ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ వాహనదారులకు అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రాంతానికి చేరుకోకముందే ఛార్జీలు ఎంతో తెలిస్తే ఎలా ఉంటుంది.
ఇదిగో ఈ కాన్సెప్ట్ తో గూగుల్ టోల్ ఛార్జెస్ ఎస్టిమేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. భారత్, అమెరికా, ఇండోనేషియా ఇతర దేశాలకు చెందిన 2వేల రూట్లలో ఈ ఫీచర్లు ప్రారంభించింది.
టోల్ ధరలు ఎలా తెలుసుకోవాలంటే
వాహనదారులు టోల్ ధరలు తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్స్‌లో ఆరిజిన్, డెస్టినేషన్ వివరాల్ని ఎంటర్ చేయాలి. దీంతో మీకు వెంటనే రోడ్డు మార్గానికి సంబంధించిన రూట్‌లు,షార్ట్ కట్‌లతో పాటు ఎస్టిమేట్ టోల్ ధరల డిస్‌ప్లే అవుతాయి. అంతే కాదు ఆ రూట్‌లో ఉన్న అన్నీ టోల్ బూత్ ధరల్ని చూపుతుంది. కాగా, గూగుల్ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే కర్ణాటకలో చాలా రోడ్లపై డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment