మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌పై మరోసారి ఆరోపణలు వెల్లువెత్తాయి. తన ఇంటి కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టారని గతంలో స్థానికులు పలు మార్లు ఫిర్యాదు చేశారు. దీంతో చేసేది లేక శానిఫ్రాన్సిస్కోలో ఉన్న తన ఇంటిని మెటా సీఈవో 31 మిలియన్ డాలర్లకు అమ్మినట్లు తెలుస్తోంది. 2012లో కొన్ని ఆ ఇల్లును అమ్మగా ఇప్పుడు అదనంగా 3 రెట్ల లాభం వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
మార్క్ జుకర్‌బర్గ్‌కు శాన్ ఫ్రాన్సిస్కోలో అత్యంత ఖరీదైన నివాసం ఉంది. 1928లో 7వేల స్కైర్ ఫీట్‌లో ఆ ఇంటిని నిర్మిచగా..2012 నవంబర్‌లో సోషల్ మీడియా దిగ్గజం దానిని 10మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.
భార్యకు ప్రేమతో
మే 18, 2012లో ఫేస్‌బుక్ ఐపీవోకి వెళ్లింది. కొన్ని నెలల తర్వాత జుకర్ బర్గ్ తన భార్య ప్రిసిల్లా చాన్‌పై ప్రేమతో అతిపురాతనమైన ఆ ఇంటిని కొనుగోలు చేశారు. లాండ్రీ రూం, వైన్ రూం,వెట్ బార్, గ్రీన్‌తో ఆ ఇంటిని పునరుద్ధరించేందుకు మల్టీ మిలియన్‌డాలర్లు ఖర్చు చేశారు.
ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్
10మిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఆ ఇంటిని కొనుగోలు చేసిన మార్క్ జుకర్‌బర్గ్‌పై స్థానికులు పలు మార్లు ఫిర్యాదు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసిన సమయంలో ఉన్న విస‍్తీర్ణం కంటే అదనంగా మరికొంత స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 7,400 స్కైర్ ఫీట్‌లో ఇంటిని మోడిఫికేషన్ చేసిన జుకర్ బర్గ్..కార్ పార్కింగ్‌ను అక్రమంగా నిర్మించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో జుకర్ బర్గ్ ఆ ఇంటిని అమ్మడం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment