google maps traffic
-
వాహనదారులకు గూగుల్ అదిరిపోయే ఫీచర్!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ వాహనదారులకు అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రాంతానికి చేరుకోకముందే ఛార్జీలు ఎంతో తెలిస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఈ కాన్సెప్ట్ తో గూగుల్ టోల్ ఛార్జెస్ ఎస్టిమేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. భారత్, అమెరికా, ఇండోనేషియా ఇతర దేశాలకు చెందిన 2వేల రూట్లలో ఈ ఫీచర్లు ప్రారంభించింది. టోల్ ధరలు ఎలా తెలుసుకోవాలంటే వాహనదారులు టోల్ ధరలు తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్స్‌లో ఆరిజిన్, డెస్టినేషన్ వివరాల్ని ఎంటర్ చేయాలి. దీంతో మీకు వెంటనే రోడ్డు మార్గానికి సంబంధించిన రూట్లు,షార్ట్ కట్లతో పాటు ఎస్టిమేట్ టోల్ ధరల డిస్ప్లే అవుతాయి. అంతే కాదు ఆ రూట్లో ఉన్న అన్నీ టోల్ బూత్ ధరల్ని చూపుతుంది. కాగా, గూగుల్ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే కర్ణాటకలో చాలా రోడ్లపై డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
గూగుల్ అదిరిపోయే ఫీచర్, రద్దీ ఎలా ఉందో ఇట్టే చెప్పేస్తుంది..!
షాపింగ్ చేయడానికో లేదంటే ఇతరాత్ర పనుల మీద బయటకు వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకు కరోనానే కారణం. మహమ్మారి వల్ల మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. మాట్లాడాలన్నా, ఫ్రీ గా తిరగాలన్నా సాధ్యం కావడం లేదు. రద్దీగా ఉండే ప్రాంతాలవైపు వెళ్లడమే మానేశాం. అందుకే ఆ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ 'గూగుల్ మ్యాప్స్'లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్ని గుర్తిస్తుంది. హాలిడేస్‌లో సరదగా కుటుంబ సభ్యులకు బయటకు వెళ్లేందుకు, లేదంటే షాపింగ్ చేసేలా గూగుల్ మ్యాప్స్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం గూగుల్ సంబంధిత ప్రాంతాలకు చెందిన వ్యాపార వివరాలు, డైరెక్టరీస్ (సంస్థల వివరాలు )ను సేకరించింది. వాటి సాయంతో లోకేషన్లో ఉన్న వ్యక్తుల కదలికలు, ఏ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉందో గుర్తించేందుకు సహాయపడనుంది. వరల్డ్ వైడ్‌గా గూగుల్ ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకోసం వరల్డ్ వైడ్‌గా అందుబాటులోకి తీసుకొనిరానుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు, మాల్స్, బస్సు, రైల్వేస్టేషన్లతో పాటు, భవనాల రహదారులను గుర్తించడానికి సహాయపడుతుంది. ఈ ఫీచర్ జోడించబడిన తర్వాత, వినియోగదారులు ఒకే చోట అందుబాటులో ఉన్న అన్ని షాపులు, రెస్టారెంట్లు, విమానాశ్రయ లాంజ్‌లు, కార్ రెంటల్, పార్కింగ్ స్థలాల్ని ఈజీగా గుర్తించవచ్చని గూగుల్ ప్రకటనలో వెల్లడించింది. చదవండి : గూగుల్ అదిరిపోయే శుభవార్త, ఇక యూట్యూబ్‌లో చెలరేగిపోవచ్చు -
'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం
అక్టోబర్ 4న ఫేస్బుక్, దానికి అనుసందానంగా ఉన్న సర్వీస్‌లు ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలు సైతం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో అసౌకర్యానికి గురైన 2.7 బిలియన్ యూజర్లు ప్రత్యామ్నాయ సోషల్ నెట్ వర్క్‌లను వినియోగించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఫేస్‌బుక్‌లోని పరిణామాలతో భారతీయులు సైతం ఫోన్ కాల్స్, మెసేజెస్, గూగుల్ మ్యాప్స్‌ను విపరీతంగా వినియోగిస్తున్నట్లు పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. ఫేస్బుక్లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్‌గా పని చేసిన మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ఫ్రాన్సెస్ ఆరోపణలు చేసిన ప్రారంభంలో జూకర్ బెర్గ్ సైతం ఇదంతా 'టీ కప్పులో తుఫాను' అని అనుకున్నారు. కానీ పెను విధ్వంసానికి దారితీసింది. దీంతో ఫేస్బుక్ గురించి పాజిటివ్ ప్రచారం చేయాలని ఫేస్బుక్ ఉద్యోగులను బతిమాలడుడుకుంటుంది.అయినా పరిస్థితి చక్కబడేలా లేదని తెలుస్తోంది. ఫ్రాన్సెస్ హౌగెన్ పెట్టిన చిచ్చు..భారత్‌లో ఫేస్ బుక్ వినియోగం మరింత తగ్గిపోతున్నట్లు తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ 'బాబుల్ ఏఐ' (Bobble AI) నివేదిక ప్రకారం..భారతీయులు కుటుంబ సభ్యుల్ని,స్నేహితుల్ని పలకరించేందుకు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను వినియోగించేవారు. కానీ వాటి వినియోగం ఇప్పుడు బాగా తగ్గినట్లు నివేదికలో పేర్కొంది. మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ఫోన్ ద్వారా కమ్యునికేషన్ చేసే పద్దతి 75 రెట్లు పెరిగినట్లు చెప్పింది. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లలో గూగుల్ పేలో యూజర్ల వినియోగం 200 రెట్లు పెరిగిందని,యూజర్ల తాకిడి ఎక్కువై కొన్ని సార్లు స్తంభించినట్లు వెల్లడించింది. అక్టోబర్ 4న, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దాని మెసెంజర్ ప్రపంచంలోని 3.5 బిలియన్ వినియోగదారులకు ఆరు గంటల పాటు అందుబాటులో లేవు. ఈ అంతరాయంతో ఇతర సోషల్ నెట్వర్క్ సిగ్నల్‌కు 140రెట్లు, ట్విట్టర్‌కు 7రెట్ల యూజర్ల వినియోగం పెరిగింది. యూట్యూబ్‌లో 30రెట్లు, జియోప్లే వంటి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్‌లలో 20రెట్ల ట్రాఫిక్ పెరిగింది. ఎఫ్ఎం రేడియో వినియోగం 20 రెట్లు, ఇతర మ్యూజిక్ యాప్స్ వాడకం 700 రెట్లు పెరిగినట్లు తేలింది. గేమింగ్ కేటగిరీలో బాటిల్ రాయల్ గేమ్స్ 70 సార్లు, టెంపుల్ రన్ 40 సార్లు, పార్కింగ్ జామ్ 3డి 15 సార్లు ట్రాఫిక్ పెరిగినట్లు స్టార్టప్ బాబుల్ ఏఐ చెప్పింది. చదవండి: ఆరు గంటల్లో 50 వేల కోట్ల నష్టం.. హ్యాకింగ్ కాదు జరిగింది ఇది -
విశాఖలో అప్పటికప్పుడే గూగుల్ ట్రాఫిక్ అప్డేట్లు!
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సహా.. దేశంలోని మరో 12 నగరాల్లో ట్రాఫిక్ అప్డేట్లను ఎప్పటికప్పుడే అందించేందుకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సిద్ధమైంది. ఈ అప్డేట్లన్నీ గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నంతో పాటు కోల్‌కతా, తిరువనంతపురం, భోపాల్, కోయంబత్తూరు, లక్నో, సూరత్, ఇండోర్, లూథియానా, నాగ్‌పూర్, కొచ్చి, మదురై నగరాల్లో ఈ అప్డేట్లు ఉంటాయి. మొత్తం అన్ని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేల మీద ట్రాఫిక్ సమాచారాన్ని కూడా అందిస్తారు. భారతీయులకు ఈ 12 నగరాలకు సంబంధించిన ట్రాఫిక్ రియల్ టైం అప్డేట్లు అందించేందుకు తాము గూగుల్ మ్యాప్స్‌ను మరింత సమగ్రంగా తీర్చిదిద్దతున్నామని గూగుల్ ప్రోగ్రాం మేనేజ్మెంట్ డైరెక్టర్ సురేన్ రుహేలా తెలిపారు. గూగుల్ మ్యాప్స్ మొబైల్ వెర్షన్‌తో పాటు డెస్క్‌టాప్‌లో కూడా ఈ ట్రాఫిక్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పటికే 22 నగరాలకు సంబంధించిన రియల్ టైం ట్రాఫిక్ సమాచారం ఉండగా, ఇప్పుడు మరో 12 నగరాలు చేర్చడంతో మొత్తం 34 నగరాలలో ఏ రోడ్డు మీద ట్రాఫిక్ ఎలా ఉందో ఎప్పటికప్పుడే చెబుతారు. ఎక్కడ ట్రాఫిక్ ఎలా కదులుతోందన్న విషయాన్ని వేర్వేరు రంగులతో సూచిస్తారు. ఆకుపచ్చ రంగులో ఉందంటే.. అసలు అక్కడ ఎలాంటి ట్రాఫిక్ జాం లేదని అర్థం. నారింజ రంగు ఉంటే.. ఓ మాదిరిగా ఉందని, అదే ఎర్రగా ఉంటే ట్రాఫిక్ మొత్తం జాం అయిపోయిందని అర్థం చేసుకోవాలి.