ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్ బర్గ్ తీరుపై టెక్ జెయింట్ యాపిల్ సంస్థ సీఈఓ టీమ్ కుక్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల 'మెటా' డిజిటల్ ప్రొడక్టులు అమ్మే డెవలపర్ల నుంచి 50శాతం ఫీజు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అధిక ఫీజులు వసూలు చేస్తూ మెటా వంచనకు పాల్పడుతుందంటూ యాపిల్ సంస్థ ప్రముఖ బిజినెస్ మీడియా సంస్థ మార్కెట్ వాచ్‌కు తెలిపింది
ఎన్‌ఫ్‌టీ వర్చువల్ క్లాతింగ్, సిగ్నేజ్, ఆర్ట్ వర్క్ వంటి డిజిటల్ ప్రొడక్ట్‌లను తయారు చేసే వాళ్లను డెవలపర్లని అంటారు. ఆ డెవలపర్లు ఆ డిజిటల్ ప్రొడక్ట్‌లను తయారు చేసి మెటావర్స్‌కు చెందిన హారిజోన్ ఫ్లాట్‌ఫామ్‌లో అమ్మకానికి పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. హారిజోన్ ఫ్లాట్ ఫామ్ వేదికగా డిజిటల్ ప్రొడక్ట్‌లను అమ్మే డెవలపర్ల నుంచి 50శాతం కమీషన్ వసూలు చేస‍్తుంది.
ఇప్పుడు ఇదే అంశంపై యాపిల్ సంస్థ జుకర్ బర్గ్‌పై మండిపడుతోంది.మెటా నిర్ణయం వల్ల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా జరిగే బిజినెస్‌తో యాపిల్‌కు వచ్చే ఆదాయం దాదాపూ 30శాతం పడిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే పలు మార్లు యాపిల్..మెటా నిర్ణయాన్ని తప‍్పుబడుతూ వస్తోంది. ఎందుకంటే 'యాప్ స్టోర్‌లో పెయిడ్ యాప్స్, ఇన్ యాప్ పర్చేజస్ నుంచి యాపిల్ యాప్ స్టోర్ 30 శాతం స్టాండర్డ్ కమిషన్ను తీసుకుంటోంది. అంత తక్కువ శాతం కమిషన్ తీసుకోవడం వల్లే మెటాకు వచ్చే ఆదాయం పడిపోతుందని, ఇదే అంశంలో మెటా ఆపిల్‌ను పదే పదే టార్గెట్ చేస్తుందని యాపిల్ ప్రతినిధి ఫ్రెడ్ సైంజ్ మార్కెట్ వాచ్‌తో అన్నారు.
పేరు మార్చినా ఆయన తీరు మార్చలేదు!
పేరు మార్చినా మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ తన తీరు మార్చుకోవడం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో యూజర్లు భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు పరమావధిగా మారిందంటూ ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ విజిల్ బ్లోవర్‌గా మారిపోయి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జుకర్ బెర్గ్ డెవలపర్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఫ్రానెన్స్ హౌగెన్ చేసిన ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయనే అంటున్నారు.
చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment