
వాషింగ్టన్: ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిస్సిల్లా చాన్ నవంబర్‌లో జరిగే యూఎస్ ఎన్నికలకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడానికి విరాళాలు ప్రకటించారు. ఇదివరకే కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారులకు అందులో విధుల నిర్వహించనున్నవారికి పీపీఈ కిట్ల కోసం 300 మిలియన్ల డాలర్లను ఇచ్చారు. దీనికి తోడు ఇప్పుడు మరో 100 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు జుకర్‌బర్గ్ జంట మంగళవారం ప్రకటించింది.
‘ఎన్నికల అధికారుల నుంచి మేం ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందన వచ్చింది. అందుకే ఈరోజు మన సెంటర్ ఫర్ టెక్ అండ్ సివిక్ లైఫ్‌కు అదనంగా 100 మిలియన్ డాలర్లను ఇస్తున్నాం’ అని జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు, 2,100 మందికి పైగా సిటిసిఎల్‌కు దరఖాస్తులను సమర్పించారు అని జుకర్‌బర్గ్ రాశారు. సిటిసిఎల్ చికాగోకు చెందిన లాభాపేక్షలేని ఒక సంస్థ. ఇది అమెరికా ఎన్నికలను ఆధునీకరించడానికి ప్రయత్నిస్తోంది. అయితే కొన్ని సంస్థలు తాము పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నమన్న కారణాన్ని చూపి నిధుల వినియోగాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయని, తమ సంస్థ పక్షపాత ఎజెండాను కలిగిలేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment