జుకర్బర్గ్ కూతురి పేరేంటో తెలుసా? | Chen Mingyu is Facebook CEO Mark Zuckerberg’s daughter | Sakshi
Sakshi News home page

జుకర్బర్గ్ కూతురి పేరేంటో తెలుసా?

Published Mon, Feb 8 2016 4:12 PM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM

జుకర్బర్గ్  కూతురి  పేరేంటో తెలుసా? - Sakshi

జుకర్బర్గ్ కూతురి పేరేంటో తెలుసా?

 బీజింగ్: ఫేస్బుక్  సీఈవో మార్క్ జుకర్ బర్గ్  అన్నంత పనీ చేశాడు. తన  గారాల పట్టీకి  చైనీస్ పేరు పెట్టుకుంటానని గతంలోనే ప్రకటించిన జుకర్  తన కోరికను నెరవేర్చుకున్నాడు.  చైనా నూతన సంవత్సరం సంబరాల్లో భాగంగా తన కుమార్తెకు  'చెన్ మింగ్ యూ'  అనే  పేరును  ఖరారు చేశాడు.  ఈ విషయాన్ని జుకర్ దంపతులు తన అధికారిక ఫేస్బుక్లో  అభిమానులతో పంచుకున్నారు.  దీంతో పాటు ఓ క్యూట్  వీడియోనొక్కదాన్ని   షేర్  చేశారు. చైనాలోని మాండరిన్లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్న ఈ దంపతులు తమ చిన్నారి పేరును అధికారికంగా ప్రకటించారు.

చైనా ప్రజలకు లూనార్  నూతన సంవత్సర  శుభాకాంక్షలు తెలిపిన జుకర్ బర్గ్ ...  అలాగే తన భార్య  ప్రిస్కిల్లా, చిన్నారి చెన్కు గ్రీటింగ్స్ తెలిపారు. దీంతోపాటు  పాప పేరులోని  విశేషాలను షేర్ చేశారు. అమ్మ ప్రిస్కిల్లా నుండి వారసత్వంగా చెన్,  రేపటి ప్రకాశవంతమైన భవిష్యత్తును 'మింగ్ యూ'  సూచిస్తుందన్నారు.

కాగా 2012లో  పెళ్లి చేసుకున్న జుకర్ బర్గ్, ప్రిస్కిల్లా దంపతులకు గత ఏడాది నవంబర్లో మాక్స్ పుట్టింది.  సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం  ఫేస్ బుక్ సీఈవోగా యువతరంలో మంచి క్రేజ్  సంపాదించుకున్న జుకర్  పాపాయికి జన్మనిచ్చిన తరువాత క్రేజీ ఫాదర్ ఇమేజ్ సొంతం  చేసుకున్నాడు.  గత ఏడాది చైనా అధ్యక్షుడు లీ జిన్ పింగ్ అమెరికా  పర్యటన సందర్భంగా  తమ పాపకి చైనీ పేరు  పెట్టుకోవాలనే అభిలాషను వ్యక్తం చేశాడు జుకర్. అంతేకాదు తన పాపకు  చైనీ పేరు పెట్టాలని లీని  కోరడం.. దానికి  ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలు రావడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement