'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్‌ బుక్‌ను ముంచే విధ్వంసం | Facebook row Google Maps usage 125 times phone usage up by 75 times | Sakshi
Sakshi News home page

Facebook: 'టీ కప్పులో తుఫాను'కాదు..ఫేస్‌ బుక్‌ నుంచి జారుకుంటున్నారు

Published Wed, Oct 13 2021 6:09 PM | Last Updated on Wed, Oct 13 2021 6:53 PM

Facebook row Google Maps usage 125 times phone usage up by 75 times - Sakshi

అక్టోబర్‌ 4న ఫేస్‌బుక్‌, దానికి అనుసందానంగా ఉన్న సర్వీస్‌లు ఫేస్‌బుక్‌ మెసేంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ సేవలు సైతం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో అసౌకర్యానికి గురైన 2.7 బిలియన్ యూజర్లు ప్రత్యామ్నాయ సోషల్‌ నెట్‌ వర్క్‌లను వినియోగించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఫేస్‌బుక్‌లోని పరిణామాలతో భారతీయులు సైతం ఫోన్‌ కాల్స్‌, మెసేజెస్‌, గూగుల్‌ మ్యాప్స్‌ను విపరీతంగా వినియోగిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి. 

ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్‌గా పని చేసిన మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ఫ్రాన్సెస్‌ ఆరోపణలు చేసిన ప్రారంభంలో జూకర్‌ బెర్గ్‌ సైతం ఇదంతా 'టీ కప్పులో తుఫాను' అని అనుకున్నారు. కానీ పెను విధ్వంసానికి దారితీసింది. దీంతో ఫేస్‌బుక్‌ గురించి పాజిటివ్‌ ప్రచారం చేయాలని ఫేస్‌బుక్‌ ఉద్యోగులను బతిమాలడుడుకుంటుంది.అయినా పరిస్థితి చక్కబడేలా లేదని తెలుస్తోంది. ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ పెట్టిన చిచ్చు..భారత్‌లో ఫేస్‌ బుక్‌ వినియోగం మరింత తగ్గిపోతున్నట్లు తేలింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ స్టార‍్టప్‌ 'బాబుల్‌ ఏఐ' (Bobble AI) నివేదిక ప్రకారం..భారతీయులు కుటుంబ సభ్యుల్ని,స్నేహితుల్ని పలకరించేందుకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను వినియోగించేవారు. కానీ వాటి వినియోగం ఇప్పుడు బాగా తగ్గినట్లు నివేదికలో పేర్కొంది. మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ఫోన్‌ ద్వారా కమ్యునికేషన్‌ చేసే పద్దతి 75 రెట్లు పెరిగినట్లు చెప్పింది. ఆన్‌ లైన్‌ ట్రాన్సాక్షన్‌లలో గూగుల్‌ పేలో యూజర్ల వినియోగం 200 రెట్లు పెరిగిందని,యూజర్ల తాకిడి ఎక్కువై కొన్ని సార్లు స్తంభించినట్లు వెల్లడించింది. 

అక్టోబర్ 4న, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ దాని మెసెంజర్ ప్రపంచంలోని 3.5 బిలియన్ వినియోగదారులకు ఆరు గంటల పాటు అందుబాటులో లేవు. ఈ అంతరాయంతో ఇతర సోషల్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్‌కు 140రెట్లు, ట్విట్టర్‌కు 7రెట్ల యూజర్ల వినియోగం పెరిగింది. యూట్యూబ్‌లో 30రెట్లు, జియోప్లే వంటి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫారమ్‌లలో 20రెట్ల ట్రాఫిక్‌ పెరిగింది. ఎఫ్‌ఎం రేడియో వినియోగం 20 రెట్లు, ఇతర మ్యూజిక్ యాప్స్ వాడకం 700 రెట్లు పెరిగినట్లు తేలింది. గేమింగ్ కేటగిరీలో బాటిల్ రాయల్ గేమ్స్ 70 సార్లు, టెంపుల్ రన్  40 సార్లు, పార్కింగ్ జామ్ 3డి 15 సార్లు ట్రాఫిక్‌ పెరిగినట్లు స్టార‍్టప్‌ బాబుల్‌ ఏఐ చెప్పింది.

చదవండి: ఆరు గంటల్లో 50 వేల కోట్ల నష్టం.. హ్యాకింగ్‌ కాదు జరిగింది ఇది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement