త్వరలో ఫేస్బుక్లో కొత్త ఆప్షన్
శాన్ఫ్రాన్సిస్కో: యూజర్ల కోరిక ఫేస్బుక్ యాజమాన్యం తర్వలో సరికొత్త ఆప్షన్ ప్రవేశపెట్టనుంది. త్వరలో మీ ఫేస్బుక్ పేజీలో డిజ్ లైక్ బటన్ అనే ఆప్షన్ చూడవచ్చు. ఫేస్బుక్ యాజమన్యం ప్రస్తుతం డిజ్లైక్ బటన్ను యాడ్ చేసే పనిలో నిమగ్నమైంది. త్వరలోనే దీన్ని పరీక్షించనుంది. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్లో జరిగిన సమావేశంలో జుకర్ బర్గ్ పాల్గొన్నారు. చాలామంది యూజర్లు డిజ్లైక్ బటన్ ఆప్షన్ కావాలని అడుగుతున్నారని చెప్పారు. వారి కోరిక మేరకు ఈ ఆప్షన్ ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. త్వరలోనే అందుబాటులో ఉంచుతామని చెప్పారు. బాధాకరమైన విషయాలకు లైక్ బటన్ ను ప్రెస్ చేయడాన్ని చాలామంది ఇబ్బందిగా భావిస్తున్నారని అన్నారు. ఇది మంచిది కాదు అని చెప్పేందుకు సంస్థ ఓ మార్గం కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది అని జుకర్ పేర్కొన్నారు.