
Youtube Dislike Count No More: గూగుల్ ఆధారిత లైవ్ స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ నుంచి డిస్‌లైక్ బటన్ కౌంట్‌ను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా ఈ ఫీచర్‌ను తొలగించే అంశంపై తర్జన భర్జన పడుతున్న యూట్యూబ్.. ఎట్టకేలకు ముందడుగు వేసింది.
యూట్యూబ్‌లో కొందరు డిస్‌లైక్‌లతో దాడులు, వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో డిస్‌లైక్ కౌంట్‌ను కనిపించకుండా చేయడం ద్వారా క్రియేటర్స్‌కి, వ్యూయర్స్‌కి మధ్య మర్యాదపూర్వక వాతావరణం నెలకొనవచ్చని యూట్యూబ్ ఆశిస్తోంది. ఇక యూట్యూబ్‌లో కామెంట్ సెక్షన్‌లో కామెంట్‌కు సైతం డిస్‌లైక్ బటన్ ఉన్నప్పటికీ.. అది కూడా కౌంట్ చూపించదనే విషయం తెలిసిందే!. ఇప్పుడు దానిని మొత్తం అన్ని వీడియోలకు వర్తింప చేసింది.
యూట్యూబ్ తాజా నిర్ణయంతో ముఖ్యంగా చిన్న యూట్యూబ్ ఛానెల్స్, యూట్యూబర్స్‌కు ఊరట లభించనుంది. అలాగే సినిమావాళ్ల ఫ్యాన్స్ మధ్య డిస్‌లైక్ వార్‌ను చెక్ పడే ఛాన్స్ ఉంది. కొత్తగా ఏదైనా టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగానే యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్లతో కొట్లాడుకుంటారు. తమ ప్రకోపాన్నంతా డిస్‌లైక్‌ల రూపంలో ప్రదర్శించడం చూస్తుంటాం. అయితే యూట్యూబ్ తాజా నిర్ణయంతో కేవలం కౌంట్ మాత్రమే కనిపించదు. డిస్‌లైక్ బటన్ మాత్రం యధాతధంగా ఉంటుంది. యూట్యూబ్ స్టూడియో, గణాంకాల ద్వారా ఆ కౌంట్‌ను చూసుకునే వెసులుబాటు ఉంది. ఈ ఫీచర్ కనిపించాలంటే యూట్యూబ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.
Inspiration Story: ఎక్కడికెళ్లినా నిరాదరణే.. కట్ చేస్తే యూట్యూబ్‌తో కోట్లు సంపాదిస్తున్నాడు..!
Comments
Please login to add a commentAdd a comment