Dislike Button
-
YouTube: యూట్యూబ్‌లో ఇక అవి కనిపించవు
Youtube Dislike Count No More: గూగుల్ ఆధారిత లైవ్ స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ నుంచి డిస్లైక్ బటన్ కౌంట్‌ను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా ఈ ఫీచర్‌ను తొలగించే అంశంపై తర్జన భర్జన పడుతున్న యూట్యూబ్.. ఎట్టకేలకు ముందడుగు వేసింది. యూట్యూబ్‌లో కొందరు డిస్‌లైక్‌లతో దాడులు, వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో డిస్లైక్ కౌంట్‌ను కనిపించకుండా చేయడం ద్వారా క్రియేటర్స్‌కి, వ్యూయర్స్‌కి మధ్య మర్యాదపూర్వక వాతావరణం నెలకొనవచ్చని యూట్యూబ్ ఆశిస్తోంది. ఇక యూట్యూబ్‌లో కామెంట్ సెక్షన్లో కామెంట్‌కు సైతం డిస్లైక్ బటన్ ఉన్నప్పటికీ.. అది కూడా కౌంట్ చూపించదనే విషయం తెలిసిందే!. ఇప్పుడు దానిని మొత్తం అన్ని వీడియోలకు వర్తింప చేసింది. యూట్యూబ్ తాజా నిర్ణయంతో ముఖ్యంగా చిన్న యూట్యూబ్ ఛానెల్స్, యూట్యూబర్స్కు ఊరట లభించనుంది. అలాగే సినిమావాళ్ల ఫ్యాన్స్ మధ్య డిస్లైక్ వార్‌ను చెక్ పడే ఛాన్స్ ఉంది. కొత్తగా ఏదైనా టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగానే యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్లతో కొట్లాడుకుంటారు. తమ ప్రకోపాన్నంతా డిస్‌లైక్‌ల రూపంలో ప్రదర్శించడం చూస్తుంటాం. అయితే యూట్యూబ్ తాజా నిర్ణయంతో కేవలం కౌంట్ మాత్రమే కనిపించదు. డిస్లైక్ బటన్ మాత్రం యధాతధంగా ఉంటుంది. యూట్యూబ్ స్టూడియో, గణాంకాల ద్వారా ఆ కౌంట్‌ను చూసుకునే వెసులుబాటు ఉంది. ఈ ఫీచర్ కనిపించాలంటే యూట్యూబ్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. Inspiration Story: ఎక్కడికెళ్లినా నిరాదరణే.. కట్ చేస్తే యూట్యూబ్‌తో కోట్లు సంపాదిస్తున్నాడు..! -
యూట్యూబ్ కొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ వార్కి చెక్ పెట్టనుందా?
మన నిత్యజీవితంలో యూట్యూబ్ ఒక భాగమైంది. తీరికగా యూట్యూబ్‌లో వీడియోలను చూస్తు కాలక్షేపం చేస్తాం. అందులో మనకు నచ్చిన వీడియోలను లైక్ కొడతాం. వీడియో నచ్చక పోతే సింపుల్ డిస్లైక్ కొడతాం. యూట్యూబ్‌లో అత్యధికంగా డిస్‌లైక్‌లు కొట్టిన వీడియో ఏది అంటే...? ఠక్కున బాలీవుడ్‌కు చెందిన సడక్-2 ట్రైలర్ అని చెప్తాము. యూజర్లు ఈ విధంగా చేయడంతో ఒకింతా చిత్రపరిశ్రమలో చర్చకు దారి తీసింది. సడఖ్-2 చిత్రం తరువాత వరుణ్ ధవన్ హీరోగా నటించిన కూలీ చిత్ర బృందం లైక్, డిస్లైక్ బటన్ లేకుండా చేసింది. ఒక వీడియోపై మన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి యూట్యూబ్ డిస్లైక్ చేయడం ప్రజాస్వామ్య మార్గాలలో ఒకటిగా చెప్పుకొవచ్చు. కానీ కొంతమంది యూజర్లు వీడియోలకు దురుద్ధేశంతో డిస్‌లైక్‌లను కొట్టడం ఒక వ్యసనంగా మారింది. ఈ సమస్యలన్నింటికీ భవిష్యత్తులో యూట్యూబ్ చెక్ పెట్టనుంది. అందుకుగాను యూట్యూబ్ వివిధ మార్గాలను పరీక్షిస్తోంది. భవిష్యత్తులో యూట్యూబ్‌లో కనిపించే వీడియోలకు డిస్‌లైక్‌ల సంఖ్య కనిపించకుండా, అసలు డిస్లైక్ బటన్ లేకుండా చేయబోతుంది. ప్రస్తుతం ఈ టెస్టును యూట్యూబ్ పరీక్షిస్తోందని ట్విటర్లో తెలిపింది. రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐవోఎస్ సిస్టమ్‌లలో పరీక్షించనుంది. యూజర్ల నుంచి తగు సూచనలు తీసుకున్న తరవాత ఈ ఫీచర్‌ను అమలు చేయనున్నారు. యూట్యూబ్ ఒకటే ఇలాంటి ఫీచర్‌ను తీసుకొని వస్తూదంటే మీరు పొరపడినట్లే. గతంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు నిజమైన యూజర్లను గుర్తించడానికి ఈ ఫీచర్‌ను పరీక్షించాయి. 👍👎 In response to creator feedback around well-being and targeted dislike campaigns, we're testing a few new designs that don't show the public dislike count. If you're part of this small experiment, you might spot one of these designs in the coming weeks (example below!). pic.twitter.com/aemrIcnrbx — YouTube (@YouTube) March 30, 2021 చదవండి: నెలకు రూ.36 లక్షలు సంపాదిస్తున్న 24 ఏళ్ల కుర్రాడు -
త్వరలో ఫేస్బుక్లో కొత్త ఆప్షన్
శాన్ఫ్రాన్సిస్కో: యూజర్ల కోరిక ఫేస్బుక్ యాజమాన్యం తర్వలో సరికొత్త ఆప్షన్ ప్రవేశపెట్టనుంది. త్వరలో మీ ఫేస్బుక్ పేజీలో డిజ్ లైక్ బటన్ అనే ఆప్షన్ చూడవచ్చు. ఫేస్బుక్ యాజమన్యం ప్రస్తుతం డిజ్లైక్ బటన్‌ను యాడ్ చేసే పనిలో నిమగ్నమైంది. త్వరలోనే దీన్ని పరీక్షించనుంది. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లో జరిగిన సమావేశంలో జుకర్ బర్గ్ పాల్గొన్నారు. చాలామంది యూజర్లు డిజ్లైక్ బటన్ ఆప్షన్ కావాలని అడుగుతున్నారని చెప్పారు. వారి కోరిక మేరకు ఈ ఆప్షన్ ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. త్వరలోనే అందుబాటులో ఉంచుతామని చెప్పారు. బాధాకరమైన విషయాలకు లైక్ బటన్ ను ప్రెస్ చేయడాన్ని చాలామంది ఇబ్బందిగా భావిస్తున్నారని అన్నారు. ఇది మంచిది కాదు అని చెప్పేందుకు సంస్థ ఓ మార్గం కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది అని జుకర్ పేర్కొన్నారు.