ ఒక్కో యూజర్‌కు తలా రూ.5వేలు ఇస్తారా!! -
రూ.22వేల కోట్ల ఫైన్ ! జుకర్ బర్గ్ ఒక్కో యూజర్‌కు తలా రూ.5వేలు ఇస్తారా!!
ఫేస్బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్ బర్గ్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోందా? ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి బయటపడాలంటే జుకర్ బర్గ్ తన ఆస్తుల్ని అమ్ముకోవాల్సిందేనా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. యూకే నిబంధనల విరుద్దంగా జుకర్‌బర్గ్ ప్రయత్నిస్తున్నారంటూ..ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా యూకేలో రూ.22,990 కోట్ల ఫైన్ కేసు నమోదైంది. ఫేస్బుక్ తన ఆధిపత్యంతో దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలపై యూకేలో 3.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 22,990 కోట్లు) క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటోంది. కాంపటీషన్ లా ఎక్స్పర్ట్ డాక్టర్ లిజా లోవ్డాల్ గోర్మ్‌సెన్ 'యూకే కాంపిటీషన్ లా ట్రిబ్యూనల్'లో ఫేస్‌బుక్‌పై క్లాస్ యాక్షన్ దావా వేశారు. 2015 - 2019 మధ్యకాలంలో ఫేస్బుక్ తన 44 మిలియన్ల యూకే వినియోగదారుల డేటాను చోరీకి పాల్పడిందని, తద్వారా బిలియన్ల ఆదాయాన్ని గడించేందుకు ఆ డేటా దోహదం చేసిందని స్పష్టం చేశారు. కాబట్టే యూజర్లకు ఫేస్బుక్ పరిహారం చెల్లించాలని దావాలో పేర్కొన్నారు. ఈ కేసులో ఫేస్బుక్ దుర్వినియోగానికి పాల్పడిందనే తేలితే దాదాపు 44 మిలియన్ల యూకే ఫేస్బుక్ యూజర్లకు ఒక్కొక్కరికి 68 డాలర్లు (సుమారు రూ.5,000) చెల్లించాల్సి ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాల్ని ప్రచురించాయి. 17ఏళ్ల క్రితం స్థాపించిన ఫేస్బుక్ కుటంబ సభ్యులు,స్నేహితులు ఆన్లైన్లో కలుసుకునేందుకు అనువైన వేదికగా మారింది. అయినప్పటికీ, ఫేస్బుక్లో మరో చీకటి కోణం దాగి ఉంది. ఇది సాధారణ యూకే ప్రజల వ్యక్తిగత డేటాను దొంగిలించి..వారిపై అన్యాయమైన నిబంధనలు, షరతులను విధిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యంతో ఫేస్బుక్ దుర్వినియోగానికి పాల్పడింది. ఫేస్బుక్ ద్వారా యూకే యూజర్ల డేటాను దొంగిలించినందుకు 44 మిలియన్ల యూకే యూజ్లరకు నష్టపరిహారం కోసం ఈ కేసు వేస్తున్నట్లు గోర్మ్‌సెన్ తెలిపారు. కాగా డాక్టర్ గోర్మ్‌సెన్ బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ కంపారిటివ్ లా (బీఐఐసీఎల్)లో సీనియర్ రీసెర్చ్ ఫెలో, కాంపిటీషన్ లా ఫోరమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. చదవండి: జుకర్ బర్గ్‌ను వెంటాడుతున్న యూకే, అమ్ముతావా? లేదా? -
కరోనా దెబ్బకు డిమాండ్, భలే స్కెచ్చేసిన మార్క్ జుకర్ బర్గ్..!
కోవిడ్ కారణంగా ప్రపంచ దేశాల్లో యూపీఐ, క్యూఆర్ కోడ్ పేమెంట్స్ వినియోగం పెరిగిపోతుంది. అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయా సంస్థలు యూపీఐ Unified Payments Interface (UPI) పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే, వాట్సాప్‌లు ఉండగా.. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్(మెటా) అధినేత మార్క్ జుకర్ బర్గ్ సైతం ఈ యూపీఐ సర్వీసుల్ని ఫేస్బుక్ మెసెంజర్లో అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో బీటా వెర్షన్ పై పనిచేస్తున్నట్లు, మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. ఆ తరువాత ఇతర దేశాల్లో సైతం ఈ ఫీచర్‌ను వినియోగించేకునే సదుపాయాన్ని కల్పిస్తామని ఫేస్బుక్ ప్రతినిధులు చెప్పారు. వచ్చే వారం యూఎస్యూలోని మెసేంజర్ యూజర్లు వినియోగించేలా పేమెంట్ ఆప్షన్‌పై టెస్ట్ చేయనున్నట్లు ఫేస్బుక్ తన బ్లాగ్‌లో పేర్కొంది. స్ప్లిట్ పేమెంట్ పేరుతో మెసెంజర్లో ఫేస్బుక్ పరిచయం చేయనున్న ఈ ఫీచర్‌తో నిత్యవసర సరుకులు, రెంట్, హోటల్ బిల్లుల్ని ఒకేసారి సెండ్ చేయొచ్చు. అదే సమయంలో నోటిఫికేషన్ సైతం పంపిచుకోవచ్చు. చెల్లించిన మొత్తం సంబంధిత వ్యక్తులకు ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనకు గ్రూప్‌లో ఒక చాట్లా కనిపిస్తుంది. ఫీచర్ ఎలా పనిచేస్తుంది ►స్ప్లిట్ పేమెంట్స్ ఫీచర్‌ని ఉపయోగించడానికి గ్రూప్ చాట్‌లో “గెట్ స్టార్ట్” అనే బటన్‌పై క్లిక్ చేయాలి. ►క్లిక్ చేస్తే పేమెంట్స్ ఎవరెవరికి ఎంత పంపించాలో డివైడ్ చేయాలి ►ఆ వివరాల్ని ఎంటర్ చేసిన అనంతరం మీరు మీ ఫేస్బుక్ పేమెంట్ వివరాల్ని కన్ఫాం చేయాల్సి ఉంటుంది. ►కన్ఫామ్ చేసిన తరువాత.. మీ పంపిన మెసేజ్ వెళ్లిందా లేదా చెక్ చేయాలి. చదవండి: జుకర్ బర్గ్‌ను వెంటాడుతున్న యూకే, అమ్ముతావా? లేదా? -
జుకర్ బర్గ్‌పై మరో పిడుగు, ఫ్రాన్సెస్ హౌగెన్ ఎంత పని చేశావమ్మా..!
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్‌కు భారీ షాక్ తగిలింది. ఒహాయో అటార్నీ జనరల్ డేవిడ్ యోస్ట్ మెటాపై (ఫేస్బుక్) దావా వేశారు. ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ విజిల్ బ్లోవర్‌గా మారి..ఫేస్బుక్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె చేస్తున్న ఆరోపణల కంటే ఇప్పుడు ఒహాయో అటార్నీ జనరల్ వేసిన దావా చాలా ప్రమాదకరమని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి పెట్టిన చిచ్చుకంటే ఇదే పెద్దది ఓహియో అటార్నీ జనరల్ మెటాపై పరువు నష్టం దావా వేశారు. ఫెడరల్ సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. అంతేకాదు ఒహాయో పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్, ఫేస్బుక్ పెట్టుబడిదారుల తరపున ఈ కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగిగా మారిన విజిల్‌బ్లోయర్ ఫ్రాన్సిస్ హౌగెన్ మొదట వాల్ స్ట్రీట్ జర్నల్‌కు అంతర్గత పత్రాలను లీక్ చేశారు. ఆ లీక్ చేసిన డాక్యుమెంట్లు కారణంగా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్, ఫేస్బుక్ పెట్టుబడిదారులు 100 బిలియన్ల మార్కెట్ వాటాను కోల్పోయినట్లు డేవిడ్ యోస్ట్ చెప్పారు. అయితే ఈ దావా మార్క్ జుకర్బర్గ్లాంటి వ్యక్తుల గురించి కాదని, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యవస్థలపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఈ దావాతో పెన్షన్ ఫండ్ నష్టాలను తిరిగి పొందవచ్చని, అలాగే ప్రజలను తప్పుదోవ పట్టించకుండా ఉండటానికి కంపెనీ మార్పులు చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు యోస్ట్ ప్రకటనలో పేర్కొన్నారు. ఫేస్బుక్ పై కఠిన చర్యలు తప్పవ్ డేవిడ్ యోస్ట్ చేసిన కేసు అంశంపై మెటా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌పై నమోదైన ఫిర్యాదుల కంటే యోస్ట్ వంటి రాష్ట్ర అటార్నీ జనరల్ వేసిన కేసు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎనలిస్ట్ బ్లెయిర్ లెవిన్ చెప్పారు. కోర్టు మెటాను మరిన్ని అంతర్గత పత్రాలను పబ్లిక్ చేయమని ఆదేశించే అవకాశం ఉందని, తద్వారా ఫేస్‌బుక్‌కు మరిన్ని చిక్కులు తప్పవని లెవిన్ చెప్పారు. గతంలోనే యోస్ట్ లేఖ 40 మంది రాష్ట్ర అటార్నీ జనరల్‌లలో ఒకరైన యోస్ట్ గతంలో ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్‌కు లేఖ రాశారు. పిల్లల కోసం డిజైన్ చేసే ఇన్స్టాగ్రామ్ వెర్షన్‌పై ఆంక్షలు విధించాలని జుకర్ బెర్గ్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. -
జుకర్ బర్గ్‌పై మరో పిడుగు..! ఈ సారి మైక్రోసాఫ్ట్ రూపంలో..!
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్‌కు మైక్రోసాఫ్ట్ నుంచి మరో ఎదురు దెబ్బ తగలనుంది. ఇప్పటికే జుకర్ బర్గ్ కొత్త టెక్నాలజీ మెటావర్స్ పై పనిచేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మైక్రోసాఫ్ట్ సైతం ఈ మెటావర్స్ పై పనిచేస్తున్నట్లు ప్రకటించింది. ఈ టెక్నాలజీని ఫేస్బుక్ కంటే తామే ముందుగా ప్రపంచానికి పరిచయం చేస్తామని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. జూకర్ బర్గ్.. నువ్వు దిగిపో గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామలతో జుకర్ బర్గ్‌కు డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందని, ప్రస్తుతం ఆయనకు ఎదురవుతున్న సమస్యలపై టెక్ నిపుణులు చెబుతున్న మాట. నిన్న ఫేస్బుక్ సీఈఓగా పనికి రాడని, ఆ పదవి నుంచి దిగిపోవాలని ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హాగెన్ వ్యాఖ్యానించింది. లేదంటే ఫేస్బుక్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో ఫేస్బుక్ పేరును మెటాగా మార్చడంతో అదికాస్త వివాదం అయ్యింది. జుకర్ వాడిన 'మెటా' లోగో తమదేనంటూ జర్మనికి చెందిన 'ఎం-సెన్స్ Migräne' ట్వీట్ చేసింది. లోగో, ఫేస్బుక్ మాతృ సంస్థ లోగో ఒకేవిధంగా ఉన్నాయంటూ ట్వీట్లో పేర్కొంది. అది సర్ధుమణిగే లోపే తాజాగా టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మెటావర్స్ పై వర్క్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో జుకర్‌కు మరో ఎదురు దెబ్బతగిలినట్లైంది. అయితే ఈ మెటావర్స్ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్ కోసం కాదని వర్చువల్ రియాలిటీ (వీఆర్), అగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్), మిక్స్డ్ రియాలిటీ( ఎంఆర్)లను ఒకే ఫ్లాట్ ఫాం మీదికి తెచ్చే 'మైక్రోసాఫ్ట్ మెష్' కోసం అని చెప్పింది. మైక్రోసాఫ్ట్ మెష్ అంటే కరోనా కారణంగా ఈ 'వీఆర్, ఏఆర్, ఎంఆర్' టెక్నాలజీ వినియోగం బాగా పెరిగిపోయింది. అందుకే ఈ వర్చువల్ టెక్నాలజీపై వర్క్ చేస్తున్న మైక్రోసాఫ్ట్..ఇందుకోసం మైక్రోసాఫ్ట్ మెష్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో వినియోగించేందుకు మెటావర్స్ ను బిల్డ్ చేస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాదిలో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నట్లు వెల్లడించింది. మెటావర్స్ అంటే మెటావర్స్ అంటే ఇదొక వర్చువల్ రియాలిటీ. వర్క్ ఫ్రం హోంలో బిజీగా ఉన్న ఉద్యోగులు ఆఫీస్‌లో జరిగే మీటింగ్‌లకు హాజరు కాలేరు. అదే ఈ మెటావర్స్ టెక్నాలజీతో ఎక్కడ ఉన్నా..2డీ, త్రీడీ అవతార్ ఆకారాల్లో ఆఫీస్‌లో జరిగే మీటింగ్‌కు అటెండ్ అయ్యామనే అనుభూతిని కల్పిస్తుంది. కరోనా లాక్ డౌన్ టైమ్‌లో ఈ టెక్నాలజీని ఫేస్బుక్ ఇంటర్నల్‌గా జరిగే మీటింగ్‌లలో వినియోగించింది. దీన్ని పూర్తి స్థాయిలో ప్రపంచానికి అందించేందుకు 'మెటా' పేరుతో ఫేస్బుక్ అధినేత జుకర్ పనిచేస్తుండగా..మైక్రోసాఫ్ట్ సైతం ఈ మెటావర్స్ పై వర్క్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వరుస వివాదాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జుకర్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయం ఎన్ని తలనొప్పులు తెచ్చిపెడుతుందోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి: 'ఐ కాంట్ బ్రీత్':ఫేస్బుక్ కు మరో ముప్పు..జూకర్ ఏం చేస్తారో? -
పేరుమార్చుకున్న ఫేస్బుక్.. ఇకపై అన్ని సేవలు ‘మెటా’ కిందనే
ఓక్లాండ్: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ ‘కార్పొరేట్’ పేరు ఇకపై ‘మెటా’గా రూపాంతరం చెందనుంది. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గురువారం కంపెనీ కనెక్ట్ ఈవెంట్లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు కొత్తలోగో ఆవిష్కరణ జరిగింది. అంతర్జాతీయంగా ఇటీవల ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్ సేవలు సాంకేతికంగా పలు గంటల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రజాభద్రతకంటే లాభార్జనకే ఫేస్బుక్ పెద్దపీట వేస్తోందని ఇటీవల తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇంతకుముందు ఫేస్బుక్ కింద కొనసాగిన సామాజిక మాధ్యమాలు– ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లు ఇకపై ‘మెటా’ కింద కొనసాగుతాయి. అంటే మాతృసంస్థ పేరుమాత్రమే మారింది తప్ప, దానికింద ఉండే సామాజిక మాధ్యమాల సేవలు పాతపేర్లతోనే కొనసాగుతాయి. ‘మెటావర్స్’ దిశలో అడుగులు! ‘మెటావర్స్’లో భాగంగా పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు జుకర్‌బర్గ్ తెలిపారు. వర్చువల్–రియాలిటీ స్పేస్‌లో రానున్న కాలంలో వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేని అత్యున్నత స్థాయి సాంకేతిక సేవలను వినియోగం, తత్సబంధ అంశాలు ‘మెటావర్స్’ పరిధిలోకి వస్తాయి. ‘యాప్స్’ నుంచి మరింత సాంకేతిక పరిపక్వత కలిగిన ‘మెటావర్స్’దిశగా మెటా అడుగులు వేస్తుందని కూడా ఈ సందర్భంగా జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ‘‘ఒకరికి ఒకరిని కలిపి ఉంచడానికి సాంకేతికతను ఆవిష్కరించే కంపెనీ మనది. వెరసి మన సాంకేతికతలో ప్రజలను ఒక చోటు కేంద్రీకరించవచ్చు. తద్వారా అందరూ కలిసి ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతికి దోహదపడవచ్చు’’ అని ఈ సందర్భంగా జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత బ్రాండ్ ఇకపై మనకు కావాల్సిన సేవల అన్నింటినీ అందించలేకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనం భవిష్యత్తుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ దిశలోనే మన సంస్థ బ్రాడ్ పేరు మారింది’’ అని కూడా ఆయన పేర్కొన్నారు. -
ఫ్రాన్సెన్స్ హాగెన్ చిచ్చు..ఫేస్‌బుక్‌పై బాంబు పేల్చిన ఆస్ట్రేలియా ?!
యూజర్ల భద్రత కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తుందంటూ మాజీ ఉద్యోగిని ఫ్రాన్సెన్స్ హాగెన్ పెట్టిన చిచ్చు ఫేస్ బుక్‌ను రోజుకో మలుపు తిప్పుతున్నాయి. ఈ ఆరోపణలే ఫేస్బుక్ పేరు సైతం మార్చే దిశగా జుకర్ బెర్గ్ ప్రయత్నాలు ప్రారంభించారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 10 మిలియన్ల జరిమానా విధించే యోచనలో ఉందని తెలుస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియాపై కొత్త చట్టాల్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉంది. చట్టాల ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సోషల్ మీడియా సంస్థలకు 10 మిలియన్ల వరకు జరిమాన విధించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. అదే జరిగితే ముందుగా ఫేస్బుక్ జరిమానా కట్టాల్సి ఉంటుందనే అనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సోషల్ మీడియా చట్టాల్ని మరింత కఠిన తరం చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా అటార్నీ జనరల్ మైఖేలియా క్యాష్ మాట్లాడుతూ.. సోషల్ ఫోరమ్ సైట్ రెడ్డిట్తో పాటు బంబుల్ వంటి డేటింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న సోషల్ మీడియా కంపెనీలు యూజర్ల వయస్సును నిర్ధారించడానికి డేటాను సేకరిస్తున్నాయి. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాం. ముసాయిదా చట్టం ప్రకారం.. సోషల్ మీడియా కంపెనీలు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్లు తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి, చట్టాల్ని ఉల్లంఘించిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలు 10 మిలియన్ జరిమానా విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు. మానసిక ఆరోగ్యం,ఆత్మహత్యల నివారణపై ఆస్ట్రేలియా సహాయ మంత్రి డేవిడ్ కోల్మాన్ మాట్లాడుతూ..ఫేస్బుక్ యువతీ యువకుల మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. ''ఆస్ట్రేలియన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కార్యాలయం ప్రతినిధులు సోషల్ మీడియా సంస్థల చట్టాల ఉల్లంఘనపై విచారణ, జరిమానా విధించే అధికారం ఉందని తెలిపారు. విచారణలో ఉల్లంఘన నిజమైతే 10మిలియన్లు లేదా సంస్థల వార్షిక టర్నోవర్‌లో 10శాతం, ఆర్ధిక ప్రయోజనం కోసం ఉల్లంఘిస్తే మూడు రెట్లు జరిమానా విధించే అధికారం ఉందని స్పష్టం చేశారు. చదవండి: ఫేస్బుక్ సంచలన నిర్ణయం.. పేరు మార్పు! -
ఫేస్బుక్ సంచలన నిర్ణయం.. పేరు మార్పు!
Facebook Name Change Says Verge: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ సంచలన నిర్ణయం తీసుకోనుందా? ఫేస్బుక్ పేరు మారబోతోందా? ప్రముఖ టెక్ బ్లాగ్ ది వెర్జ్ అవుననే అంటోంది. ఈ మేరకు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కీలక నిర్ణయం ప్రకటించబోతున్నాడంటూ తాజాగా తన వెబ్సైట్లో వెర్జ్ ఓ కథనం ప్రచురించింది. అక్టోబర్ 28న జరగబోయే కంపెనీ వార్షిక సమావేశంలో ఈ మేరకు ఫేస్బుక్ పేరు మార్చే అంశంపై జుకర్ బెర్గ్ స్పందించనున్నట్లు ది వెర్జ్ కథనం పేర్కొంది. ఒకవేళ అది జరిగినా.. ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్, ఓకులస్లను తదితర ఫేస్బుక్ సంబంధిత సర్వీసులు మాత్రం పేరెంట్ కంపెనీ(ఫేస్బుక్ కంపెనీ) కిందనే నడుస్తాయి. మెటావర్స్ లాంటి భారీ ప్రాజెక్టు దిశగా పేస్బుక్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పేరు మార్చడం ద్వారా రిఫ్రెష్నెస్ ఉంటుందని జుకర్‌బర్గ్ అండ్ కో భావిస్తున్నట్లు వెర్జ్ తన కథనంలో పేర్కొంది. అయితే కొత్త పేరు ఏంటన్న విషయంపై మాత్రం ఆ కథనం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఫేస్బుక్ కూడా ఈ పేరుమార్పు కథనంపై స్పందించేందుకు నిరాకరించడంతో .. ఇదొక రూమర్‌గానే భావించాల్సి ఉంటుంది.ఇక కంపెనీలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేం కాదు. అమెరికా టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్ కంపెనీ(గూగుల్ పేరెంట్ కంపెనీ) నుంచి గూగుల్ ఇలాగే పేరు మార్చుకుని కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫేస్బుక్ అధినేత ఉక్కిరి బిక్కిరి గత కొద్ది రోజులుగా వస్తున్న ఆరోపణులు మార్క్ జుకర్ బెర్గ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మాజీ ఎంప్లాయి ఫ్రానెస్స్ హాగెన్ ఆరోపణలు, అక్టోబర్ 4 రాత్రి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు అనుసంధానంగా ఉన్న వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ దాదాపు 7 గంటల పాటు స్తంభించిపోవడం, దీంతో అసౌకర్యానికి గురైన 2.7 బిలియన్ యూజర్లు ప్రత్యామ్నాయ సోషల్ నెట్ వర్క్‌లను వినియోగించుకునేందుకు మొగ్గు చూపడం, ఆ సర్వీసుల విఘాతం వల్ల రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లడం, ఉద్యోగుల విషయంలో వివక్షతో పాటు ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్‌ను ఉల్లంఘించిందంటూ ఫేస్బుక్ కు రూ.107 కోట్ల ఫైన్ విధించడం..ఆ ఫైన్ కట్టేందుకు జుకర్ బెర్గ్ ఒప్పుకోవడం, ఫేస్బుక్ సీఈఓగా మార్క్ జుకర్ బెర్గ్ రాజీనామా చేస్తున్నారంటూ బ్రిటన్‌కు చెందిన ఓ ప్రముఖ టాబ్లాయిడ్ సంచలన కథనాలు వెలుగులోకి రావడం జుకర్ బెర్గ్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే ప్రస్తుతం ఈ విపత్తు నుంచి బయట పడేందుకు ఫేస్బుక్ పేరు మారిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ జుకర్‌బెర్గ్ ఫేస్బుక్ బోర్డుతో సమాలోచనలు జరుపుతున్నట్లు ది వెర్జ్ తన కథనంలో పేర్కొంది. ఫేస్బుక్ పేరు మార్చడం వల్ల న్యాయపరమైన ఇబ్బందుల నుంచి బయటపడొచ్చనేది మరి కొందరి వాదన. అయితే ఫేస్బుక్ పేరు మారిస్తే..ఫేస్‌బుక్‌కు పెట్టబోయే కొత్త పేరేంటీ? పేరు మార్పును ఎప్పుడు ప్రకటిస్తారని అంశంపై కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. వాట్ నెక్ట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్లతో బిజీగా ఉన్న జుకర్ బెర్గ్..భవిష్యత్ టెక్నాలజీ 'మెటావర్స్'ను డెవలప్ చేసే పనిలో ఉన్నారు. ఇందుకోసం యూరప్‌లో 10వేల మందిని నియమించుకోబోతున్నట్లు ప్రకటించారు. మెటావర్స్ అనేది వర్చువల్ రియాలిటీ స్పేస్. ఇటీవల ఫేస్బుక్, వర్క్‌ప్లేస్ అనే వర్చువల్ రియాల్టీ మీటింగ్స్ యాప్, హారిజన్స్ అనే సోషల్ స్పేస్‌తో ప్రయోగాలు చేస్తోంది. పనిచేసే ప్రదేశాల కోసమే కాకుండా, వాస్తవికతలో సంభాషించేందుకు అవసరమైన వర్చువల్ రియాలిటీ యాప్‌లను ఫేస్బుక్ రూపొందిస్తోంది. ఇందుకోసం 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ.375 కోట్లు)ను ఫేస్బుక్ పెట్టుబడిగా కేటాయించింది. అయితే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో వినియోగం రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఉద్యోగాల్లో వివక్ష.. భారీ మూల్యం చెల్లించనున్న ఫేస్బుక్ -
'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం
అక్టోబర్ 4న ఫేస్బుక్, దానికి అనుసందానంగా ఉన్న సర్వీస్‌లు ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలు సైతం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో అసౌకర్యానికి గురైన 2.7 బిలియన్ యూజర్లు ప్రత్యామ్నాయ సోషల్ నెట్ వర్క్‌లను వినియోగించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఫేస్‌బుక్‌లోని పరిణామాలతో భారతీయులు సైతం ఫోన్ కాల్స్, మెసేజెస్, గూగుల్ మ్యాప్స్‌ను విపరీతంగా వినియోగిస్తున్నట్లు పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. ఫేస్బుక్లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్‌గా పని చేసిన మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ఫ్రాన్సెస్ ఆరోపణలు చేసిన ప్రారంభంలో జూకర్ బెర్గ్ సైతం ఇదంతా 'టీ కప్పులో తుఫాను' అని అనుకున్నారు. కానీ పెను విధ్వంసానికి దారితీసింది. దీంతో ఫేస్బుక్ గురించి పాజిటివ్ ప్రచారం చేయాలని ఫేస్బుక్ ఉద్యోగులను బతిమాలడుడుకుంటుంది.అయినా పరిస్థితి చక్కబడేలా లేదని తెలుస్తోంది. ఫ్రాన్సెస్ హౌగెన్ పెట్టిన చిచ్చు..భారత్‌లో ఫేస్ బుక్ వినియోగం మరింత తగ్గిపోతున్నట్లు తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ 'బాబుల్ ఏఐ' (Bobble AI) నివేదిక ప్రకారం..భారతీయులు కుటుంబ సభ్యుల్ని,స్నేహితుల్ని పలకరించేందుకు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను వినియోగించేవారు. కానీ వాటి వినియోగం ఇప్పుడు బాగా తగ్గినట్లు నివేదికలో పేర్కొంది. మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ఫోన్ ద్వారా కమ్యునికేషన్ చేసే పద్దతి 75 రెట్లు పెరిగినట్లు చెప్పింది. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లలో గూగుల్ పేలో యూజర్ల వినియోగం 200 రెట్లు పెరిగిందని,యూజర్ల తాకిడి ఎక్కువై కొన్ని సార్లు స్తంభించినట్లు వెల్లడించింది. అక్టోబర్ 4న, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దాని మెసెంజర్ ప్రపంచంలోని 3.5 బిలియన్ వినియోగదారులకు ఆరు గంటల పాటు అందుబాటులో లేవు. ఈ అంతరాయంతో ఇతర సోషల్ నెట్వర్క్ సిగ్నల్‌కు 140రెట్లు, ట్విట్టర్‌కు 7రెట్ల యూజర్ల వినియోగం పెరిగింది. యూట్యూబ్‌లో 30రెట్లు, జియోప్లే వంటి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్‌లలో 20రెట్ల ట్రాఫిక్ పెరిగింది. ఎఫ్ఎం రేడియో వినియోగం 20 రెట్లు, ఇతర మ్యూజిక్ యాప్స్ వాడకం 700 రెట్లు పెరిగినట్లు తేలింది. గేమింగ్ కేటగిరీలో బాటిల్ రాయల్ గేమ్స్ 70 సార్లు, టెంపుల్ రన్ 40 సార్లు, పార్కింగ్ జామ్ 3డి 15 సార్లు ట్రాఫిక్ పెరిగినట్లు స్టార్టప్ బాబుల్ ఏఐ చెప్పింది. చదవండి: ఆరు గంటల్లో 50 వేల కోట్ల నష్టం.. హ్యాకింగ్ కాదు జరిగింది ఇది -
ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అకౌంట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 16 నుంచి జులై 31 మధ్య కాలంలో సుమారు 33.3 మిలియన్ల కంటెంట్ పీస్ (ఇమేజ్)లను అకౌంట్ల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. యూజర్లు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండేందుకు ఫేస్ బుక్ గత కొంత కాలంగా యూజర్లు టెక్నాలజీ, ఏఐలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. తద్వారా ఫేస్ బుక్ యూజర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ఇమేజెస్, కంటెంట్లపై కన్నేసింది. ఈ రెండింటిలో ఫేస్‌బుక్‌కు చెందిన 10 కంటెంట్ పాలసీ నిబంధనలతో పాటు ఆ సంస్థకు చెందిన మరో సోషల్ నెట్ వర్క్ ఇన్ స్టాగ్రామ్‌లో 8 పాలసీల నిబంధనల్ని ఉల్లంఘించిన అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. సోషల్ మీడియా వల్ల హింస పెరిగిపోతుందా? కరోనా కారణంగా సోషల్ మీడియా వినియోగం రోజురోజుకి పెరిగిపోయింది. సరైన అవగాహన ఉన్నవారు మనీ ఎర్నింగ్ కోసం ఫేస్‌బుక్‌ను ఓ వేదికగా మార్చుకుంటున్నారు. అదే సమయంలో మరికొందురు రెచ్చగొడుతూ హింసను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్లను భారీగా తొలగించామంటూ ఇటీవల ఫేస్బుక్ స్పోక్ పర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 16 నుంచి జులై 31 మధ్య కాలంలో 25.6 మిలియన్ల ఇమేజ్ కంటెంట్, హింసను రెచ్చగొట్టేలా ఉన్న 3.5 మిలియన్ల గ్రాఫికల్ ఇమేజెస్‌పై, 2.6 మిలియన్ల అడల్ట్ కంటెంట్ ఉన్న ఇమేజెస్‌లను తొలగించినట్లు తెలిపారు. వీటితో పాటు 1లక్షా 23,400 హరాస్ మెంట్ కంటెంట్ ఉన్న అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు,1504 రిపోర్ట్‌ల ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. ఫేస్బుక్కే కాదు.. ఇన్ స్టాగ్రామ్ లో కూడా.. ఫేస్బుక్కే కాదు..ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ యాజమాన్యం వెల్లడించింది. 1.1 మిలియన్ల హింసాత్మక పోస్ట్‌లు, 8,11,000 వేల సూసైడ్, సెల్ఫ్ ఇంజూరీ ఇమేజ్ కంటెంట్ లపై చర్యలకు ఉపక్రమించింది. జూన్ 16 నుంచి జులై 31 వరకు 265 అకౌంట్లపై యూజర్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వాట్సాప్ లో సైతం ఫేస్బుక్ కు చెందిన మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్‌లో జూన్ 16 నుంచి జులై 31 వరకు 3 మిలియన్ కంటే ఎక్కువ అకౌంట్లును తొలగించింది. ఇదే సమయంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు 36,934 ఫిర్యాదులు అందగా..95,680 ఇమేజెస్‌ను తొలగించింది. చదవండి: ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్ వెహికల్‌ను సొంతం చేసుకోవచ్చు! -
ఫేస్బుక్ సమర్పించు.. వరల్డ్రూమ్
కరోనా భయం నీడలా వెంటాడుతూనే ఉన్న నేపథ్యంలో ప్రముఖ సంస్థలు కొన్ని ‘ఫిజికల్ వర్క్‌స్పేస్ ముఖ్యం కాదు’ అంటున్నాయి. ‘వర్చువల్ మీటింగ్’కు జై కొడుతున్నాయి. వర్చువల్ మీటింగ్ సాఫ్ట్వేర్లకు మంచి మార్కెట్ ఉన్న ఇలాంటి సమయంలో ‘నేనున్నానని’ అంటూ హరైజన్ వర్క్‌రూమ్స్ బీటాతో ముందుకు వచ్చింది బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్. చాలా కాలంగా వీఆర్ (వర్చువల్ రియాలిటీ) –ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ) మీద దృష్టి పెట్టిన ఫేస్‌బుక్‌కు ‘హరైజన్ రూమ్స్’ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా మారింది. ‘ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితం చూపించాలనేది మా ప్రయత్నం’ అంటున్నాడు సీయివో మార్క్ జుకర్ బర్గ్. హరైజన్ వర్క్‌రూమ్స్ ఉపయోగించడానికి ‘వర్క్‌రూమ్’ ఎకౌంట్‌తో పాటు ఓకులస్ క్వెస్ట్ హెడ్సెట్ తప్పనిసరి. అవతార్ వెర్షన్లో గ్రూప్ మీటింగ్‌లు నిర్వహించుకోవచ్చు. ఎక్కడో ఉన్నవారితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నట్లు కాకుండా అందరూ ఒకేచోట, ఒకేగదిలో ఉన్నట్లుగా ఉంటుంది. జర్నలిస్ట్ ఎలెక్స్ హీత్ హరైజన్ రూమ్స్ గురించి ఇలా అంటున్నారు... ‘మార్క్ జుకర్‌బర్గ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు హాజరయ్యాను. అయితే ఇది వీఆర్ కాన్ఫరెన్స్. యు–ఆకారంలోని టేబుల్ చుట్టూ నాతో పాటు ఎందరో రిపోర్టర్లు కూర్చున్నారు. జుకర్‌బర్గ్ అవతార్ మా ముందు ప్రత్యక్షమయ్యాడు. హరైజన్ వర్క్‌రూమ్స్ న్యూ యాప్‌ను పరిచయం చేశాడు. అందరం ఒకేదగ్గర, ఒకే చోట ఉన్నట్లుగా అనిపించింది. ఇదొక అద్భుతమైన అనుభవం. వీఆర్ ఎక్స్పీరియన్స్ కిక్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో వీఆర్ ప్రేమికులను మాత్రమే కాదు దాని గురించి అంతగా తెలియని వారిని కూడా ఈ సాఫ్ట్వేర్ ఆకట్టుకుంటుంది’ ‘ప్రపంచంలో ఆ మూల ఒకరు, ఈ మూల ఒకరు ఉండవచ్చు. ఎక్కడెక్కడో ఉన్న అందరినీ ఒకే రూమ్‌లోకి తీసుకువస్తున్నాం. ఇది సృజనాత్మక ఆలోచనలకు విశాలమైన వేదిక. ప్రయోగాల కేంద్రం’ అంటుంది ఫేస్బుక్ ప్రచార వీడియో.‘ఏ ప్లేస్ టు ట్రై సమ్‌థింగ్ న్యూ’ అని నొక్కి వక్కాణిస్తుంది. ఆ కొత్తదనం అనుభవంలోకి రావడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుందేమోగానీ... హరైజన్ వర్క్రూమ్స్పై చాలా అంచనాలే ఉన్నాయి. స్పెషియల్ హలిగ్రాఫిక్ కొలబొరేషన్ ప్లాట్‌ఫా మ్కు ఇది ఏ రకంగా భిన్నమైనదో వేచిచూద్దాం. మెటవర్స్ అంటే? జుకర్‌బర్గ్ మాటల్లో ‘మెటవర్స్’ ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇంతకీ ఏమిటీ మెటవర్స్? స్థూలంగా చెప్పాలంటే... కలెక్టివ్ వర్చువల్ షేర్డ్ స్పేస్. నీల్ స్టీఫెన్సన్ తన సైన్స్–ఫిక్షన్ నవల ‘స్నో క్రాష్’లో ఈ పదాన్ని ఉపయోగించారు. ఈ నవలలో మనుషులు ‘అవతార్’ల ఆకారంలో ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతుంటారు. గ్రీకు పదం ‘మెటా’ (అవతలి వైపు)కు ప్రత్యామ్నాయం మెటవర్స్. ఇక ఫేస్బుక్ విషయానికి వస్తే... మెటవర్స్కు కంటెంట్ సర్వీసెస్, ఇంటర్‌ఛేంజ్ టూల్స్, స్టాండర్డ్స్, వర్చువల్ ప్లాట్‌ఫామ్స్, నెట్వర్కింగ్ కంప్యూట్, హార్డ్‌వేర్... అనేవి మూలస్తంభాలు. చదవండి : గాడ్జెట్స్ మార్కెట్ జోరు,ఎక్కువగా ఏం కొంటున్నారంటే? -
ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్..
మనం ఫోన్ తో చేసే వాయిస్ కాల్, వీడియోకాల్‌ను ఇకపై ఫేస్ బుక్ నుంచి చేసే అవకాశం ఉంది. ఎస్. ఫేస్ బుక్ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఆ సంస్థ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా యుజర్లను మరింత అట్రాక్ట్ చేసేందుకు వాయిస్ - వీడియా కాలింగ్ ఆప్షన్ పై వర్క్ చేస్తున్నారని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. వాస్తవానికి ఈ ఫీచర్‌ను ఫేస్బుక్..'ఫేస్బుక్ మెసేంజర్'కు అటాచ్ చేసింది. దీంతో యూజర్లు వీడియో కాలింగ్ చేసుకోవాలంటే ఫేస్బుక్ మెయిన్ పేజ్‌ను క్లోజ్ చేసి మెసేంజర్‌లోకి వెళ్లేవారు. అలా వెళ్లడం వల్ల యూజర్లు ఫేస్బుక్ ను వినియోగించడం తగ్గిస్తున్నారని మార్క్ జూకర్ బెర్గ్ గుర్తించారు. అయితే అప్పటి వరకు ఒకటిగా ఉన్న ఫేస్ బుక్ ను - ఫేస్ బుక్ మెసెంజర్ ను 2014లో వేరు చేశారు. వాయిస్ - వీడియో కాలింగ్ ఆప్షన్ ను ఫేస్ బుక్ మెసెంజర్‌కు జోడించారు. ఇప్పుడు మళ్లీ ఇదే ఫీచర్ ను ఫేస్బుక్ డెవలప్ చేసే పనిలో పడిందని బ్లూమ్ బెర్గ్ తన కథనంలో ప్రస్తావించింది.త్వరలో ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని పేర్కొంది. -
అదిరిపోయే టెక్నాలజీని ఎంతమంది వినియోగించుకోవచ్చో తెలుసా?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో అదిరిపోయే టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. హారిజోన్ వర్క్ రూమ్ అని పిలిచే ఈ వర్చువల్ రియాలిటీ యాప్ ఎలా పనిచేస్తుందనే అంశంపై కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భవిష్యత్ 'మెటావర్స్' : మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ మాట్లాడుతూ.. తాము డెవలప్ చేస్తున్న హారిజోన్ వర్క్ రూమ్ యాప్ ఫ్యూచర్ 'మెటావర్స్' అని కామెంట్ చేశారు. మెటావర్స్ అంటే వర్చువల్ రియాలిటీ స్పేస్. ఇది కంప్యూటర్ జనరేటెడ్ ఎన్విరాన్ మెంట్‌ను క్రియేట్ చేస్తుంది. మీరు ఎక్కడో ఉన్నా ఒకే రూమ్‌లో ఎదురెదుగా ఉన్నారనే ఫీలింగ్‌ను కలిగిస్తుంది. ప్రస్తుతం ఫేస్బుక్ బిల్డ్ చేస్తున్న ఈ యాప్‌ను ఓకులస్ క్వెస్ట్ 2 హెడ్సెట్ (Oculus Quest 2 headset) వినియోగదారులు ఉచితంగా వినియోగించుకోవచ్చని ఫేస్బుక్ ప్రతినిధులు చెబుతున్నారు. ఎంత మంది వినియోగించుకోవచ్చు రాయిటర్స్ ప్రకారం..ఫేస్బుక్ సంస్థ ఇంటర్నల్‌గా జరిపే మీటింగ్‌లో ఈ హారిజన్ వర్క్ రూమ్‌ను వినియోగిస్తుంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ రియాలిటీ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ బోస్వర్త్ మాట్లాడుతూ..క్వెస్ట్ 2 హెడ్సెట్ల సాయంతో వర్చువల్ రియాలిటీలో జరిగే వీడియో కాన్ఫిరెన్స్‌లో 16 మంది నుంచి 50 మంది వరకు పాల్గొనవచ్చని తెలిపారు. చదవండి : మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి..! -
Donald Trump: పంతం నెగ్గించుకున్న ట్రంప్..
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతగా ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం ట్రంప్ అనుచరులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అమెరికా పార్లమెంట్ భవనంపై దాడి చేసేలా ట్రంప్ తన మద్దతుదారుల్ని ఉసిగొలిపినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దూసుకెళ్లి రిపబ్లిక్ పార్టీ జెండాలు ఊపుతూ ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున అక్కడి చేరిన ట్రంప్ మద్దదారులను పోలీసుల అదుపు చేయడనాకి ప్రయత్నించారు. కానీ ట్రంప్ అనుచరులు పోలీసులపై దాడి చేయడానికి యత్నించటంతో హింసాత్మక అల్లర్లు చెలరేగి ఐదుగురు మరణించారు. ఈ అల్లర్లుకు పాల్పడిన 52 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డ తన మద్దతుదారులు ఇళ్లకు వెళ్లిపోవాలని ట్రంప్ తన ట్విటర్ ఖాతా వేదికగా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్ చేసిన ట్వీట్ పౌర సమాజ సమగ్రతకు వ్యతిరేకంగా ఉందని ట్విటర్ యాజమాన్యం ఆయన ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసింది.ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్ సైతం ట్రంప్ ఫేస్బుక్ అకౌంట్‌ను శాశ్వతంగా తొలగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాను కొత్తగా ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫ్లామ్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తానని ట్రంప్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్రంప్ ఫేస్బుక్, ట్విటర్ తరహాలో తాను కూడా సొంతంగా ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రూపొందించుకున్నారు. ట్విటర్ తరహాలో www.DonaldJTrump.com/desk URL పేరుతో రూపొందిచిన ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్రంప్ తన అభిప్రాయాల్ని ప్రజలతో పంచుకుంటారు. ఇక ఆయన ఒక్కరే దానిలో తన అభిప్రాయాలను వ్యక్తం చేసే విధంగా ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ‘అమెరికాను మళ్లీ గొప్పగా మార్చాలని మేము నమ్ముతున్నాము’ అనే నినాదం, ‘సేవ్ అమెరికా’ పేరుతో కనిపిస్తున్న ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోగో డిజైన్ అందరిని ఆకర్షిస్తోంది. చదవండి: లండన్‌లో బ్లింకెన్‌తో జై శంకర్ భేటీ -
జుకర్‌బర్గ్‌ను దాటేసిన ఎలన్ మస్క్?
న్యూయార్క్: ఆధునిక సాంకేతికతో ఎలక్ట్రిక్ కార్లను రూపొందించే టెస్లా ఇంక్ షేరుకి ఎస్అండ్పీ-500 ఇండెక్సులో చోటు దక్కనుంది. డిసెంబర్ 21 నుంచి టెస్లా షేరుకి చోటు కల్పిస్తున్నట్లు సోమవారం సాయంత్రం ఎస్అండ్పీ డోజోన్స్ ఇండెక్స్ పేర్కొంది. మార్కెట్లు ముగిశాక ఈ వార్త వెల్లడికావడంతో టెస్లా ఇంక్ షేరు ఫ్యూచర్స్‌లో ఏకంగా 14 శాతంపైగా దూసుకెళ్లింది. 408 డాలర్ల నుంచి 462 డాలర్లకు ఎగసింది. దీంతో కంపెనీలో 20 శాతం వాటా కలిగిన సీఈవో ఎలన్ మస్క్ సంపద 117.5 బిలియన్ డాలర్లను తాకింది. ఫలితంగా వ్యక్తిగత సంపద విషయంలో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఎలన్ అధిగమించనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. వెరసి సాంకేతికంగా ప్రపంచ కుబేరుల్లో మూడో ర్యాంకుకు చేరినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది(2020) టెస్లా ఇంక్ షేరు 450 శాతం ర్యాలీ చేయడంతో ఇప్పటికే మస్క్ సంపదకు 90 బిలియన్ డాలర్లు జమ అయ్యింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 387 బిలియన్ డాలర్లను తాకింది. చదవండి: (ఇండియాకు మోడర్నా వ్యాక్సిన్) ఇతర విశేషాలు సోమవారం కోవిడ్-19 లక్షణాలు స్వల్పంగా కనిపిస్తున్నట్లు ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో మస్క్ ఏర్పాటు చేసిన రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్.. నలుగురు అంతరిక్ష యాత్రికుల(ఆస్ట్రోనాట్స్)ను స్పేస్ స్టేషన్లోకి పంపినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోపక్క ఇండెక్సులో టెస్లా ఇంక్‌కు చోటు కల్పిస్తున్నట్లు ఎస్అండ్పీ-500 తాజాగా వెల్లడించింది. దీంతో మస్క్ వ్యక్తిగత సంపద భారీగా బలపడటం విశేషం! చదవండి: (వ్యాక్సిన్ ఆశలు- యూఎస్ కొత్త రికార్డ్స్) ఇండెక్స్‌లో చేరితే.. భారీ మార్కెట్ విలువ కలిగిన టెస్లా ఇంక్ ఎస్అండ్పీ-500 ఇండెక్సులో చేరడం ద్వారా యూఎస్ ఇండెక్స్ ఫండ్స్ పెట్టుబడి ప్రణాళికల్లో సవరణలు చోటుచేసుకోనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కంపెనీకున్న వెయిటేజీ రీత్యా 51 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇతర కౌంటర్ల నుంచి టెస్లా వైపునకు మళ్లే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎస్అండ్పీ ఇండెక్సులో చేరడం ద్వారా టెస్లా ఇంక్ అధికారికంగా బ్లూచిప్‌గా మారనున్నట్లు వ్యాఖ్యానించారు. ఏదైనా కంపెనీ ప్రామాణిక ఇండెక్సులో చోటు సాధించాలంటే.. కనీసం 8.2 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉండాలి. అధిక లిక్విడిటీతో ప్రజల వద్ద 50 శాతం వాటా(పబ్లిక్ ఫ్లోట్) ఉండాలి. అంతేకాకుండా గత నాలుగు త్రైమాసికాలుగా లాభాలు ఆర్జిస్తూ ఉండాలని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. -
యూఎస్ ఎన్నికలకు ఫేస్బుక్ భారీ విరాళం!
వాషింగ్టన్: ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిస్సిల్లా చాన్ నవంబర్‌లో జరిగే యూఎస్ ఎన్నికలకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడానికి విరాళాలు ప్రకటించారు. ఇదివరకే కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారులకు అందులో విధుల నిర్వహించనున్నవారికి పీపీఈ కిట్ల కోసం 300 మిలియన్ల డాలర్లను ఇచ్చారు. దీనికి తోడు ఇప్పుడు మరో 100 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు జుకర్‌బర్గ్ జంట మంగళవారం ప్రకటించింది. ‘ఎన్నికల అధికారుల నుంచి మేం ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందన వచ్చింది. అందుకే ఈరోజు మన సెంటర్ ఫర్ టెక్ అండ్ సివిక్ లైఫ్‌కు అదనంగా 100 మిలియన్ డాలర్లను ఇస్తున్నాం’ అని జుకర్‌బర్గ్ ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు, 2,100 మందికి పైగా సిటిసిఎల్‌కు దరఖాస్తులను సమర్పించారు అని జుకర్‌బర్గ్ రాశారు. సిటిసిఎల్ చికాగోకు చెందిన లాభాపేక్షలేని ఒక సంస్థ. ఇది అమెరికా ఎన్నికలను ఆధునీకరించడానికి ప్రయత్నిస్తోంది. అయితే కొన్ని సంస్థలు తాము పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నమన్న కారణాన్ని చూపి నిధుల వినియోగాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయని, తమ సంస్థ పక్షపాత ఎజెండాను కలిగిలేదని స్పష్టం చేశారు. చదవండి: ఫేస్బుక్, ఇన్‌స్టా యూజర్లకు శుభవార్త -
జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్ మళ్లీ లేఖ
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ మరోసారి లేఖ రాసింది. సంస్థకు చెందిన భారతీయ విభాగం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ పదేపదే వస్తున్న ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ఆ సంస్థ సీఈవో జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించింది. ఫేస్బుక్ ఉద్యోగులు, అధికార బీజేపీ మధ్య సంబంధాలున్నాయన్న ఆరోపణలపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఈ విషయం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇదే అంశంలో ఆగస్టు 17వ తేదీన కూడా జుకర్‌బర్గ్‌కు లేఖ రాసిన విషయం గుర్తు చేశారు. కొందరు బీజేపీ నేతల విద్వేష పూరిత ప్రసంగాల విషయంలో నిబంధనలను ఫేస్బుక్ వర్తింపజేయలేదంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన కథనంపై దర్యాప్తు చేయించాలంటూ అప్పట్లో కోరామన్నారు. ‘ఆగస్టు 27వ తేదీన టైమ్ మ్యాగజీన్లో వచ్చిన తాజా కథనంలో ఫేస్బుక్ ఇండియా– అధికార బీజేపీ మధ్య క్విడ్–ప్రొ–కో లింకులున్నాయన్న ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారంతోపాటు ఆధారాలు కూడా ఉన్నాయి. 17వ తేదీన మేం రాసిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకున్నదీ వివరంగా తెలపాలని తాజా లేఖలో ఫేస్‌బుక్‌ను కోరాం’అని వేణుగోపాల్ వివరించారు. కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా, ఏఐసీసీ డేటా అనలిస్టిక్స్ విభాగం చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. పార్లమెంటరీ కమిటీ సూచించే చర్యలను ఫేస్బుక్ అమలు పరిచే వరకు, విచారణ పూర్తయ్యేవరకు ఫేస్బుక్ ‘పేమెంట్ ఆపరేషన్స్’కు అనుమతి ఇవ్వరాదన్నారు. భారత విభాగం ఉద్యోగులపై చేపట్టిన దర్యాప్తులో తేలిన విషయాలను ఫేస్బుక్ బహిర్గతం చేయాలని కూడా వారు కోరారు. టైమ్ మ్యాగజీన్ కథనంతో బీజేపీ–వాట్సాప్ సంబంధాలు మరోసారి బయటపడ్డాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘వాట్సాప్‌కు 40 కోట్ల మంది భారతీయ వినియోగదారులున్నారు. ఈ యాప్ కూడా చెల్లింపుల వేదికగా మారాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు మోదీ ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుంది. ఇదే అదనుగా వాట్సాప్పైనా బీజేపీ అదుపు సాధించింది’అని ట్విట్టర్లో రాహుల్ పేర్కొన్నారు. టైమ్ మ్యాగజీన్ కథనాన్ని జత పరిచారు. -
ఇకపై ఫేస్బుక్లో వార్తలు
శాన్ఫ్రాన్సిస్కో: ఇకపై ఫేస్బుక్లో మిత్రులు, బంధువుల పోస్టులతో పాటు వార్తలు సైతం కనిపిస్తాయి. ఫేస్బుక్ అధికారికంగా తెస్తున్న ఈ వార్తలను ప్రత్యేక ఫీడ్ (ట్యాబ్)లో ఉంచనుంది. వార్తలను వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన పబ్లిషర్ న్యూస్ కార్ప్ నుంచి వచ్చేలా చర్యలు తీసుకోనుంది. రానున్న కొద్ది వారాల్లో దీనికి సంబంధించిన అప్డేట్ రానుంది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ కో ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. జర్నలిజం విలువను గుర్తించినందుకు ఫేస్‌బుక్‌కు క్రెడిట్ దక్కుతుందని న్యూస్ కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ థామ్సన్ అన్నారు. ఈ వార్తాసంస్థతో ఉన్న ఒప్పంద విలువ మాత్రం బయటకు రాలేదు. ఫీడ్‌లో ఏ వార్తలు టాప్‌లో ఉండాలో ఒక బృందం నిర్ణయిస్తుంది. ఇటీవలి కాలంలో ఫేస్బుక్లో ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతూ పలువురి ప్రాణాలు బలిగొంటున్న సంగతి తెలిసిందే. ఇటువంటి ఫేక్ న్యూస్‌ను అధికారిక వార్తా సంస్థల ద్వారా వచ్చే వార్తలతో అడ్డుకట్ట వేయవచ్చని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాల ధాటికి వార్తా సంస్థలకు వినియోగదారులు రోజురోజుకూ కొంత తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సమస్యలకు ఇది పరిష్కారమార్గమని కూడా నిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్లో యూజర్ ఇంటరెస్ట్ ఆధారంగానే పలు పోస్టులు వచ్చినట్లు.. యూజర్ ఇంటరెస్ట్ ఆధారంగానే వార్తలు కూడా ప్రత్యేక ఫీడ్(ట్యాబ్)లో కనిపించనున్నాయి. -
రాజీనామా చేయను
వాషింగ్టన్: ఫేస్‌బుక్‌కు తాను రాజీనామా చేయనని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మంగళవారం మరోసారి స్పష్టం చేశారు. ఫేస్బుక్ సీవోవో (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) షెరిల్ శాండ్బర్గ్ను కూడా ఆయన వెనకేసుకొచ్చారు. ‘ఈ కంపెనీకి షెరిల్ ఎంతో కీలకమైన వ్యక్తి. మాకున్న ఎన్నో సమస్యలను ఆమె మోస్తున్నారు. వాటిని పరిష్కరించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు’ అని జుకర్‌బర్గ్ అన్నారు. గత దశాబ్దకాలంగా ఆమెతో కలిసి తాను పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాననీ, మరికొన్ని దశాబ్దాలపాటు తామిద్దరం కలిసే పనిచేస్తామని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం అంశం మొదలుకుని ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్‌కు నిత్యం ఏదో ఒక సమస్య వచ్చిపడుతుండటం తెలిసిందే. నకిలీ వార్తలు, వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం, నిబంధలన ఉల్లంఘనలకు జరిమానాలు ఎదుర్కోవడం తదితర సమస్యలతో ఫేస్బుక్ సతమతమవుతోంది. అయితే వారం రోజుల క్రితం న్యూయార్క్ టైమ్స్ పత్రిక భారీ కథనం రాస్తూ ఫేస్బుక్ తమ ప్రత్యర్థి కంపెనీలపై బురదజల్లేందుకు వాషింగ్టన్కు చెందిన ఓ ప్రజా సంబంధాల కంపెనీని నియమించుకుందని వెల్లడించింది. ప్రత్యర్థి కంపెనీలకు వ్యతిరేకంగా ఆ సంస్థ కథనాలు రాయించి ప్రాచుర్యంలోకి తెచ్చిందంది. ఈ కంపెనీకి రిపబ్లికన్ పార్టీతో సంబంధాలున్నాయని తెలిపింది. అలాగే అమెరికా ఎన్నికల్లో ఫేస్బుక్ ద్వారా రష్యా జోక్యానికి సంబంధించి ఆ సంస్థకు ముందే సమాచారం ఉన్నా తగిన రీతిలో స్పందించలేదని ఆరోపించింది. ఫేస్బుక్ పెద్దలు ఆలస్యంగా స్పందించారనీ, నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అవన్నీ అబద్ధాలే: జుకర్‌బర్గ్, షెరిల్ జుకర్‌బర్గ్, శాండ్బర్గ్లు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఖండించారు. వాషింగ్టన్ కంపె నీని ఫేస్బుక్ నియమించుకున్న సమాచారమే తమకు తెలీదనీ, ఆ పత్రికలో కథనం చదివిన తర్వాతనే తెలుసుకున్నామని వారిద్దరు చెప్పారు. ఇప్పుడు ఆ కంపెనీతో తమ సంస్థ సంబంధాలను రద్దు చేసుకుందని తెలిపారు. అలాగే రష్యా జోక్యం గురించి కూడా తమకు ముం దుగా తెలీదనీ, అంతా తెలి సినా మౌనంగా ఉన్నామనడం సరికా దని చెప్పారు. జుకర్‌బర్గ్ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలని కొంతకాలంగా ఆ సంస్థ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. కొత్త ఫీచర్ ‘యువర్ టైమ్’ ఫేస్బుక్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పనులు మానుకుని గంటల తరబడి ఫేస్‌బుక్‌కు అతుక్కుపోయే చాలా మందికి ఇది ఉపయోగడనుంది. ఫేస్‌బుక్‌ను మీరు ఎంతసేపు వాడుతున్నారో రోజువారీ, వారం వారీ లెక్కలను ఈ కొత్త ఫీచర్ మీకు తెలియజేస్తుంది. అంతేకాదు.. రోజుకు ఎంతసేపు మీరు ఫేస్‌బుక్‌ను వాడాలనుకుంటున్నారో ముందే నిర్ణయించి ఆ విధంగా సెట్టింగ్స్‌ను మార్చుకుంటే.. ఆ సమయం పూర్తి కాగానే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం ఫేస్‌బుక్‌ను బ్రౌజ్ చేస్తున్నారంటూ మీకు హెచ్చరికలు కూడా వస్తాయి. ఈ కొత్త ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకునేందుకు ఫేస్బుక్ యాప్‌లో ‘సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ’లోకి వెళితే ‘యువర్ టైమ్ ఆన్ ఫేస్బుక్’ అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను ఎంచుకుంటే మీరు ఫేస్బుక్లో ఇప్పటివరకు గడిపిన సమయం కనిపించడంతోపాటు, రోజూ ఎంతసేపు బ్రౌజ్ చేయాలనుకుంటే అంత సమయం సెట్ చేసుకోవచ్చు. ఏ రోజైనా మీరు అంత కన్నా ఎక్కువ సమయం ఫేస్‌బుక్‌పై గడుపుతున్నట్లయితే వెంటనే మీకు ఫేస్బుక్ నుంచి హెచ్చరికలు వస్తాయి. -
జుకర్‌బర్గ్‌కు భారీగా పెరిగిన పరిహారాలు
డేటా చోరి ఉదంతంపై ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ పరిహారాలు భారీగా పెరిగినట్టు తెలిసింది. గతేడాది జుకర్‌బర్గ్ పరిహారాలు 53.5 శాతం పెరిగి 8.9 మిలియన్ డాలర్లుగా నమోదైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ శుక్రవారం పేర్కొంది. దీనిలో ఎక్కువ ఆయన వ్యక్తిగత సెక్యురిటీకి వెచ్చించిన వ్యయాలే ఉన్నాయి. 83 శాతం పరిహారాలు సెక్యురిటీకి సంబంధించిన ఖర్చులని, మిగతా మొత్తం జుకర్‌బర్గ్ వ్యక్తిగతంగా వాడుకున్న ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఖర్చులు ఉన్నాయని కంపెనీ తెలిపింది. గతేడాది జుకర్‌బర్గ్ ఎక్కువ సమయం ట్రావెలింగ్‌కే వెచ్చించారని, అమెరికాలోని అన్ని రాష్ట్రాలను ఆయన చుట్టిముట్టేశారని పేర్కొంది. సెక్యురిటీ వ్యయాలు అంతకముందు 4.9 మిలియన్ డాలర్లుంటే, 2017లో 7.3 మిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే ఫేస్బుక్ సీఈవో బేస్ శాలరీలో ఎలాంటి మార్పు లేదు. ఆయన బేస్ శాలరీ 1 డాలర్‌గానే ఉంది. అదేవిధంగా కంపెనీలో ఆయన ఓటింగ్ అధికారాలు కూడా 59.9 శాతం పెరిగాయి. చైర్మన్‌గా, సీఈవోగా, వ్యవస్థాపకుడిగా ఉన్న ఆయన భద్రత విషయంలో పలు ముప్పులు ఉంటాయని, ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్‌కు వ్యక్తిగత సెక్యురిటీకి ఎక్కువగా వెచ్చించినట్టు ఫేస్బుక్ బోర్డ్ పరిహారాల కమిటీ తెలిపింది. గత రెండేళ్ల నుంచి ఫేస్బుక్ అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఆదాయాలనే ఆర్జిస్తోంది. కానీ ఇటీవల కేంబ్రిడ్జ్ అనలిటికాతో ఫేస్బుక్ యూజర్ల డేటాను కంపెనీ అక్రమంగా పంచుకుందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా ఢమాల్‌మన్నాయి. ఈ విషయంపై వివరణ ఇవ్వడానికి జుకర్‌బర్గ్ అమెరికన్ కాంగ్రెస్ ముందుకు కూడా వచ్చారు. -
ఫేస్బుక్ సీఈవోకి చుక్కలు చూపించారు!
కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా చోరి ఉదంతంపై తొలి రోజు ఎక్కడా తడబాటు, కంగారు లేకుండా.. చాలా కూల్‌గా, కామ్‌గా అంతకు మించి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ సమాధానాలు చెప్పిన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు, రెండో రోజు అమెరికన్ సెనేటర్లు చుక్కలు చూపించారు. మొదటి రోజుతో పోలిస్తే, రెండో రోజు కఠినతరమైన ప్రశ్నలతో జుకర్‌బర్గ్‌ను గుక్క తిప్పుకోనివ్వలేదు. కంపెనీ డేటా సేకరణ అంశాలపై సెనేటర్లు సమాధానం చెప్పలేని ప్రశ్నలనే సంధించారు. ఒకానొక దశలో జుకర్‌బర్గ్ తీవ్ర అసహనానికి కూడా గురయ్యారు. వినియోగదారుల గోప్యతకు మించి పలు అంశాలపై కూడా ఆయన్ని ప్రశ్నించారు. బుధవారం హౌజ్ ఎనర్జీ, కామర్స్ కమిటీ ముందు హాజరైన జుకర్‌బర్గ్‌కు దాదాపు ఐదు గంటల పాటు చట్టసభ్యులు ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. మొత్తంగా రెండో రోజులు 100 మంది చట్టసభ్యులు 10 గంటల పాటు జుకర్‌బర్గ్‌ను విచారించినట్టు తెలిసింది. కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా స్కాండల్‌పై అమెరికన్ కాంగ్రెస్ జరిపిన తుది విచారణ ఇంతటితో ముగిసింది. ఈ విచారణలో కూడా జుకర్‌బర్గ్ పదే పదే తాను పెద్ద తప్పు చేశానని ఒప్పుకున్నారు. కానీ ఇలాంటి సమాధానం ఇచ్చే ఛాన్స్ మళ్లీ ఇవ్వకుండా కేవలం ‘యస్’ లేదా ‘నో’ రూపంలో మాత్రమే సమాధానం చెప్పేలా న్యూజెర్సీకి చెందిన డెమొక్రాటిక్ ప్రతినిధి ఫ్రాంక్ పలోన్ ప్రశ్నలు సంధించారు. డేటా సేకరణను తగ్గించడానికి ఏమైనా డీఫాల్ట్ సెట్టింగ్స్‌ను ఫేస్బుక్ మార్చడానికి సిద్ధంగా ఉందా? అనే ప్రశ్న పలోన్ అడిగారు. కానీ ఇది చాలా క్లిష్టమైన అంశమని, కేవలం ఒక్క పదంతో సమాధానం చెప్పలేమని జుకర్‌బర్గ్ అన్నారు. దీంతో మీ సమాధానం తమల్ని నిరాశకు గురిచేసిందని పలోన్ అన్నారు. 2011లో ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఫేస్బుక్ డేటా పాలసీ, థర్డ్ పార్టీ యాప్స్‌తో కలిసి ఉల్లంఘిస్తుందనే అంశంపై పలువురు చట్టసభ్యులు ప్రశ్నలు సంధించారు. ఒకవేళ అలా చేస్తే, భారీ మొత్తంలో జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ ప్లాట్‌ఫామ్‌పై అక్రమంగా ఒపియాడ్స్‌ను విక్రయించుకునేందుకు అనుమతి ఇస్తూ... యూజర్లను ఫేస్బుక్ బాధపరుస్తుందని ఓ చట్టసభ్యుడు మండిపడ్డారు. ఇప్పటి వరకు జుకర్‌బర్గ్ చెప్పిన క్షమాపణల లెక్కలు తీసిన ఇల్లినాయిస్కు చెందిన ఓ డెమొక్రాట్, తమ స్వీయ నియంత్రణ సంస్థ పనిచేయడం లేదనడానికి ఇదే రుజువు అని చురకలు అంటించారు. యూజర్లు కానీ వారి డేటాను కూడా ఫేస్బుక్ షాడో ప్రొఫైల్స్‌తో సేకరిస్తుందంటూ డెమొక్రాటిక్ సహోద్యోగి, న్యూ మెక్సికో ప్రతినిధి బెన్ లుజాన్ ఆరోపించారు. ఇలా కేంబ్రిడ్జ్ అనలిటికాతో ఫేస్బుక్ షేర్చేసిన 8.7 కోట్ల మంది డేటా ఉదంతంపై చట్టసభ్యులు ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధించారు. కానీ సమయం తక్కువగా ఉండటంతో ఒక్కొక్క చట్టసభ్యునికి కేవలం 5 నిమిషాలు సమయం మాత్రమే కేటాయించారు. -
ఫేస్బుక్ సీఈఓపై జోకులే జోకులు..
డేటా చోరిపై అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చిన ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు జవాబులు చెప్పడం చాలా కష్టమైంది. 44 మంది సెనేటర్లు దాదాపు 5 గంటలకు పైగా జుకర్‌బర్గ్‌కు వందల కొద్దీ ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో ఎదురైన పరిణామాలపై సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వస్తోంది. జుకర్‌బర్గ్ ఓ రోబో అని అందుకు ఆయన నేడు సెనేటర్లను ఎదుర్కొన్న తీరే అందుకు నిదర్శనమని పోస్టులు చేస్తున్నారు. సాధారణంగా ఎక్కడైనా కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో టీ షర్ట్, జీన్స్ ధరించే జుకర్‌బర్గ్ బుధవారం మాత్రం అధికారిక సమావేశాల్లో పాల్గొనే వ్యక్తిగా దర్శనమిచ్చారు. సెనెటర్లు ప్రశ్నల మీద ప్రశ్నలు అడగగా చాలా వాటికి మౌనం వహించిన జుకర్‌బర్గ్.. చివరికి తన వ్యక్తిగత సమాచారాన్ని చెప్పడానికి నిరాకరించారు. పలు పర్యాయాలు క్షమాపణ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. జుకర్‌బర్గ్ హావభావాలను గమనించిన మైక్ టోక్స్ అనే నెటిజన్.. ఫేస్బుక్ సీఈఓ రోబో అని చెప్పడానికి నూటికి నూరుపాళ్లు అవకాశం ఉందని ట్వీట్ చేశారు.మనుషులు మామాలుగా నీళ్లు తాగుతారంటూ జుకర్‌బర్గ్ నీళ్లుతాగే విధానాన్ని జుకర్‌బర్గ్ 2020 అనే ఖాతా నుంచి ట్వీట్ చేశారు. రోబో ఓ కంపెనీకి సీఈఓ అంటూ కొందరు జోకులు పేల్చుతున్నారు. రోబోలా కనిపించటమే కాదు రోబోలా పనులు చేస్తున్నారని.. అందుకే ఫేస్బుక్ ద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని జుకర్‌బర్గ్ అమ్ముకుంటున్నారని విమర్శిస్తూ మరికొందరు ట్వీట్లు చేశారు. ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలతో జుకర్‌బర్గ్ సతమతమవుతున్నారు. దాదాపు 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు వాడారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. There is a 100% chance Mark #Zuckerberg is a robot 😂 pic.twitter.com/KkXiInctXh — Mike Tokes (@MikeTokes) 11 April 2018 humans drink water, it`s normal pic.twitter.com/OGu9NiDabA — ZUCKERBERG 2020 💭 (@davidoreilly) 10 April 2018 -
ఓ.. నో... జుకర్‌బర్గ్ ఆన్సర్
వాషింగ్టన్ : ఫేస్బుక్ డేటా చోరిపై అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చిన ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ను కాస్త సందిగ్థతలో పడేసే ప్రశ్నలే ఎదురయ్యాయి. వందల కొద్దీ ప్రశ్నలు సంధించిన అమెరికన్ చట్టసభ్యులు, వ్యక్తిగత సమాచారాన్ని జుకర్‌బర్గ్‌కు సంధించారు. గత రాత్రి ఎక్కడ నిద్ర పోయారని జుకర్‌బర్గ్‌ని సెనేటర్ డిక్ డర్బిన్ అడిగారు. ఆన్లైన్ డిజిటల్ ప్రైవసీపై విచారణ జరిపిన డర్బిన్, ఆ ప్లాట్‌ఫామ్‌పై చేరిన యూజర్ల వ్యక్తిగత సమాచార విషయంలో ఫేస్బుక్ పాత్ర ఏమిటో తెలుసుకోవడం కోసం, గత రాత్రి ఎక్కడ ఉన్నారో తెలుపడానికి మీరు సౌకర్యవంతంగానే ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. డర్బిన్ సంధించిన ప్రశ్నలకు కాస్త ఆందోళనకు గురైన జుకర్‌బర్గ్, ఎనిమిది సెకన్ల పాటు మౌనం వహించి, చివరికి తన వ్యక్తిగత సమాచారాన్ని చెప్పడానికి నిరాకరించారు. ఈ వారంలో ఎవరికైనా మెసేజ్ చేశారా? ఆ పేర్లను మీరు మాతో పంచుకోగలరా? అంటూ మరో డెమొక్రాట్ ప్రశ్నించారు. మళ్లీ కూడా జుకర్‌బర్గ్ సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడానికి జుకర్‌బర్గ్ అసలు ఆసక్తి చూపించలేదు. ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలపై జుకర్‌బర్గ్ అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చారు. దాదాపు 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు వాడారని ఆరోపణలపై ఆయన సెనేటర్లకు క్షమాపణ చెప్పారు. సెనేటర్లకు ఇచ్చిన బహిరంగ ప్రకటనలో, ఫేక్ న్యూస్, ద్వేషపూరిత ప్రసంగం, డేటా గోప్యత లేకపోవడం, 2016 ఎన్నికల్లో రష్యన్ సోషల్ మీడియా జోక్యం వంటి పలు అంశాలపై ఆయన క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు. 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారం లీక్ అయినందుకు బాధ్యత తానే అని జుకర్‌బర్గ్ ఒప్పుకున్నారు. -
కెరీర్లో తొలిసారి.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
వాషింగ్టన్ : ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన కెరీర్లో మొదటిసారి అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చారు. ఫేస్బుక్ డేటా చోరిపై ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెల్లుబుక్కుతున్న ఆగ్రహ జ్వాలలపై జుకర్‌బర్గ్ అమెరికన్ కాంగ్రెస్‌కు క్షమాపణలు చెప్పారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన జుకర్‌బర్గ్, అమెరికన్ కాంగ్రెస్ ముందు చెప్పడం ఇదే తొలిసారి. అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చిన జుకర్‌బర్గ్, చట్టసభ్యులు అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. రెండు రోజుల సమావేశ నేపథ్యంలో నేడు కూడా జుకర్‌బర్గ్ హౌజ్ ఎనర్జీ, కామర్స్ కమిటీ ముందు హాజరుకాబోతున్నారు. ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలతో ప్రస్తుతం జుకర్‌బర్గ్ అతలాకుతలమవుతున్నారు. దాదాపు 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు వాడారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెనేటర్లకు ఇచ్చిన బహిరంగ ప్రకటనలో, ఫేక్ న్యూస్, ద్వేషపూరిత ప్రసంగం, డేటా గోప్యత లేకపోవడం, 2016 ఎన్నికల్లో రష్యన్ సోషల్ మీడియా జోక్యం వంటి పలు అంశాలపై ఆయన క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు. 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారం లీక్ అయినందుకు బాధ్యత తానే అని జుకర్‌బర్గ్ ఒప్పుకున్నారు. ‘ఇది నా తప్పే. క్షమాపణలు చెబుతున్నా. ఫేస్బుక్ నేనే ప్రారంభించా. నేనే నడుపుతున్నా. కాబట్టి జరిగిన దీనికి నేనే బాధ్యత’ అంటూ పశ్చాతాపానికి గురయ్యారు. కేంబ్రిడ్జ్ అనలిటికా కూడా దీనిపై ఓ ట్వీట్ చేసింది. ఫేస్‌బుక్‌ను తాము హ్యాక్ చేయలేదని లేదా చట్టాలనూ ఉల్లంఘించలేదని పేర్కొంది. ఫేస్బుక్ అందించిన టూల్ ద్వారానే అమెరికా ఎన్నికల సందర్భంగా తాము ఈ డేటాను సేకరించామని చెప్పింది. ఫేస్బుక్ గుత్తాధిపత్యంపై చట్టసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన.. తమ కంపెనీ గుత్తాధిపత్యం కలిగి ఉందని భావించవద్దని జుకర్‌బర్గ్ చట్టసభ్యులను కోరారు. అమెరికన్ యూజర్లు తమ స్నేహితులతో సంభాషించడానికి, ఎప్పడికప్పుడు అందుబాటులో ఉండటానికి సగటున ఎనిమిది యాప్స్‌ను వాడుతున్నారని, వాటిలో టెక్ట్సింగ్ యాప్స్ నుంచి ఈ-మెయిల్ వరకు ఉన్నాయన్నారు. ఎన్నికలను ప్రభావితం చేయడానికి కొంత మంది రష్యాకు చెందిన గ్రూప్‌లు సోషల్ నెట్‌వర్క్‌ను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, వారిపై తాము పోరాడుతున్నామని చెప్పారు. వారు తమ సిస్టమ్స్‌ను, ఇతర ఇంటర్నెట్ సిస్టమ్స్‌ను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. కానీ వారి బారిన పడకుండా ఉండటానికి తాము శతవిధాలా కృషిచేస్తున్నామన్నారు. అమెరికా కాంగ్రెస్ ముందుకు వచ్చిన మార్క్ జుకర్‌బర్గ్‌కు వందల కొద్దీ ప్రశ్నలను చట్టసభ్యులు సంధించారు. అమెరికా కాంగ్రెస్ హాజరయ్యే ముందు జుకర్‌బర్గ్ ఉన్న హోటల్ గదిలో ఎలా ఉందని దగ్గర్నుంచి... ఆయన మెసేజ్‌లు చేసిన స్నేహితుల వివరాల వరకూ... అన్ని విషయాలను జుకర్‌బర్గ్‌ను చట్టసభ్యులు అడిగారు. -
జుకర్‌బర్గ్ ఎదుర్కోబోయే కఠిన ప్రశ్నలివే!
వాషింగ్టన్ : ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అమెరికా కాంగ్రెస్ ముందుకు రాబోతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్‌పై స్పందించేందుకు ఆయన అమెరికా చట్ట సభ్యుల ముందుకు వస్తున్నారు. 2016 అమెరికా ఎన్నికలకు ముందుకు 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికాతో పంచుకున్నామని ఒప్పుకున్న జుకర్‌బర్గ్, కాంగ్రెస్ సభ్యుల నుంచి కఠిన ప్రశ్నలనే ఎదుర్కోబోతున్నారు. సెనేట్ జ్యుడిషియరీ, కామర్స్ కమిటీలు జుకర్‌బర్గ్‌ను మంగళవారం ప్రశ్నించనుండగా... హౌజ్ ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీ బుధవారం ఆయన్ని ప్రశ్నించనుంది. భవిష్యత్తు ప్రణాళికలపై జుకర్‌బర్గ్ నుంచి వాగ్దానాలు తీసుకోవడానికి కూడా అమెరికా చట్టసభ్యులకు ఇది ఓ అవకాశంగా మారుతోంది. వినియోగదారుల గోప్యతను, ఎన్నికల సమగ్రతను కాపాడటం కోసం కొత్త నిబంధనలను రూపొందించడానికి కూడా చట్టసభ్యులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. అయితే కాంగ్రెస్ సభ్యులకు నాలుగు విషయాల్లో ఫేస్బుక్ సీఈవో తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సి ఉందని తెలుస్తోంది. అవేమిటో ఓ సారి చూద్దాం... 2015 నుంచే కేంబ్రిడ్జ్ అనలిటికాకు యూజర్ల డేటాను షేర్ చేస్తున్నట్టు ఫేస్బుక్ ఒప్పుకుంది. కానీ ఆ సమయంలోనే ఈ సమాచారాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకురాలేదు? ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి అమెరికన్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేటప్పుడు, కంపెనీలకు ఎలాంటి సమాచారం అవసరం పడతాయి? సోషల్ నెట్‌వర్క్‌పై సమాచారం ద్వారా అమెరికన్లు మోసగించబడలేదని చెప్పడానికి భవిష్యత్తులో ఫేస్బుక్ ఏం చేయబోతోంది? అమెరికాలో పొలిటికల్ పొలరైజేషన్(రాజకీయ ధృవీకరణ)ను తగ్గించడానికి ఫేస్బుక్ ఎలా సాయపడనుంది? -
ఫేస్బుక్ నడపడానికి నేనే కరెక్ట్ వ్యక్తిని!
ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మరోసారి మీడియాతో మాట్లాడారు. గత నెలలో బయటపడిన కేంబ్రిడ్జ్ అనలిటికా-ఫేస్బుక్ స్కాండల్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడటం ఇది నాలుగో సారి. ఈ సందర్భంగా ఫేస్బుక్ సీఈవోగా తానే సరియైన వ్యక్తినని మార్క్ జుకర్‌బర్గ్ ఉద్ఘాటించారు. ఫేస్‌బుక్‌ను లీడ్ చేయడానికి మీరు సరియైన వ్యక్తేనా? అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. దీన్ని నడపడానికి తానే సరియైన వ్యక్తినని, దీన్ని నడపడానికి ఎవరూ కూడా సరితూగరని పేర్కొన్నారు. తప్పు జరిగినట్టు ఒప్పుకున్న మార్క్ జుకర్‌బర్గ్, దీన్ని లీడ్ చేసే కరెక్ట్ వ్యక్తిని తానేనన్నారు. తప్పుల నుంచే జీవితం గురించి నేర్చుకుంటామని జుకర్‌బర్గ్ తెలిపారు. ముందుకు సాగడానికి ఏం కావాలో తెలుసుకోవాలన్నారు. కాగ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్బుక్ తన యూజర్ల డేటాను అక్రమంగా కేంబ్రిడ్జ్ అనలిటికాకు చేరవేసిందనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తాయి. ఈ స్కాండల్‌పై తప్పు జరిగినట్టు మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఒప్పుకున్నారు. దీంతో ఫేస్‌బుక్‌ను నడిపేందుకు మార్క్ జుకర్‌బర్గ్ సరియైన వ్యక్తి కాదంటూ పలువురు వాదిస్తున్నారు. దీనిపై స్పందించిన ఆయన ఫేస్‌బుక్‌ను నడపడానికి తానే సరియైన వ్యక్తినని పేర్కొన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో మోస్ట్ పవర్ఫుల్ సీఈవోలతో పోలిస్తే, జుకర్‌బర్గ్ చాలా చిన్నవారు. ఫేక్‌న్యూస్, ప్రైవసీ విషయంలో గత కొన్నేళ్లుగా ఆయన పలు వివాదాస్పద ప్రకటనలు కూడా చేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ బయటపడింది. దీంతో ఫేస్బుక్ షేర్లు కూడా భారీగా కిందకి పడ్డాయి.ప్రపంచవ్యాప్తంగా పలు రెగ్యులేటర్లు ఫేస్‌బుక్‌పై విచారణ జరుపుతున్నాయి. ఫేస్బుక్ ప్రైవసీ, డేటా పాలసీలపై తమకు ఏప్రిల్ 11న వివరణ ఇవ్వాలని అమెరికా చట్టసభ్యులు మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆదేశించారు కూడా. అయితే బోర్డు నుంచి తప్పుకోవాలని తనకు ఎలాంటి కాల్స్ రాలేదని కూడా జుకర్‌బర్గ్ తెలిపారు. దీని వల్ల కంపెనీ ఎవర్ని తొలగించదని కూడా చెప్పారు. ‘నేను ఇక్కడే ప్రారంభించా. ఇక్కడే నడిపా. జరిగిన దానికే నేనే బాధ్యుడిని. తప్పు నుంచి నేర్చుకున్న పాఠాలతో మున్ముందు మరింత మెరుగ్గా నా బాధ్యతను నిర్వర్తిస్తా. కానీ ఎవరిపైనా నిందను మోపడానికి నేను సిద్ధంగా లేను’ అని జుకర్‌బర్గ్ అన్నారు. -
ఆపిల్ సీఈవో ఆరోపణలు తిప్పికొట్టిన జుకర్‌బర్గ్
ఫేస్బుక్ బిజినెస్ మోడల్‌పై ఆపిల్ సీఈవో టిమ్ కుక్ చేసిన విమర్శలను ఆ కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తిప్పికొట్టారు. తమ అడ్వర్టైజింగ్-సపోర్టెడ్ బిజినెస్ మోడల్‌ను జుకర్‌బర్గ్ సమర్థించుకున్నారు. అడ్వర్టైజింగ్-సపోర్టెడ్ బిజినెస్ మోడల్ ఒక్కటే, తమ సర్వీసులు కొనసాగించడానికి మార్గమని పేర్కొన్నారు. ‘మీరు ఏదీ చెల్లించనప్పుడు మీ మాటల్ని పట్టించుకోం. మీ మాటల్లో ఏ మాత్రం వాస్తవం లేదు’’ అని ఆగ్రహంగా పేర్కొన్నారు. ఒకవేళ తమ బిజినెస్ మోడల్ కింద యూజర్లపై ఛార్జీలను విధిస్తే, ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్‌కు చెల్లించుకోలేరని అన్నారు. ఫేస్బుక్ ఎదుర్కొనే ఒకానొక సమస్యల్లో ఇది ఆదర్శవాదమైనదేనని, ప్రజలను కనెక్ట్ చేయడంపై తాము ఫోకస్ చేసినట్టు తెలిపారు. కాగ, ఆపిల్ కంపెనీకి ఫేస్బుక్ పరిస్థితి రాదని, ఎందుకంటే కస్టమర్ డేటాను ఆధారం చేసుకుని ఆపిల్ ప్రకటనలను విక్రయించదని టిమ్ కుక్ విమర్శించారు. ఫేస్బుక్ బిజినెస్ మోడల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలను జుకర్ బర్గ్ తిప్పికొట్టారు. ఫేస్బుక్ తప్పిదాన్ని బహిరంగంగా ఒప్పుకున్న జుకర్‌బర్గ్, ప్రస్తుతం సమస్యలను తీర్చడానికి కొన్నేళ్ల సమయం పడుతుందన్నారు. ఫేస్బుక్లో లక్షలాది మంది యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలటికా అనే కంపెనీ చోరీ చేయడం, దీనిపై అన్ని వర్గాల నుంచి ఫేస్బుక్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే. డేటా లీక్‌ను హైలెట్ చేసిన జుకర్‌బర్గ్, ప్రస్తుతం యూజర్లు ప్రమాదాలు, దుష్ప్రభావాలపై ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని పేర్కొన్నారు. ఈ తప్పిదాన్ని తాము ఒప్పుకుంటున్నాం, కానీ దీన్ని పరిష్కరించడానికి కొన్ని సంవత్సరాల సమయమైతే పడుతుందని చెప్పారు. మూడు లేదా ఆరు నెలల్లో సరిచేయాలని తాము కోరుకుంటున్నామని, కానీ వాస్తవంగా ఇంతకంటే ఎక్కువ సమయమే పట్టే అవకాశముందని ఆయన అన్నారు. -
క్షమించండి: ఫేస్బుక్ సీఈవో
శాన్ఫ్రాన్సిస్కో : ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు. ప్రజలను విడదీసేలా తమ పనితీరు ఉంటే మన్నించాలని వేడుకున్నారు. శనివారం యూదుల పవిత్రదినం ‘యోమ్ కిప్పుర్’ కావడంతో ఆయన ఈమేరకు క్షమాపణ అడిగారు. పాపాలకు ప్రాయశ్చిత్తంగా ‘యోమ్ కిప్పుర్’ ను జరుపుకుంటారు. ''గత ఏడాది కాలంగా మా సోషల్ మీడియాను తీసుకుంటే, నేనేమన్నా తప్పులు చేసుంటే క్షమించగలరు. ఈ ఏడాదిలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు వేడుకుంటున్నా. మంచిగా పనిచేయడానికి కృషిచేస్తా. అందర్ని కలిపే ఉద్దేశ్యంతో కాకుండా విడదీసేలా మా పని ఉంటే మన్నించగలరు. తర్వాత సంవత్సరమంతా మేమందరూ మంచిగా పనిచేస్తాం'' అని జుకర్‌బర్గ్ తెలిపారు. అయితే ఏ విషయంలో ఆయన క్షమాపణ కోరారో స్పష్టం చేయలేదు. కాగా, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తమ ప్లాట్‌ఫామ్‌పై ఇచ్చిన రష్యా ప్రకటనల్లో ఫేస్బుక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఎన్నికల సమయంలో ఫేస్బుక్ తనకు వ్యతిరేకంగా పనిచేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ విమర్శలపై జుకర్‌బర్గ్ స్పందిస్తూ.. ‘తనకు వ్యతిరేకంగా పనిచేశామని ట్రంప్ అంటున్నారు. లిబరల్స్ మాత్రం ట్రంప్‌కు సహకరించామంటున్నారు. ఇరు వర్గాలు మా ఆలోచనలను, కంటెంట్‌ను ఇష్టపడట్లేద’ని అన్నారు. లక్ష డాలర్ల రష్యా రాజకీయ ప్రకటనలపై ఫేస్బుక్ విచారణను ఎదుర్కొంటోంది. -
అన్ని కోట్ల మంది యూజ్ చేస్తున్నారా!
న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్థ రూపొందించిన ఫేస్ బుక్ లైట్ యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు వినియోగిస్తున్నారు. నెలవారీగా ఫేస్ బుక్ యాప్ వినియోగంపై సంస్థ జరిపిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దీనిపై హర్షం వ్యక్తం చేశారు. ఈ యాప్ ను 2015 జూన్ నెలలో లాంచ్ చేశారు. 'సాధారణ ఫేస్ బుక్ యాప్ యూజ్ చేయాలంటే స్మార్ట్ ఫోన్ ర్యామ్ కాస్త ఎక్కువగా ఉండాలి. 1జీబీ కంటే తక్కువ ర్యామ్ ఉన్న స్మార్ట్ ఫోన్లు వాడే యూజర్ల ఇబ్బందులను తొలగించేందుకు సంస్థ ఫేస్ బుక్ లైట్ యాప్ ను ఆవిష్కరించింది' అని జుకర్ బర్గ్ తెలిపారు. '50 కంటే ఎక్కువ భాషలలో, లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, యూరఫ్ ఖండాలలో 150కి పైగా దేశాల నెటిజన్లు ఈ యాప్ ను యూజ్ చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ఎఫ్బీ యాప్ కంటే లైట్ యాప్ తక్కువ స్పేస్ తీసుకుంటుంది. ప్రోగ్రామర్స్ ఎంతో శ్రమించి రూపొందించిన ఫేస్ బుక్ లైట్ యాప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సులువుగా లైక్స్, షేర్లు చేయొచ్చు. తక్కువ బ్యాండ్ విడ్త్ ఇంటర్ నెట్ కలిగి ఉన్న నెటిజన్లను దృష్టిలో ఉంచుకుని చేసిన తమ ప్రయత్నానికి విశేష స్పందన వచ్చిందని' ఓ ప్రకటనలో ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ వెల్లడించారు. -
'రిస్క్ తీసుకోకపోవడంకన్నా మరో రిస్క్ లేదు'
న్యూయార్క్: ఏ వ్యాపార రంగంలో రాణించాలన్నా రిస్క్ తీసుకోవడం ముఖ్యం. ఏ రిస్క్ తీసుకోక పోవడం అన్నింటికన్నా పెద్ద రిస్క్. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పేటెండ్ డైలాగ్ ఇది. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీల్లో ఏటా పెట్టుబడులు పెట్టే 'వై కాంబినేటర్’ కంపెనీ ప్రెసిడెంట్ శ్యామ్ ఆల్ట్మేన్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కూడా ఆయన ఈ మాటనే చెప్పారు. అయితే రిస్క్ తీసుకోవడం అంటే తొందరపడి వెర్రి నిర్ణయాలు తీసుకోవడం కాదని ఆయన స్పష్టం చేశారు. వ్యాపార రంగంలో రాణించాలంటే యువతకు ఇచ్చే సలహా ఏమిటని శ్యామ్ ఆయన్ని సూటిగా ప్రశ్నించగా, ‘వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో అతిపెద్ద రిస్క్ తీసుకోకపోవడమే అన్నింటికన్నా పెద్ద రిస్క్. కంపెనీలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, మార్పులు, చేర్పులు చేయకపోతే కంపెనీ ఎదగడంలో వెనకబడి పోతుంది. అలాఅని ఉత్పత్తుల్లో తరచుగా మార్పులు తీసుకరాకూడదు. కంపెనీ గురించి దూరాలోచన చేయక పోవడం వల్ల అలాంటి మార్పులకు ఆస్కారం ఏర్పడుతుంది. ఏ కంపెనీలోనైనా తోటి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. మన కంపెనీ బాగా రాణిస్తున్నప్పుడు మార్పుల పేరిట వెర్రి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని జుకర్ బర్గ్ తెలిపారు. ఫేస్బుక్ ఇటీవల 200 కోట్ల డాలర్లకు ‘ఆకులస్’ కంపెనీని కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఫేస్‌బుక్‌కు కూడా ఆకులస్ లాంటి టాలెంట్ ఉందని, అయితే అన్ని తామే చేయాలనుకునే తత్వం కూడా మంచిది కాదని అన్నారు. అంతేకాకుండా ప్రతిసారి ఉన్న కంపెనీలో మార్పులు తీసుకొచ్చే బదులు కొత్త కంపెనీలను తీసుకోవడం పెద్ద ముందడుగు అనిపిస్తుందని, ఆకులస్ కంపెనీని కొనుగోలు చేయడం కూడా అలాంటి ముందడుగని తాను భావిస్తున్నానని చెప్పారు. పైగా ఆకులస్లో టాలెంట్ పీపుల్ ఉన్నారని ఆయన చెప్పారు. అచ్చం స్నాప్‌చాట్ తరహాలో పనిచేసే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌ను ఫేస్బుక్ ఇటీవల ఆవిష్కరించడాన్ని జుకర్‌బర్గ్ ప్రస్తావిస్తూ, వినియోగదారుల మనోభావాల మేరకు అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. కావాలనుకుంటే స్నాప్‌చాట్ స్టోరీస్ ఫీచర్‌ను ఫేస్బుక్ తీసుకరావచ్చని, కానీ కాపీ అనే ముద్ర కూడా కంపెనీ మీద ఉండకూడదని ఆయన చెప్పారు. ‘ఏదైనా పెద్ద రిస్క్ తీసుకోవాలనుకున్నప్పుడు అందులో ఉన్న ప్రతికూల అంశాల గురించి మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని హెచ్చరిస్తుంటారు. వారి మాటల్లో వాస్తవం లేకపోలేదు. ప్రతి నిర్ణయంలో సానుకూల, ప్రతికూల అంశాలు తప్పక ఉంటాయి. ప్రతికూల అంశాలకు భయపడి ఏ నిర్ణయం తీసుకోకపోతే కంపెనీలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. అది ప్రమాదరకరం. అందుకని పెద్ద రిస్క్ తీసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్ అన్నది సర్వదా నా అభిప్రాయం’ అని జుకర్ బర్గ్ తన ఇంటర్వ్యూను ముగించారు. -
ఫేస్బుక్ సీఈవోపై సంచలన ఆరోపణలు
ఫేస్బుక్ సీఈవో, వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్‌పై ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఆంటోనియో గార్సియా మార్టినెజ్ సంచలన ఆరోపణలు చేశారు. గూగుల్ ప్లస్‌ను నాశనం చేయాలని జూకర్బర్గ్ భావించారని బాంబు పేల్చారు. మార్టినెజ్.. 'చావోస్ మంకీస్: ఆబ్సెన్ ఫార్చూన్ అండ్ రాండమ్ ఫెయిల్యూర్ ఇన్ సిలికాన్ వ్యాలీ' పేరిట ఓ పుస్తకం రాశారు. త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడించారు. 2011లో గూగుల్ ప్లస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించినపుడు దాని అస్థిత్వాన్ని దెబ్బతీయాలని జూకర్బర్గ్ యోచించారని మార్టినెజ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. గూగుల్ కూడా ఫేస్బుక్ విషయంలో మొదట్లో ఏమాత్రం ప్రాధాన్యం ఇచ్చేదికాదని ఆయన వెల్లడించారు. గూగుల్, ఫేస్బుక్ సంస్థలకు సంబంధించిన విషయాలు, వాటి మధ్య పోటీతత్వంతో పాటు ఐటీ నిపుణుల ఉద్యోగ అవకాశాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఫేస్‌బుక్‌కు కౌంటర్‌గా గూగుల్ ప్లస్‌ను ప్రారంభించాలని గూగుల్ భావించిందని తెలిపారు. కొన్ని విషయాల్లో ఫేస్‌బుక్‌తో పోలిస్తే మెరుగైనదని మార్టినెజ్ అభిప్రాయపడ్డారు. -
జుకర్‌బర్గ్ కూతురి పేరేంటో తెలుసా?
బీజింగ్: ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అన్నంత పనీ చేశాడు. తన గారాల పట్టీకి చైనీస్ పేరు పెట్టుకుంటానని గతంలోనే ప్రకటించిన జుకర్ తన కోరికను నెరవేర్చుకున్నాడు. చైనా నూతన సంవత్సరం సంబరాల్లో భాగంగా తన కుమార్తెకు 'చెన్ మింగ్ యూ' అనే పేరును ఖరారు చేశాడు. ఈ విషయాన్ని జుకర్ దంపతులు తన అధికారిక ఫేస్బుక్లో అభిమానులతో పంచుకున్నారు. దీంతో పాటు ఓ క్యూట్ వీడియోనొక్కదాన్ని షేర్ చేశారు. చైనాలోని మాండరిన్లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్న ఈ దంపతులు తమ చిన్నారి పేరును అధికారికంగా ప్రకటించారు. చైనా ప్రజలకు లూనార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జుకర్ బర్గ్ ... అలాగే తన భార్య ప్రిస్కిల్లా, చిన్నారి చెన్కు గ్రీటింగ్స్ తెలిపారు. దీంతోపాటు పాప పేరులోని విశేషాలను షేర్ చేశారు. అమ్మ ప్రిస్కిల్లా నుండి వారసత్వంగా చెన్, రేపటి ప్రకాశవంతమైన భవిష్యత్తును 'మింగ్ యూ' సూచిస్తుందన్నారు. కాగా 2012లో పెళ్లి చేసుకున్న జుకర్ బర్గ్, ప్రిస్కిల్లా దంపతులకు గత ఏడాది నవంబర్‌లో మాక్స్ పుట్టింది. సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ సీఈవోగా యువతరంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న జుకర్ పాపాయికి జన్మనిచ్చిన తరువాత క్రేజీ ఫాదర్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. గత ఏడాది చైనా అధ్యక్షుడు లీ జిన్ పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా తమ పాపకి చైనీ పేరు పెట్టుకోవాలనే అభిలాషను వ్యక్తం చేశాడు జుకర్. అంతేకాదు తన పాపకు చైనీ పేరు పెట్టాలని లీని కోరడం.. దానికి ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలు రావడం తెలిసిందే. -
ఒక్క రోజులోనే రూ. 40 వేల కోట్లు వచ్చాయి
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, సీయీవో మార్క్ జూకర్బర్గ్ సంపద ఒక్క రోజులోనే దాదాపు 40 వేల కోట్ల రూపాయలు పెరిగింది. ఫేస్బుక్ కంపెనీ షేర్ల విలువ 13 శాతం పెరగడంతో ఆయన సంపద విలువ అమాంతం పెరిగిపోయింది. దీంతో ప్రపంచ ధనవంతుల జాబితాలో జూకర్బర్గ్.. ఆయిల్ మేగ్నట్స్ చార్లెస్, డేవిడ్ కోచ్‌లను వెనక్కినెట్టి ఆరో స్థానానికి దూసుకెళ్లారు. గురువారం కంపెనీ నాలుగో త్రైమాసిక అమ్మకాలు 52 శాతం పెరిగినట్టు ఫేస్బుక్ వెల్లడించింది. తాజాగా పెరిగిన సంపదతో కలిపి జాకర్‌బర్గ్ ఆస్తి విలువ 3.22 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రపంచ కుబేరుల జాబితా టాప్-5లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (5.29 లక్షల కోట్ల రూపాయలు), జరా వ్యవస్థాపకుడు అమెన్కియో (4.73 లక్షల కోట్ల రూపాయలు), ఒరాకిల్ ఆప్ ఒమాహా వారెన్ బఫెట్ (4.03 లక్షల కోట్ల రూపాయలు), అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (3.78 లక్షల కోట్ల రూపాయలు), టెలికామ్ మేగ్నెట్ కార్లోస్ హెలు (3.22 లక్షల కోట్ల రూపాయలు) ఉన్నారు. వీరి తర్వాతి స్థానంలో జూకర్ బర్గ్ నిలిచారు. -
ఫేస్బుక్ సీఈవో సంచలన నిర్ణయం
-
ఫేస్బుక్ సీఈవో సంచలన నిర్ణయం
► 99 శాతం షేర్ల దానం ► జుకెర్బెర్గ్, భార్య ప్రిసిల్లా సంయుక్త నిర్ణయం ► ప్రస్తుతం ఆ షేర్ల విలువ రూ. 2,99,200 కోట్లు ► కూతురు పుట్టిన వేళ భారీ దాతృత్వం వాషింగ్టన్ కూతురు పుట్టిన వేళా విశేషం ఏమోగానీ, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకెర్బెర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకున్న షేర్లలో 99 శాతాన్ని దానం చేసేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని తమ కూతురు మాక్సిమాకు రాసిన లేఖలో తెలిపారు. ఆ లేఖను జుకెర్బెర్గ్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ ప్రపంచాన్ని సంతోషంగా, ఆరోగ్యకరంగా చూసేందుకు ఈ దానం చేస్తున్నానన్నాడు. ప్రపంచంలో ఉన్న పిల్లలందరి కోసం ఈ చిన్న సాయం చేస్తున్నట్లు తెలిపాడు. ఫేస్బుక్లో తమకున్న షేర్లలో 99 శాతాన్ని విరాళంగా ఇస్తామన్నాడు. వాటి ప్రస్తుత విలువ దాదాపు రూ. 3 లక్షల కోట్లు. భావి తరం కోసం ఈ ప్రపంచాన్ని మెరుగుపరిచేందుకు ఈ మొత్తాన్ని ఇస్తామన్నాడు. ఈ ప్రపంచంలోకి తమ కూతురు మాక్స్‌ను స్వాగతించేందుకు భార్య ప్రిసిల్లా, తాను ఎంతో సంతోషంగా ఉన్నామని తెలిపాడు. మనుషుల శక్తి సామర్థ్యాలను పెంచేందుకు, సమానత్వాన్ని పెంచేందుకు, వ్యాధులకు చికిత్స చేసేందుకు, స్వచ్ఛ ఇంధనాన్ని అభివృద్ధి చేసేందుకు, ప్రజలను అనుసంధానం చేసేందుకు, పేదరికాన్ని తగ్గించేందుకు, సమానహక్కులు కల్పించేందుకు, వివిధ దేశాల మధ్య అవగాహనను విస్తరించేందుకు ఈ మొత్తం ఉపయోగపడాలని జుకెర్బెర్గ్ ఆకాంక్షించాడు. మీ తరం కోసం మా ఆశలు ప్రధానంగా రెండు అంశాల మీద ఉంటాయని, అవి మానవ శక్తి సామర్థ్యాలను పెంపొందించడం, సమానత్వాన్ని ప్రోత్సహించడమని తెలిపాడు. తాను ఫేస్బుక్ సీఈవోగా ఇంకా చాలా ఏళ్ల పాటు పనిచేస్తానని చెప్పాడు. చాన్ జుకెర్బెర్గ్ ఇనీషియేటివ్‌ను ప్రారంభిస్తున్నామని కూడా ఈ లేఖలోనే ప్రకటించాడు. తాను పైన పేర్కొన్న అంశాలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న వ్యక్తులు, అందుబాటులో ఉన్న వనరులతో పోలిస్తే తాము ఇచ్చింది చాలా చిన్న మొత్తమని, కానీ.. తాము చేయగలిగింది ఏదో చేద్దామని అనుకుంటున్నామని అన్నాడు. రాబోయే కాలంలో మరిన్ని వివరాలు చెబుతానని, తామిద్దరం తల్లిదండ్రులుగా కాస్త స్థిరపడిన తర్వాత వీటిని వేగవంతం చేస్తామని తెలిపాడు. తాము ఇదంతా ఎందుకు, ఎలా చేస్తున్నామన్న ప్రశ్నలు ఉండొచ్చని, తల్లిదండ్రులుగా తాము తమ జీవితాల్లో కొత్త అధ్యాయాలను ప్రారంభిస్తుండటంతోనే ఇలా చేస్తున్నామని అన్నాడు. తమతో పాటు ప్రపంచవ్యాప్తంగా బలమైన సైన్యం ఉండటం వల్ల మాత్రమే తాము ఇలా చేయగలమన్న నమ్మకంతో ఉన్నామని తెలిపాడు. తాను చేస్తున్న ఈ కృషిలో ఫేస్బుక్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడూ తన వంతు పాత్ర పోషిస్తున్నట్లేనని వివరించాడు. -
ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న జుకర్‌బర్గ్
ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నాడు. తాజ్‌మహల్ సందర్శించి తిరిగా ఢిల్లీ వచ్చే సమయంలో మహాలయ ఫ్లై ఓవర్ వద్ద జామ్‌లో ఇరుక్కున్నాడు. ఎక్కువ సేపు ట్రాఫిక్ ఆగిపోవడంతో కారు దిగిన మార్క్.. అక్కడి స్థానికులతో కాసేపు మాట్లాడి, అక్కడున్న కచోరీలు తిన్నాడు. సాయంత్రం సమయంలో జుకర్‌బర్గ్ తాజ్‌మహల్‌ను సందర్శించాడు. ఆ సందర్భంగా తాజ్‌మహల్ వద్ద తాను కూర్చుండగా సహోద్యోగులు తీసిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఎప్పటిలాగే తన గ్రే కలర్ టీషర్టు, బ్లూ జీన్స్ వేసుకునే తాజ్‌మహల్‌కు వెళ్లాడు. తాజ్.. తాను అనుకున్నదాని కంటే చాలా అద్భుతంగా ఉందని తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆయనతో పాటు ఏడుగురు ఆగ్రా పర్యటనకు వెళ్లారు. -
జుకర్‌బర్గ్‌నుపక్కకు జరిపిన మోదీ!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తాను కెమెరాలకు బాగా కనిపించేందుకు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను పక్కకు జరుపుతున్న వీడియోదృశ్యం దుమారంరేపుతోంది. ఆదివారం సిలికాన్ వ్యాలీలోని ఫేస్బుక్ కార్యాలయంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ముఖాముఖికి ముందు జుకర్‌బర్గ్, ఫేస్బుక్ సీఓఓ షెరిల్ శాండ్బర్గ్లు మోదీకి మెమెంటో ఇస్తుండగా ఆయన కెమెరాకు బాగా కనిపించేందుకు జుకర్‌బర్గ్ చేయిపట్టుకునిపక్కకు జరుపుతున్నట్లు ఈ వీడియోలో ఉంది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారమవుతున్న దీనిపై కాంగ్రెస్ స్పందిం చింది. ‘ప్రధాని ఫోటోలకు, ప్రచార ఆర్భాటానికి, విదేశీ పర్యటనలకు పెట్టింది పేరు. ఆయన ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి తాను ప్రధానినని తెలుసుకోవాలి. విదేశాల్లో ఉన్నప్పుడు స్కూలు పిల్లాడిలా ప్రవర్తించకూడదు’ అని పార్టీ ప్రతినిధి షకీల్ అహ్మద్ అన్నారు. ఇంటర్నెట్.ఆర్గ్‌కు మద్దతు కాదు ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’కు మద్దతుగా ఫేస్బుక్ ప్రారంభించిన జాతీయ జెండా త్రివర్ణాల నేపథ్యంలోని ప్రొఫైల్ ఫొటోలు వివాదాస్పదంగా మారాయి. ఫేస్బుక్ వంటి కొన్ని వెబ్సైట్లను మాత్రమే ఉచితంగా అందించే వివాదాస్పద ఇంటర్నెట్.ఆర్గ్‌ను ప్రమోట్ చేసుకోవడానికే ఈ ఎత్తుగడ వేశారంటూ సోషల్ మీడియాలో, బయటా ఉద్యమకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఫేస్బుక్ వివరణ ఇచ్చింది. కేవలం ‘డిజిటల్ ఇండియా’కు ప్రోత్సాహకంగానే ఈ త్రివర్ణ ప్రొఫైల్ ఫోటోలను, టూల్‌ను ఏర్పాటు చేశామని... ఇది ఎంతమాత్రం ఇంటర్నెట్.ఆర్గ్‌ను ప్రమోట్ చేసుకోవడం కాదని స్పష్టం చేసింది. -
మోదీకి జూకర్ బర్గ్ అడ్డు వచ్చిన వేళ...
-
‘జుక్.. నీ చేతులకంటిన నెత్తురు కడుక్కో’
న్యూయార్క్ : మోదీ ఎన్ని విదేశీ పర్యటనలు చేపట్టినా, ఎంతమంది ప్రముఖులను కలుసుకుంటున్నా గుజరాత్ అల్లర్ల క్రీనీడ వెంటాడుతూనే ఉంది. ఆయన ఆదివారం ఫేస్బుక్ ఆఫీసులో ఆ సంస్థ సీఈఓ జుకర్‌బర్గ్‌తో భేటీ కావడం తెలిసిందే. భేటీ ముగియగానే ‘అలయన్స్ ఫర్ జస్టిస్ అండ్ అకౌంటబిలిటీ’ కార్యకర్తలు.. ‘జుకర్, నీ చేతులు కడుక్కో’ అని ప్రచారం ప్రారంభించారు. జుకర్ చేతులకంటిన రక్తాన్ని కడుక్కోవడానికి ఆయనకు హ్యాండ్ శానిటైజర్ బాటిళ్లను వందలాదిగా పంపాలని ప్రజలను కోరారు. ఇప్పటికి 250 బాటిళ్లు పంపినట్లు సమాచారం. -
డిజిటల్ ఇండియా విప్లవభేరి
-
డిజిటల్ ఇండియా విప్లవభేరి
మోగించిన మోదీ! ⇒ డేటా భద్రతకు పటిష్టమైన చర్యలు... ⇒ టాప్ ఐటీ కంపెనీల సీఈవోలతో ప్రధాని మోదీ ⇒ ఎం-గవర్నెన్స్‌తో ప్రజలకు మరింత చేరువ ⇒ పేపర్‌లెస్ లావాదేవీలే లక్ష్యం ⇒ ప్రజలందరికీ డిజిటల్ లాకర్లు... సాంకేతిక సృజనాత్మకతకు పుట్టినిల్లు.. హైటెక్ పరిజ్ఞానానికి ప్రపంచ కేంద్రం.. డిజిటల్ ప్రపంచానికి రాజధాని అయిన సిలికాన్ వ్యాలీ వాకిట.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ శాంతను నారాయణ్, క్వాల్కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాల్ జాకబ్స్ వంటి దిగ్గజాల ముంగిట.. ‘డిజిటల్ ఇండియా’ విప్లవభేరిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోగించారు. భారతదేశంలో డిజిటల్ విప్లవం తీసుకువచ్చేందుకు తన ప్రణాళికలను ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థల సీఈఓలతో శనివారం రాత్రి విందు భేటీలో బయటపెట్టారు. పేదలు, ప్రభుత్వ పథకాలను అందుకోలేనివారికి చేరువకావడంతో పాటు దేశంలో ప్రజల జీవన గమనాన్ని సమూలంగా మార్చివేసే లక్ష్యంతోనే డిజిటల్ ఇండియాకు అంకురార్పణ చేశామన్నారు. హైవేలతో పాటు ఐ-వేలు కూడా అవసరమంటూ.. భారత్‌లోని 125 కోట్ల మంది ప్రజలను డిజిటల్‌గా అనుసంధానించటం తమ లక్ష్యమని చెప్పారు. పల్లెలను స్మార్ట్ ఎకనమిక్ హబ్‌లుగా మార్చటమే ధ్యేయంగా.. దేశంలోని ఆరు లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించటాన్ని వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. పేపర్ రహిత లావాదేవీలను సాకారం చేయాలన్నదే సంకల్పమంటూ.. పరిపాలనతో ప్రజలను మరింత భాగస్వామ్యం చేసేందుకు ఎం(మొబైల్)-గవర్నెన్స్ తోడ్పడుతుందన్నారు. ఇంకా భారత ప్రభుత్వం చేపడుతున్న మరిన్ని చర్యలను వివరించారు. నరేంద్రమోదీ తలపెట్టిన డిజిటల్ ఇండియా విప్లవానికి తమ సహకారం అందించేందుకు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు ముందుకొచ్చాయి. దేశంలో 500 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యాన్ని అందించేందుకు గూగుల్ సహకారం అందిస్తుందని సుందర్ పిచాయ్ ప్రకటించారు. భారత్‌లోని 5 లక్షల గ్రామాలకు చౌకగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చెప్పారు. భారత్‌లో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు క్వాల్కామ్ దాదాపు రూ. వేయి కోట్లు మేర నిధులను అందించనున్నట్లు పాల్ జాకబ్స్ ప్రకటించారు. భారత్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న మోదీ విజ్ఞప్తికి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సానుకూలంగా స్పందించారు. ప్రధాని మోదీ ఆదివారం ఫేస్బుక్, గూగుల్ ప్రధాన కార్యలయాలను సందర్శించి.. సీఈఓలతో పాటు ఇతర ప్రతినిధులతో ముచ్చటించారు. ‘డిజిటల్ ఇండియాలో మేం కూడా భాగస్వాములమవుతాం. చౌక బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ పరిజ్ఞానంతో ప్రభుత్వాలు, ప్రజలు, వ్యాపారాలకు మేలు చేకూరుతుంది. అన్నిస్థాయిల్లో సామర్థ్యం, ఉత్పాదకత, సృజనాత్మకతను పెంపొందించేందుకు తోడ్పడుతుంది. - సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ గుజరాతీ సహా 10 భారతీయ భాషల్లో టైపింగ్‌కు అవకాశం కల్పిస్తాం. వచ్చే నెలలో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. డిజిటల్ లిటరసీ (పరిజ్ఞానం)ని అందరికీ అందించాలంటే స్థానిక భాషల్లో టైపింగ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మేం ఈ చర్యలు చేపడుతున్నాం. - సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ అమ్మకు కన్నీటి అభిషేకం సిలికాన్ వ్యాలీలో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌తో ముఖాముఖి సందర్భంగా.. అమ్మ ప్రస్తావన వచ్చినపుడు భావోద్వేగంతో.. కళ్లలో నీళ్లు ఉబికివస్తుండగా.. ప్రధాని మోదీ చెప్పిన మాటలివి. శాన్‌జోస్: డిజిటల్ విప్లవం దిశగా భారత్ వడివడిగా అడుగులేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికా పర్యటలో భాగంగా సిలికాన్‌వ్యాలీలో ప్రపంచ అగ్రగామి ఐటీ కంపెనీల సీఈవోలతో సమావేశం సందర్భంగా తన మానస పుత్రిక అయిన ‘డిజిటల్ ఇండియా’ ప్రణాళికలను వివరించారు. డేటా గోప్యత(ప్రైవసీ), భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడం తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని కూడా ఆయన టెక్ దిగ్గజాలకు హామీనిచ్చారు. మోదీతో విందు(డిన్నర్) సమావేశంలో పాల్గొన్న వారిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ శాంతను నారాయణ్, క్వాల్కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాల్ జాకబ్స్ తదితరులు ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టబోయే పలు ప్రణాళికలను కూడా మోదీ ప్రకటించారు. ముఖ్యంగా దేశంలో పబ్లిక్ వైఫైను మరింతగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే 500 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నామని, ఇందుకోసం గూగుల్‌తో జట్టుకట్టామని కూడా వెల్లడించారు. ఐ-వేస్ కూడా అవసరం... 6 లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించడం కోసం జాతీయ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ విస్తరణను వేగవంతం చేస్తున్నామని ప్రధాని టెక్ సీఈవోలకు వివరించారు. ‘ఈ-గవర్నెన్స్‌తో మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు వీలవుతోంది. ఇప్పుడు భారత్‌లో 100 కోట్ల మంది మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. పరిపాలనతో ప్రజలను మరింత భాగస్వామ్యం చేసేందుకు, ప్రభుత్వాన్ని వారి చెంతకు చేర్చేందుకు ఎం(మొబైల్)-గవర్నెన్స్ తోడ్పడుతుంది. స్కూళ్లు, కాలేజీన్నింటినీ బ్రాండ్‌బ్యాండ్‌తో అనుసంధానిస్తాం. పేవర్ రహిత లావాదేవీలను సాకారం చేయాలన్నదే మా సంకల్పం. దేశంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ లాకర్ సదుపాయాన్ని కల్పించనున్నాం. వ్యక్తిగత డాక్యుమెంట్లను ఇందులో దాచుకోవచ్చు. ఏ ప్రభుత్వ శాఖతో పనిఉన్నా నేరుగా వాటిని పంపడానికి వీలవుతుంది. వ్యాపారవేత్తలకు అనుమతులను వేగంగా ఇచ్చేందుకు ఈ-బిజ్ పోర్టల్‌ను నెల కొల్పాం’ అని మోదీ సీఈఓలకు వివరించారు. -
అమ్మకు కన్నీటి అభిషేకం
నన్ను పెంచటానికి నా తల్లి ఎన్నో కష్టాలు పడింది.. అంట్లు తోమింది - భారత్‌లో ఎందరో తల్లులు తమ పిల్లల కోసం జీవితాలు త్యాగం చేస్తారు - వారందరికీ వేల వేల వందనాలు: ఫేస్బుక్ సీఈఓ జుకర్‌బర్గ్ ప్రశ్నతో మోదీ భావోద్వేగం - దేశ ఆర్థికవ్యవస్థను 20 లక్షల కోట్ల డాలర్లకు పెంపే లక్ష్యమన్న ప్రధాని నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను... నేను రైల్వే స్టేషన్ వద్ద టీ అమ్మేవాడినని బహుశా మీకు తెలుసేమో. మేం చిన్నప్పుడు బతకటానికిచాలా చేయాల్సివచ్చేది. నా తండ్రి లేరు.. నన్ను పెంచటానికి నా తల్లి చాలా కష్టాలు పడింది. ఆమె పొరిగింట్లో అంట్లు తోమేది.. నీళ్లు పట్టేది.. కాయకష్టం చేసేది. ... ఇది కేవలం ఒక్క నరేంద్రమోదీ విషయంలోనే కాదు.. ఇండియాలో చాలా మంది తల్లులు తమ పిల్లల కోసం తమ జీవితాలు మొత్తం త్యాగం చేస్తారు. అందుకే అమ్మలందరికీ నా వేలవేల దండాలు. తమ పిల్లల కలలు, ఆశలను నెరవేర్చటానికి తమ సొంత జీవితాలను త్యాగం చేసిన తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. ఒక తల్లి తన బిడ్డ ఏదో కావాలని ఎన్నడూ కోరుకోదు.. నీవు కోరుకున్న దానిని నీవు ఎలా సాధిస్తావనే దాని గురించే ఆమె ఆలోచిస్తుంది. శాన్‌జోస్: అత్యంత అరుదుగా భావోద్వేగానికి గురయ్యే ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆదివారం ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అడిగిన ఒక ప్రశ్నకు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి గురించి మాట్లాడుతుండగా ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోవటానికి కొన్ని క్షణాలు మౌనందాల్చారు. ఆయన ఆదివారం సిలికాన్ వ్యాలీలో ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌తో అధికభాగం భారతీయులు పాల్గొన్న సభికుల ఎదుట టౌన్‌హాల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ తల్లి గురించి జుకర్‌బర్గ్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ భావేద్వేగానికి గురయ్యారు. తాను పేద కుటుంబం నుంచి వచ్చానని.. చిన్నప్పుడు తనను పెంచటానికి తన తల్లి ఎన్నో కష్టాలు పడ్డారని.. పొరిగింట్లో అంట్లుతోమటం, నీళ్లు పట్టటం చేసేవారని.. కాయకష్టం చేసేవారని తెలిపారు. ఇది తన ఒక్కడి విషయంలోనే కాదని.. భారత్‌లో ఎంతోమంది తల్లులు తమ పిల్లల కోసం జీవితాలు మొత్తం త్యాగం చేస్తారని చెప్తూ.. వారందరికీ వేల వేల వందనాలు తెలిపారు. ప్రస్తుతం 90 ఏళ్ల వయసున్న తన తల్లి ఇప్పుడు కూడా తన పనులన్నీ తానే చేసుకుంటారని చెప్పారు. ఆమె చదువుకోలేదని.. అయితే టెలివిజన్ ద్వారా వార్తలు.. ప్రపంచంలో ఏం జరుగుతుందనేది తెలుసుకుంటారని వివరించారు. మార్క్ జుకర్‌బర్క్ ప్రపంచాన్ని మార్చివేశారంటూ ఆయన తల్లిదండ్రులకు మోదీ అభినందనలు తెలిపారు. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం... పెట్టుబడిదారులు భారత్ స్వర్గధామమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ‘‘డబ్బుకు కొరవ ఉందని నేను భావించటం లేదు. దేశాల వద్ద డబ్బు ఉంది.. కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలో వారికి తెలియదు. నేను వారికి ఆ చిరునామా ఇస్తున్నా.. ఇదే (ఇండియా) ఆ ప్రాంతం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 8 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఆర్థికవ్యవస్థను 20 లక్షల కోట్ల డాలర్లకు పెంచాలన్నది తన లక్ష్యమని చెప్పారు. అందుకోసం భారత్‌లో వ్యాపారం చేయటం సులభతరం చేయటానికి, నియంత్రణను తొలగించటానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భారత్‌లో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని.. పెట్టుబడిదారులు కోల్పోయిన విశ్వాసాన్ని గత 15 నెలల్లో పునరుద్ధరించగలిగామని పేర్కొన్నారు. గత 15 నెలల్లో ఒక్క అమెరికా నుంచే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 87 శాతం పెరిగాయని.. ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం ఉన్నప్పటికీ ఎఫ్ఐఐలు 40 శాతం పెరిగాయని చెప్పారు. ‘‘ఇండియా చాలా పెద్ద దేశం. సంస్కరణల వల్ల మార్పులు కనిపించటానికి కొంత సమయం పడుతుంది. ఎటువైపు వెళుతోందో సులభంగా చూడగలగటానికి అది ఒక స్కూటర్ కాదు.. 40 బోగీలున్న ఒక రైలు కొంత సమయం తీసుకుంటుంది’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘భారత్‌లో బ్యాంకుల జాతీయీకరణ 40 ఏళ్ల కిందట జరిగింది. కానీ నా ప్రభుత్వం జన్‌ధన్ పథకం ప్రవేశపెట్టే వరకూ 60 శాతం జనాభాకు బ్యాంకు ఖాతాల్లేవు. మా ప్రభుత్వం తొలి 100 రోజుల్లోనే 18 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచింది’’ అని తెలిపారు. వ్యవసాయం, సేవలు, తయారీ - ఈ మూడు రంగాలతో పాటు.. భౌతిక, డిజిటల్ మౌలికసదుపాయాల నిర్మాణంపై తన ప్రభుత్వం ఎక్కువ దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ కార్యక్రమం కోసం దాదాపు 40 వేల ప్రశ్నలు రాగా.. మోదీ కేవలం ఆరు ప్రశ్నలకే సమాధానం చెప్పారు. అందులో రెండు ప్రశ్నలు జుకర్‌బర్గ్ సొంతంగా అడిగినవి. ఇదిలావుంటే.. ఫేస్బుక్ సంస్థలోని ‘రియల్ వాల్’పై ‘‘అహింస అతిగొప్ప ధర్మం - సత్యమేవ జయతే’’ అని ప్రధాని మోదీ లిఖించారు. సోషల్ మీడియాతో నా ఆలోచనా విధానం మారింది తన ఆలోచనా విధానంలో సోషల్ మీడియా పెద్ద మార్పు తెచ్చిందని మోదీ చెప్పారు. ‘‘నేను సోషల్ మీడియాలోకి వచ్చినపుడు.. నేను ముఖ్యమంత్రినో, ప్రధానమంత్రినో అవుతానని నాకు తెలియదు. ప్రపంచం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండేది. ప్రపంచం గురించిన సమాచారం తెలుసుకునేందుకు సోషల్ మీడియా నాకు సాయపడింది. నా ఆలోచనా విధానంలో ఇది పెద్ద మార్పు తెచ్చింది’’ అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ప్రభుత్వాన్ని - ప్రజలను నిరంతరం అనుసంధానించే శక్తి సోషల్ మీడియాకు ఉంది. పొరపాటు ఏమిటనేది వెంటనే తెలిసిపోతుంది. తద్వారా ప్రభుత్వం దానిని సరిచేసే చర్యలు చేపట్టవచ్చు. సోషల్ మీడియా కారణంగా రోజు వారీ ఓటింగ్ ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా బలం. నా పరిపాలనలో సోషల్ మీడియా పాత్ర చాలా ఉంది’’ అని ఆయన వివరించారు. గూగుల్ ఆఫీస్‌లో మోదీ సాన్‌జోస్: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్, మాజీ సీఈఓ ఎరిక్ ష్మిట్తో కలిసి కార్యాలయ ప్రాంగణంలో పర్యటించారు. ఈ సందర్భంగా సంస్థ కీలక ప్రాజెక్టుల గురించి వారు మోదీకి వివరించారు. గూగుల్ స్ట్రీట్ వ్యూ, గూగుల్ ఎర్త్ మొదలైన వాటి ఉపయోగాల గురించి చెప్పారు. డిజిటల్ ఇండియా గురించి చర్చించారు. అనంతరం ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు. తన డిజిటల్ ఇండియా స్వప్నం గురించి వారికి వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. భారతీయ రైల్వే, గూగుల్ భాగస్వామ్యంతో 500 రైల్వే స్టేషన్లలో ఆధునిక సాంకేతిక సౌకర్యాలు కల్పించనున్నారు. -
త్వరలో ఫేస్బుక్లో కొత్త ఆప్షన్
శాన్ఫ్రాన్సిస్కో: యూజర్ల కోరిక ఫేస్బుక్ యాజమాన్యం తర్వలో సరికొత్త ఆప్షన్ ప్రవేశపెట్టనుంది. త్వరలో మీ ఫేస్బుక్ పేజీలో డిజ్ లైక్ బటన్ అనే ఆప్షన్ చూడవచ్చు. ఫేస్బుక్ యాజమన్యం ప్రస్తుతం డిజ్లైక్ బటన్‌ను యాడ్ చేసే పనిలో నిమగ్నమైంది. త్వరలోనే దీన్ని పరీక్షించనుంది. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లో జరిగిన సమావేశంలో జుకర్ బర్గ్ పాల్గొన్నారు. చాలామంది యూజర్లు డిజ్లైక్ బటన్ ఆప్షన్ కావాలని అడుగుతున్నారని చెప్పారు. వారి కోరిక మేరకు ఈ ఆప్షన్ ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. త్వరలోనే అందుబాటులో ఉంచుతామని చెప్పారు. బాధాకరమైన విషయాలకు లైక్ బటన్ ను ప్రెస్ చేయడాన్ని చాలామంది ఇబ్బందిగా భావిస్తున్నారని అన్నారు. ఇది మంచిది కాదు అని చెప్పేందుకు సంస్థ ఓ మార్గం కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది అని జుకర్ పేర్కొన్నారు. -
ఉగ్రవాద కట్టడికి సోషల్ మీడియా తోడ్పడాలి: మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలను అణచడంలో సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషించాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అది ఏ విధంగా చేయాలన్న దానిపై నెట్వర్కింగ్ సైట్లు దృష్టి పెట్టాలన్నారు. సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ సీఈవో మార్క్ జకర్‌బర్గ్‌తో శుక్రవారం భేటీ అయిన సందర్భంగా మోదీ ఈ విషయాలు పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలను విస్తరించేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్న అంశాన్ని, దీన్ని అరికట్టడంలో సోషల్ మీడియా పోషించాల్సిన పాత్ర గురించి మోదీ ప్రస్తావించారు. అలాగే, స్వచ్ఛ్ భారత్ మిషన్‌తో పాటు పలు అంశాలను జకర్‌బర్గ్‌తో భేటీలో ఆయన చర్చించారు. స్వచ్ఛ్ భారత్ మిషన్కి తోడ్పాటునిచ్చేలా క్లీన్ ఇండియా మొబైల్ యాప్‌ను రూపొందించడంలో సహాయం అందిస్తామని జకర్బర్గ్ హామీ ఇచ్చారు. ఇక, గ్రామగ్రామానికి ఇంటర్నెట్ను చేరువ చేసేందుకు ఉద్దేశించిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో.. ఫేస్బుక్ ఏ మేరకు సహకారం అందించగలదో తెలియజేయాలని జకర్బర్గ్కు మోదీ సూచించారు. భారత్‌లోని పర్యాటక ప్రదేశాలు, విశేషాలను ఫేస్బుక్ ద్వారా మరింత ప్రాచుర్యంలోకి తేవాలని కోరారు. అంతకు ముందు .. కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్‌తో కూడా జకర్బర్గ్ సమావేశమయ్యారు. డిజిటల్ సేవల విస్తృతికి సంబంధించిన ప్రాజెక్టుల ప్రతిపాదనల ఆమోదం కోసం పలువురు అధికారుల చుట్టూ తిరగకుండా నిర్దిష్టంగా ఎవరో ఒకరిని సూచించాలన్న జకర్బర్గ్ విజ్ఞప్తిపై రవిశంకర్ సానుకూలంగా స్పందించారు. ప్రత్యామ్నాయ టెక్నాలజీ ప్రాజెక్టులపై టెలికం శాఖ సం యుక్త కార్యదర్శి, ఐటీ సంయుక్త కార్యదర్శి ఈ అంశాలను పర్యవేక్షిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
భారత్ వస్తా.. మోదీని కలుస్తా: జుకెర్బెర్గ్
సోషల్ నెట్వర్కింగ్ మార్కెట్లో నెంబర్ 2 స్థానంలో ఉన్న భారతదేశానికి తాను ఈనెలలో వస్తానని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ చెప్పారు. అలా వచ్చినప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తానన్నారు. న్యూఢిల్లీలో అక్టోబర్ 9, 10 తేదీల్లో నిర్వహించే మొట్టమొదటి ఇంటర్నెట్.ఆర్గ్ సదస్సులో పాల్గొనేందుకు జుకెర్బెర్గ్ వస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలోని కొంతమంది కీలక మంత్రులను కూడా ఆయన కలుస్తారు. ఆమెరికాలో బాగా పేరున్న సీఈవోలలో జుకెర్బెర్గ్ది మూడోస్థానం. మొదటి రెండు స్థానాల్లో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, రెండోస్థానంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఉన్నారు. వీళ్లలో సత్యనాదెళ్ల ఇప్పటికే భారత్ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇంటర్నెట్ను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఇంటర్నెట్.ఆర్గ్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అసలు అది అందుబాటులో లేని 500 కోట్లమందికి దాన్ని అందించాలన్నది సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో ఫేస్బుక్, ఎరిక్సన్, మీడియా టెక్, నోకియా, ఒపెరా, క్వాల్కామ్, శామ్సంగ్ లాంటి దిగ్గజ సంస్థలు పాల్గొంటాయి. -
ఫేస్బుక్ చీఫ్ జుకర్‌బర్గ్ సంపద డబుల్
న్యూయార్క్: సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ దూకుడులాగే ఆ కంపెనీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్(29 ఏళ్లు) సంపద కూడా దూసుకుపోతోంది. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే ఆయన సంపద దాదాపు రెట్టింపు స్థాయిలో ఎగబాకింది. దీనంతటికీ ఫేస్బుక్ షేరు ధర పరుగే కారణం. 2012 మే 18న ఫేస్బుక్ పబ్లిక్ ఇష్యూ సమయంలో జుకర్ బర్గ్ సంపద(కంపెనీలో ఆయనకున్న వాటా ప్రకారం) 18 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇప్పుడిది ఏకంగా 33 బిలియన్ డాలర్లకు ఎగసింది. అంటే 15 బిలియన్ డాలర్ల సంపద జతైంది. నాస్డాక్లో లిస్టింగ్ సమయంలో ఫేస్బుక్ షేరు ధర 38 డాలర్లు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఇది 80 శాతం వృద్ధితో 68.46 డాలర్లకు చేరింది. తాజా గణాంకాల ప్రకారం జుకర్‌బర్గ్ వద్ద 47.89 కోట్ల షేర్లు ఉన్నాయి. కంపెనీలో ఆయన వాటా 19.6%. 2004 ఫిబ్రవరిలో ఆరంభమైన ఫేస్బుక్ సంస్థ గత నెలలోనే పదేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న యూజర్ల సంఖ్య 123 కోట్లు పైనే. మొబైల్ చాటింగ్ అప్లికేషన్ సేవల దిగ్గజం వాట్స్‌యాప్‌ను ఏకంగా 19 బిలియన్ డాలర్లు(రూ.1.18 లక్షల కోట్లు) వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు ఫేస్బుక్ ఇటీవలే ప్రకటించడం తెలిసిందే.