విశాఖలో అప్పటికప్పుడే గూగుల్ ట్రాఫిక్ అప్డేట్లు! | Real-time traffic updates available in 12 more Indian cities, says Google | Sakshi
Sakshi News home page

విశాఖలో అప్పటికప్పుడే గూగుల్ ట్రాఫిక్ అప్డేట్లు!

Published Tue, Jun 30 2015 5:19 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

విశాఖలో అప్పటికప్పుడే గూగుల్ ట్రాఫిక్ అప్డేట్లు!

విశాఖలో అప్పటికప్పుడే గూగుల్ ట్రాఫిక్ అప్డేట్లు!

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సహా.. దేశంలోని మరో 12 నగరాల్లో ట్రాఫిక్ అప్డేట్లను ఎప్పటికప్పుడే అందించేందుకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సిద్ధమైంది. ఈ అప్డేట్లన్నీ గూగుల్ మ్యాప్స్లో అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నంతో పాటు కోల్కతా, తిరువనంతపురం, భోపాల్, కోయంబత్తూరు, లక్నో, సూరత్, ఇండోర్, లూథియానా, నాగ్పూర్, కొచ్చి, మదురై నగరాల్లో ఈ అప్డేట్లు ఉంటాయి. మొత్తం అన్ని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేల మీద ట్రాఫిక్ సమాచారాన్ని కూడా అందిస్తారు. భారతీయులకు ఈ 12 నగరాలకు సంబంధించిన ట్రాఫిక్ రియల్ టైం అప్డేట్లు అందించేందుకు తాము గూగుల్ మ్యాప్స్ను మరింత సమగ్రంగా తీర్చిదిద్దతున్నామని గూగుల్ ప్రోగ్రాం మేనేజ్మెంట్ డైరెక్టర్ సురేన్ రుహేలా తెలిపారు.

గూగుల్ మ్యాప్స్ మొబైల్ వెర్షన్తో పాటు డెస్క్టాప్లో కూడా ఈ ట్రాఫిక్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పటికే 22 నగరాలకు సంబంధించిన రియల్ టైం ట్రాఫిక్ సమాచారం ఉండగా, ఇప్పుడు మరో 12 నగరాలు చేర్చడంతో మొత్తం 34 నగరాలలో ఏ రోడ్డు మీద ట్రాఫిక్ ఎలా ఉందో ఎప్పటికప్పుడే చెబుతారు. ఎక్కడ ట్రాఫిక్ ఎలా కదులుతోందన్న విషయాన్ని వేర్వేరు రంగులతో సూచిస్తారు. ఆకుపచ్చ రంగులో ఉందంటే.. అసలు అక్కడ ఎలాంటి ట్రాఫిక్ జాం లేదని అర్థం. నారింజ రంగు ఉంటే.. ఓ మాదిరిగా ఉందని, అదే ఎర్రగా ఉంటే ట్రాఫిక్ మొత్తం జాం అయిపోయిందని అర్థం చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement